Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Pushpa allu arjun: పుష్పలో అల్లు అర్జున్‌లాగా జుట్టు రావాలంటే ఇవి తినాలి!
ప్రస్తుత కాలంలో అందరినీ ఇబ్బంది పెడుతున్న అతి ముఖ్యమైన సమస్య జుట్టు రాలిపోవడం. జుట్టు ఒత్తుగా లేకపోవడం, బట్టతల వచ్చేయడం. చెడు ఆహారపు అలవాట్లు, కాలుష్యం, ఒత్తిడి, కలుషిత నీరు తదితర కారణాల వల్ల జుట్టు చాలా రాలిపోతుంది. అలాగే ఒత్తుగా మారడం లేదు. ఈ సమస్యలను పోగొట్టుకోవడానికి చాలా మంది రకరకాల ఆయిల్స్ వాడుతుంటారు. హెయిర్ పాక్స్, హెయిర్ మాస్కులు, హెయిర్ సీరం వినియోగిస్తుంటారు. అయినప్పటికీ వారికి ఫలితాలు రావు. అలాంటి వ్యక్తులు ఈ ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకుంటే జట్టు పెరుగుదలలో వేగం పెరుగుతుంది. వెంట్రుకలు ఒత్తుగా ఉంటాయి. జుట్టు రాలడం కూడా తగ్గిపోతుంది. ఆ ఆహారపదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నట్స్:
నట్స్ తినడం వల్ల జుట్టుకు మాత్రమే ఆరోగ్యానికి కూడా చాలా మేలు జరుగుతుంది. పొద్దు తిరుగుడు పువ్వు గింజలు, గుమ్మడి గింజలు, నువ్వుల గింజలు తినాల్సి ఉంటుంది. ఇందులోని ఐరన్, జింక్, మెగ్నీషియం, సెలీనియం, క్యాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జట్టు రాలడాన్ని నివారిస్తుంది. అలాగే జుట్టు వేపుగా పెరగడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టు నల్లగా, ఒత్తుగా తయారవడానికి సహాయపడతాయి.

దానిమ్మ
దానిమ్మ పండులో విటమిన్ కే, విటమిన్ సీ, ఫైబర్, పొటాషియం, ప్రోటీన్లు, ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్, పోషకాలు జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలను అందజేస్తాయి. అలాగే జుట్టు ఒత్తుగా పెరిగేందుకు సహాయపడతాయి. జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తాయి.
కొబ్బరి
సాధారణంగా జుట్టుకు చాలా మంది కొబ్బరి నూనెను రాస్తుంటారు. అయితే కొబ్బరిని తినడం వల్ల కూడా జుట్టుకు మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిలోని మాంగనీస్, ప్రోటీన్, పొటాషియం, సెలీనియం జట్టు పెరుగుదలకు సహాయపడతాయి. సహజసిద్ధంగా నల్లగా నిగనిగలాడే జుట్టు గ్రో అవడానికి ఉపయోగపడతాయి.
ఉసిరి
ఉసిరిలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. దీని కారణంగా రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. అలాగే జుట్టుకు కావాల్సిన పోషకాలు అందిస్తాయి. తద్వారా జుట్టు సంబంధిత సమస్యలు తొలిపొయి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. రాలిపోయిన వెంట్రుకలు కూడా తిరిగి వచ్చే ఛాన్సుంటుంది.
మునగాకు
మునగ తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయన్న విషయం తెలిసిందే. మునగ మాత్రమే కాదు మునగాకు వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు. మరీ ముఖ్యంగా జుట్టు ఆరోగ్యానికి ఇది ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో విటమిన్ A, C, Eలు పుష్కలంగా ఉంటాయి. యాంటీ యాక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు హాని కలిగించే క్రీములను నాశనం చేసి జుట్టు పెరగడానికి, రాలిపోవడాన్ని నివారిస్తాయి.
కరివేపాకు, మెంతులు
ఈ కరివేపాకులు యాంటీ యాక్సిడెంట్లు, అమినో యాసిడ్స్, విటమిన్ బీ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టు నెరిసిపోవడాన్ని నివారిస్తాయి. జుట్టు నల్లగా నిగనిగలాడేందుకు సహాయపడతాయి. అలాగే మెంతుల్లో విటమిన్స్, మినరల్స్ పుష్కంగా ఉంటాయి. ఇవి జుట్టుకు కావాల్సిన బలాన్ని అందజేస్తాయి. తద్వారా జుట్టు రాలిపోవడం ఆగిపోతుంది. ఫలితంగా జుట్టు ఒత్తుగా మారడంతో పాటు, బలంగా తయారవుతుంది.



Click it and Unblock the Notifications