Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఈ ఒక్క కాయను రసాన్ని ముఖానికి రాసుకుంటే.. తళతళా మెరిసే చర్మం మీ సొంతం,ఎలా అంటే?
గుమ్మడికాయతో కేవలం వంటలు మాత్రమే చేస్తారని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆ గుమ్మడి కాయ వల్ల చర్మానికి ఎంతో మేలు జరుగుతుందని ఎవరికీ తెలియదు. గుమ్మడి కాయలో చర్మానికి మేలు చేసే పోషకాలు ఉటాయి. గుమ్మడి కాయలో విటమిన్ ఎ, సి, ఈ, జింక్, మెగ్నీషియం, బీటా కెరోటిన్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాల కారణంగా చర్మం చాలా మేలు జరుగుతుంది. ఈ గుమ్మడి కాయలతో చేసే ఫేస్ ప్యాక్ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అలాగే చర్మం మృదువుగా చేయడానికి, మొటిమలు తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. అయితే ఈ ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గుమ్మడి కాయతో ఫేస్ ప్యాక్ తయారీకి కావాల్సిన పదార్థాలు
గుమ్మడికాయ ముక్కలు - 1/2 కప్పు
తేనె - 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం - 1/2 టేబుల్ స్పూన్ (ఐచ్ఛికం)
పెరుగు - 2 టేబుల్ స్పూన్లు (ఐచ్ఛికం)

గుమ్మడి కాయలతో ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలి
గుమ్మడికాయ ముక్కలను బాగా ఉడికించి, మిక్సీలో మెత్తగా చేయండి. ఆ తరువాత ఆ ప్యూరీలో తేనె, నిమ్మరసం లేదా పెరుగు వేసి బాగా కలపాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాలు ఉంచండి. అనంతరం చల్లటి నీటితో కడిగేయండి. అంతే తళతళా మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.
గుమ్మడికాయ ఫేస్ ప్యాక్ యొక్క ప్రయోజనాలు:
ఈ గుమ్మడికాయలతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. గుమ్మడికాయలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మరమ్మతు చేసి, కాంతివంతంగా చేస్తాయి. అలాగే అందులో ఉండే జింక్ మొటిమలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీంతోపాటు ఎంజైమ్‌లు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసి, మృదువుగా చేస్తాయి. అందులోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, ముడతలను తగ్గిస్తుంది. అలాగే ఇది హైడ్రేట్ చేసి, పొడిబారకుండా కాపాడుతుంది.



Click it and Unblock the Notifications