Latest Updates
-
పవిత్ర శ్రావణ మాసం ప్రారంభం.. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, తిథులు ఇవే.! -
శ్రావణ మాసం స్పెషల్ హెల్తీ లడ్డు.. పప్పు నానబెట్టే పనే లేదు,పాకం పట్టే శ్రమ లేదు..ఈజీగా చేసుకోండిలా.. -
పాలు విరిగిపోయాయా? అయితే పారబోయకుండా ఈ 5 అద్భుతమైన వంటకాలు చేయండి! -
ఇడ్లీ, దోసె పిండి బాగా పులిసిపోయిందా? పారేయకుండా ఈ చిట్కాలతో ఫ్రెష్ గా మార్చేయండి! -
కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, జలదరింపుని లైట్ తీసుకుంటున్నారా? పక్షవాతానికి ముందస్తు హెచ్చరిక? -
ఆరోగ్యానికి మహా బలం అందించే నువ్వుల బాదం లడ్డు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే -
ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ప్రోటీన్ చిక్కి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Chanakya Niti: మహిళలు ఈ 5 విషయాలను రహస్యంగా ఉంచితేనే జీవితంలో తిరుగుండదు! -
ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు..ఇది కాకరకాయ ఫ్రైస్..ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు.. -
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే..
కర్లింగ్ హెయిర్ రింగు జుట్టు సంరక్షించుకోవడం ఎలా..?

సాధారణ జుట్టు కంటే రింగుల జుట్టు పెళుసుగా ఉండడంతో పాటు పొడిగా ఉంటుంది. సాధారణ జుట్టు కంటే రింగుల జుట్టు వాతావరణ మార్పులకు వెంటనే ప్రభావితమవుతుంది కాబట్టి రింగుల జుట్టు ఉన్నవారు మరింత శ్రద్ధ తీసుకోవాలి. అందుకనే షాంపూతో వారానికోసారైనా తప్పకుండా తల స్నానం చేయాలి. దానివల్ల జిడ్డులేకుండా ఉంటుంది.
మాయిశ్చరైజింగ్ షాంపూ అయితే జుట్టుని పొడిగా ఉంచడానికి తోడ్పడుతుంది. వారంలో వీలయినన్ని సార్లు షాంపూతో తలస్నానం చేసినా జుట్టు జిడ్డులేకుండా ఆరోగ్యంగా కనిపిస్తుంది. షాంపూ వాడని రోజుల్లో జుట్టుని వేడినీటితో కడగాలి. దీనివల్ల పోషణ ఇచ్చే సహజనూనె పదార్థాలు కోల్పోకుండా జట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది.
స్నానం చేసిన తర్వాత జుట్టుని సహజంగా గాలికి ఆరనివ్వాలి. డ్రయ్యర్ ను వాడితే జుట్టు విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాడకపోవడం ఉత్తమం. జుట్టు మరీ గట్టిగా రింగులు తిరిగిపోకుండా ఉండాలంటే యాంటీ ప్రిజ్ సిరమ్ ని వాడితే సరిపోతుంది. ఈ సిరమ్ ను జుట్టు కుదళ్లనుంచి రాయాలి. గట్టిగా ఉన్న రింగుల జుట్టుపై మరింత బలప్రయోగం చేయకుండా కొంతవరకూ పొడవు తగ్గించుకుంటే మంచిది.
ఆల్కహాల్ కలిగి ఉన్న ఉత్పాదనలను వాడడం వల్ల జుట్టు పొడిగా మారుతుంది. అందువల్ల రింగుల జుట్టు ఉన్నవారు ఆల్కహాల్ ఉన్న ఉత్పాదనలను వాడకుండా ఉండడం మంచిది. రింగుల జుట్టుని మరింత ఆకర్షణీయంగా మార్చు కోవాలంటే నిపుణుల సహాయం తీసుకోవాలి.



Click it and Unblock the Notifications