Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఇది ఒక్క చుక్క రాసుకుంటే చాలు, క్షణంలోనే డార్క్ సర్కిల్స్ మాయమైపోతాయి.. అందరి ఇంట్లో ఉంటుంది!
మారిన జీవన విధానం కారణంగా చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా అందానికి సంబంధించిన సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ముఖంపై చర్మం చాలా తొందరగా ముడతపడిపోవడం, ముఖం ముదురుగా కనిపించడం, అందం తగ్గిపోవడం వంటి సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. అలాగే మొబైల్, ల్యాప్‌టాప్స్‌ను ఎక్కువగా వినియోగించడం వలన కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఎక్కువగా రావడం వంటి సమస్యలను మనం గమనించవచ్చు. అయితే ఆ డార్క్ సర్కిల్స్ తొలగించుకోవడానికి చాలా మంది రకరకాలుగా ట్రై చేస్తుంటారు. ఏవేవో క్రీమ్స్ వాడుతుంటారు. అయితే ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతో ఆ డార్క్ సర్కిల్స్‌ను ఎలాంటి ఎఫెక్ట్స్ లేకుండా తొలగించుకోవచ్చు. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ స్టోరీలో..
డార్క్ సర్కిల్ తొలగించుకోవడానికి, క్రీం తయారీకి కావాల్సిన పదార్థాలు
ఆలుగడ్డ
శనగపిండి
కొద్దిగా పెరుగు
కొద్దిగా పసుపు

క్రీం తయారీ విధానం
ముందుగా ఆలుగడ్డను తొక్క తీసి శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తరువాత ఆ ఆలుగడ్డను సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని.. అందులో ఆలుగడ్డ రసాన్ని తీసుకోవాలి. ఆ తరువాత అందులో ఒక చెంచా శనగ పిండి వేసుకోవాలి. దాంతో పాటు ఒక చెంచా పెరుగు కూడా వేసుకోవాలి. అనంతరం చిటికెడు పసుపు వేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. అందులోని పదార్థాలు అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. అంతే క్రీం సిద్ధమైనట్లే..
ఎలా అప్లై చేసుకోవాలంటే..
ఈ క్రీం అప్లై చేసుకోవడం చాలా సులభం. ముందుగా ఈ క్రీంను.. మన కంటి కిందకు అలాగే కనురెప్పలపై రాసుకోవాలి. అనంతరం మెల్లిగా ఓసారి మర్దన చేసుకోవాలి. అనంతరం ఒక పదిహేను నిమిషాల పాటు వాటిని ఆరనివ్వాలి. ఆపై గోరు వెచ్చని నీటితో మీ ఫేస్ కడుక్కుంటే సరిపోతుంది. ఇలా ఒక అయిదు లేదా ఆరు రోజుల పాటు చేస్తే.. కచ్చితంగా మంచి ఫలితాన్ని మీరు పొందవచ్చు. డార్క్ సర్కిల్స్ తొలగిపోవడాన్ని మీరు గమనించవచ్చు.
అది మాత్రమే కాదు..
సాధారణంగా ఈ మిశ్రమం డార్క్ సర్కిల్స్ తొలగించుకోవడానికి వినియోగిస్తుంటారు. కానీ ఇది నల్లని చర్మాన్ని తెల్లగా మార్చేందుకు కూడా వినియోగిస్తారు. ఎండలో వెళ్లి ఎక్కువగా ట్యాన్ అయిన వారు ఎవరైనా ఉంటే.. దీనిని ప్రయత్నించవచ్చు. దీనిని అప్లై చేయడం వలన మంచి ప్రయోజనాలు ఉంటాయి. అలాగే చర్మం కూడా తెల్లబడుతుంది. దీనిని చేసుకోవడం కూడా చాలా సులభం.
వాటి నుంచి రక్షణ..
సాధారణంగా మనం డార్క్ సర్కిల్స్ తొలగించుకోవడానికి ఎక్కువగా కెమికల్ ఉన్న క్రీమ్స్ వాడుతుంటాము. ఇవి ఆరోగ్యానికి చాలా హానిని చేస్తాయి. అలాగే ఇందులోని రసాయనాలు క్యాన్సర్‌కు కూడా కారణమవుతాయి. అలాగే మన చర్మం తొందరగా ముసలిదైపోయినట్లు కనిపిస్తుంటుంది. అందుకే వాటికి బదులుగా ఇంట్లోనే తయారు చేసుకునే ఈ మిశ్రమాన్ని వినియోగించాలి. దీనిని వినియోగించడం వలన మెరుగైన రిజల్ట్ రావడంతో పాటు కెమికల్స్ నుంచి తప్పించుకోవచ్చు. అలాగే సహజసిద్ధమైన అందాన్ని సొంతం చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఓసారి ట్రై చేయండి.



Click it and Unblock the Notifications