Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
అందం మాట దేవుడెరుగు! వీటిని తరచూ తింటే ముఖం పాడైపోయి చూడబుద్ధి కాదు
అందంగా కనిపించాలని, మెరిసిపోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మహిళలకు ఇంకొద్దిగా ఎక్కువే ఉంటుంది. స్త్రీ, పురుషులు అనే తేడాల్లేకుండా అందంగా కనిపించడానికి చాలా మంది రకరకాల క్రీములు, ఫేస్ వాష్‌లు, సీరమ్‌లు వాడుతుంటారు. అయితే కేవలం క్రీములు రాయడం వల్ల ముఖం కాంతివంతంగా మారదు. పుష్కలంగా నీరు తాగడం, సరైన ఆహారం తినడం, చర్మ సంరక్షణ పాటించడం వల్ల మాత్రమే అందం సొంతం అవుతుంది.
అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల అవి శరీరంపై ప్రభావం చూపి చర్మాన్ని కాంతిహీనంగా మారుస్తాయి. చర్మం పొడిబారడం, మచ్చలు ఏర్పడతాయి. అసలు ఎలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల చర్మం పాడవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక గ్లైసెమిక్ ఇండెక్స్:
అధిక గ్లైసెమిక్ ఇండెక్స్(GI) ఉన్న ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. దాని వల్ల వాపు వస్తుంది. ఇది చర్మాన్ని దెబ్బతీస్తుంది. వైట్ బ్రెడ్, వైట్ రైస్, చక్కెర పానీయాల్లో అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది.
ప్రాసెస్డ్ ఫుడ్స్:
ప్రాసెస్డ్ ఫుడ్స్ లో సోడియం సహా అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. వీటి వల్ల చర్మంపై మొటిమలు వస్తాయి. ఇతర చర్మ సమస్యలు తలెత్తుతాయి.
మద్యం:
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. దీని వల్ల చర్మం పొడిబారి నిస్తేజంగా కనిపిస్తుంది. డీహైడ్రేషన్ వల్ల చర్మం పొడిబారడమే కాకుండా ఇతర సమస్యలూ వస్తాయి. కాబట్టి ఆల్కహాల్ పరిమితంగా తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి.
ఫ్రైడ్ ఫుడ్స్:
వేయించిన ఆహారాల్లో అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఈ కొవ్వులు ఇన్‌ఫ్లమేషన్‌కు కారణం అవుతాయి. ఇతర చర్మ సమస్యలు కూడా వస్తాయి.
చక్కెర పానీయాలు:
చక్కెర పానీయాల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. పోషకాలు తక్కువగా ఉంటాయి. ఇది ఇన్‌ఫ్లమేషన్‌కు కారణం అవుతాయి. దీని వల్ల చర్మంపై మొటిమలు వస్తాయి. అలాగే ఇతర సమస్యలూ తలెత్తుతాయి.
కెఫిన్:
కెఫిన్ చర్మాన్ని డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది. దీని వల్ల చర్మం పొడిబారి, కాంతిహీనంగా మారుతుంది. టీ, కాఫీలు తగ్గడాన్ని పరిమితం చేయాలి. పుష్కలంగా నీరు తాగాలి.
ఉప్పు:
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. శరీరం డీహైడ్రేషన్ కు గిరి కావడం వల్ల చర్మం పొడిబారుతుంది. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఉప్పును మోతాదుకు మించి తీసుకోవద్దు.
ఆరోగ్యకరమైన చర్మం కోసం ఏం తినాలి?
నీరు:
శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా అవసరం. దీని వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. చర్మం తేమ వల్ల కాంతివతంగా కనిపిస్తుంది. అందుకే రోజూ పుష్కలంగా నీరు తాగాలి.
పండ్లు, కూరగాయలు:
పండ్లు, కూరగయలు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇది చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది. రోజుకు కనీస మొత్తంలో తాజా పండ్లు, కూరగాయలు తినాలి. సీజనల్ ఫ్రూట్స్, వెజిటెబుల్స్ తినడం వల్ల అవసరమైన పోషకాలు అందుతాయి.
తృణధాన్యాలు:
తృణధాన్యాల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇది వాపును తగ్గించడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
లీన్ ప్రోటీన్:
కణజాలాన్ని నిర్మించడానికి, మరమ్మతు చేయడానికి లీన్ ప్రోటీన్ చాలా కీలకం. ఇది వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. చికెన్, చేపలు, బీన్స్ లో లీన్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.



Click it and Unblock the Notifications