Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
బీర్‌ను జుట్టుకు రాసుకుంటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?.. ఇది తెలిస్తే షాంపూలు కూడా బంద్ చేస్తారు!
కాలుష్యం, మారుతున్న జీవన శైలి కారణంగా ఈ రోజుల్లో చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం, బట్టతల కనిపించడం సాధారణం అయ్యింది. ఎక్కువగా పొల్యూషన్ వల్ల కూడా జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అనేక రకాల ట్రీట్‌మెంట్స్, షాంపూలు వాడినా కూడా చాలా మందికి ఫలితం దక్కడం లేదు. అలాగే నిపుణులు కూడా చాలా ప్రొడక్ట్స్‌ను సజెస్ట్ చేస్తుంటారు. కానీ, మీకు తెలుసా.. చాలా మంది తాగే బీర్ కూడా జుట్టు ఆరోగ్యానికి ఎంతోప్రయోజనం చేకూరుస్తుందని. బీర్ కేవలం ఒక రిఫ్రెషింగ్ డ్రింక్ మాత్రమే కాదు, అది జుట్టు కోసం కూడా మంచి హెయిర్ ట్రీట్‌మెంట్‌గా పనిచేస్తుంది. ఈ విషయాన్ని చాలా మంది నిపుణులు కూడా ధృవీకరించారు. బీర్‌తో జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ఎలా అనేది ఈస్టోరీలో చూద్దాం.
బీర్‌లో ఉండే పోషకాలు జుట్టుకు ఎంత వరకు మంచిది?
బీర్‌లో ప్రొటీన్లు, విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు ఆరోగ్యాన్ని పెంచటానికి ఉపయోగపడతాయి. బీర్‌లోని మాల్ట్ మరియు హాప్స్ వంటి పదార్థాల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును బలోపేతం చేసి, దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేస్తాయి. ఇందులోని విటమిన్ B జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, తలచర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే, బీర్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు పొల్యూషన్ కారణంగా జుట్టుకు కలిగే నష్టాన్ని నివారిస్తాయి. బీర్‌లోని మాల్టోజ్, సుక్రోజ్ షుగర్స్ హెయిల్ ఫాలికల్స్‌ను బలంగా ఉంచుతూ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

సరైన బీర్ ఎంచుకోవడం ముఖ్యం
హెయిర్ కేర్ కోసం సరైన బీర్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువ ఆల్కహాల్ ఉన్న బీర్లు జుట్టును పొడిబార్చే అవకాశం ఉంటుంది, కాబట్టి లైట్ బీర్ మాత్రమే వాడాలి. అలాగే, బీర్‌లోని ఫ్లాట్‌నెస్ కూడా ముఖ్యం. బీర్‌ను ఉపయోగించే ముందు దానిలోని నురగ పూర్తిగా బయటపడి, కార్బనేషన్ తగ్గిన తర్వాతనే జుట్టుకు అప్లై చేయాలి. బాటిల్ మూత తీసి కొన్ని గంటలు లేదా రాత్రంతా ఉంచితే బీర్ నురగ పోయి, పోషకాలు సమర్థంగా శోషణం అవుతాయి. అలాగే జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.
ఎలా అప్లై చేయాలి?
ముందుగా జుట్టును శుభ్రంగా కడగాలి. సల్ఫేట్ లేని, తేలికపాటి షాంపూ వాడాలి. ఈ సమయంలో హెయిర్ కండిషనర్ వాడకూడదు, లేకపోతే బీర్‌లోని పోషకాలు జుట్టుపై నేరుగా పనిచేయకుండా పోతాయి. షాంపూ తర్వాత, రాత్రంతా ఫ్లాట్‌గా ఉంచిన బీర్‌ను జుట్టుకు అప్లై చేయాలి. తలపై బీర్ మర్దన చేయడం ద్వారా పోషకాలు జుట్టు పొరల్లోకి ప్రవేశిస్తాయి. 5-10 నిమిషాల తర్వాత, టవల్‌తో తల చుట్టుకుని ఉంచితే పోషణ మరింత మెరుగవుతుంది. తర్వాత చల్లటి నీటితో కడగాలి. బీర్ వాసన రానంత వరకూ, తేలికపాటి కండిషనర్ ఉపయోగించవచ్చు.
తేనెతో కలిపి
తేనె జుట్టు మాయిశ్చరైజేషన్ కోసం ఒక మంచి పదార్థం అని చెప్పుకోవచ్చు. ఫ్లాట్ బీర్=లో 2 టేబుల్ స్పూన్ల తేనె కలిపి, ఈ మిశ్రమాన్ని తడి జుట్టుకు అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత, శుభ్రంగా కడిగితే జుట్టు మరింత మెరుగైన రుచి, ఆరోగ్యాన్ని పొందుతుంది. ఈ విధంగా, బీర్‌ను జుట్టు సంరక్షణలో ఉపయోగించడం ద్వారా మీరు మెరిసే, ఆరోగ్యవంతమైన జుట్టును పొందవచ్చు.



Click it and Unblock the Notifications