Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Strawberry Legs: స్ట్రాబెర్రీ లెగ్స్.. ఈ ఈజీ చిట్కాలతో సమస్య ఇట్టే పోతుంది
కాళ్లపై చిన్న చిన్న సైజుల్లో నల్ల మచ్చలు కనిపిస్తున్నాయా? ఇది చాలా మందిలో కనిపించే సమస్యే. ఎక్కువ మంది పెద్దగా పట్టించుకోరు. వెస్టర్న్ తరహా డ్రెస్సులు వేసే వారికి ఇవి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.

స్ట్రాబెర్రీ లెగ్స్ అంటే ఏంటి?
మిగతా పండ్లకు గింజలు లోపల నుండి స్ట్రాబెర్రీకి మాత్రం పైన ఉంటాయి. చుక్కలుగా కనిపిస్తాయి. స్ట్రాబెర్రీ లెగ్స్ అంటే కూడా కాళ్లపై చిన్న చిన్న నల్ల మచ్చలు కనిపిస్తాయి. ఇవి చూడటానికి స్ట్రాబెర్రీ మాదిరిగా కనిపిస్తాయి. అలా స్ట్రాబెర్రీ లెగ్స్ అనే పేరు వచ్చింది.
ఈ పరిస్థితిని కామెడోన్స్ లేదా ఓపెన్ కామెడోన్స్ అని పిలుస్తారు. ఆయిల్, బ్యాక్టీరియా, మృత చర్మ కణాలు వెంట్రుకల కుదుళ్లలో పేరుకుపోతాయి. అవి రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తాయి. దీని వల్ల బ్లాక్ హెడ్స్ లైదా వైట్ హెడ్స్ ఏర్పడతాయి. ఇది చూడటాని అచ్చం స్ట్రాబెర్రీ ఉపరితలంలా కనిపిస్తుంది. తరచూ కాళ్లను షేవ్ చేసుకునే వారిలో, పొడి చర్మం ఉన్న వారిలో స్ట్రాబెర్రీ లెగ్స్ ఎక్కువగా కనిపిస్తాయి.
స్ట్రాబెర్రీ లెగ్స్ కారణాలు:
షేవింగ్:
స్ట్రాబెర్రీ లెగ్స్ వాక్సింగ్ లేదా షేవింగ్ వల్ల తలెత్తే సాధారణ సమస్య. ఇది చికాకు, మంటను కలిగిస్తుంది. జుట్టు కుదుళ్లు అడ్డుపడేలా చేస్తుంది.
పొడి చర్మం:
పొడి చర్మం వల్ల హెయిర్ ఫోలికల్స్ డెడ్ స్కిన్ సెల్స్, ఇతర చెత్తతో మూసుకుపోతాయి.
హార్మోన్ల మార్పులు:
యుక్తవయస్సు లేదా గర్భధారణ సమయంలో సంభవించే హార్మోన్ల మార్పులు సెబమ్ ఉత్పత్తిలో పెరుగుదలకు కారణం అవుతాయి. ఇది రంధ్రాల అడ్డుపడటానికి దోహదం చేస్తాయి.
జెనెటిక్స్:
జన్యుపరమైన కారణాల వల్ల కూడా స్ట్రాబెర్రీ లెగ్స్ కనిపిస్తాయి.
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు:
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు బ్లాక్ హెడ్స్ లేదా వైట్ హెడ్స్ ఏర్పడటానికి దారి తీస్తాయి. ఇవి స్ట్రాబెర్రీ లెగ్స్ వచ్చేందుకు కారణం అవుతాయి.
స్ట్రాబెర్రీ లెగ్స్‌ను వదిలించుకోవడం ఎలా?
ఎక్స్‌ఫోలియేట్ చేసుకోవాలి:
ఎక్స్‌ఫోలియేట్ చేసుకోవడం వల్ల కాళ్లపై మృత కణాలు తొలగిపోతాయి. కాళ్లను వారానికి రెండు, మూడు సార్లు ఎక్స్‌ఫోలియేట్ చేస్తుండాలి.
మాయిశ్చరైజర్ వాడాలి:
కాళ్లను తేమగా ఉంచేందుకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. కాళ్లు పొడిబారకుండా చూసుకోవాలి. కామెడోజెనిక్ లేని మాయిశ్చరైజర్ ను ఎంచుకుని, స్నానం చేసిన తర్వాత అప్లై చేసుకోవాలి.
ఎపిలేటర్:
స్ట్రాబెర్రీ లెగ్స్ ఉన్న వ్యక్తుల్లో ఎపిలేటర్ సరైన ఎంపిక. ఇది ఎలక్ట్రికల్ గాడ్జెట్. దీంతో కాళ్లపై ఉన్న వెంట్రుకల కుదుళ్ల నుండి తొలగించవచ్చు.
సాలిసిలిక్ యాసిడ్ బాడీ వాష్:
సాలిసిలిక్ యాసిడ్ అనేది ఒక రకమైన బీటా-హైడ్రాక్సీ యాసిడ్. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి, వెంట్రుకల కుదుళ్లను అన్‌లాగ్ చేయడానికి సహాయపడుతుంది.
బిగుతు దుస్తులు వేసుకోవద్దు:
బిగుతుగా ఉండే దుస్తులు చర్మానికి చికాకును పుట్టిస్తాయి. చెమటను ఆరిపోకుండా చేస్తాయి. దీని వల్ల బ్యాక్టీరియా చేరుతుంది.
డ్రై బ్రషింగ్:
స్నానం చేయడానికి ముందు వృత్తాకారంగా ఉండే పొడి బ్రష్ లేదా కఠినమైన టవల్ తో చర్మాన్ని రాయాలి. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని తేలికపాటి సబ్బుతో లేదా గోరువెచ్చని నీటితో కడగాలి.



Click it and Unblock the Notifications