Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇలా చేస్తే ‘చుండ్రు’ మటుమాయం..!!

- ఉసిరికాయ పొడి: ఆయుర్వేద షాపుల్లో లభ్యమయ్యే ఉసిరికాయ పొడి లేదా, ఇంట్లోనే రాగి ఉసిరికాయలను ఎండబెట్టి తయారుచేసుకున్న పొడితో చుండ్రును నియంత్రించవచ్చు. మీరు చేయ్యాల్సిందల్లా ఉసిరికాయ పొడిలో నిమ్మరసాన్ని కలిపుకుని జుత్తుకు పట్టించాలి. కొద్ది సేపు మాలిస్ చేయించుకున్న తరువాత తల స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.
- నిమ్మ, జామల కలయికతో: ప్రకృతి ప్రసాదమైన నిమ్మ, జామల కలయకతో చుండ్రును అరికట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. జామ ఆకుల రసంలో నిమ్మకాయ రసాన్ని కలిపి, వెంట్రుకల కుదుళ్ల వరకు పట్టించి కొద్ది సేపటి తరువాత గోరువెచ్చని నీటితో తల స్నానం చేస్తే క్రమంగా చుండ్రు బెడద తగ్గుముఖం పడుతుంది.
- జత్తు రంగును మార్చుకోడాకి ఉపయోగించే హెన్నా చుండ్రు నివారణకు భేషుగ్గా పనిచేస్తుంది.
- గోరింటాకు చుండ్రు నివారణకు బేషుగ్గా పని చేస్తుంది. తాజా గోరింట ఆకుల నుంచి రసాన్ని తీసి తలకు పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేస్తే
క్రమంగా చుండ్రు మటుమాయమవుతుంది.
- పొట్లకాయ రసాన్ని జుత్తుకు పట్టించి 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే వెంట్రుకలు నిఘారింపును సంతిరించుకోవటంతో పాటు చుండ్రు తగ్గుముఖం పడుతుంది.
- ఆరు స్పూన్ల శనగపిండిలో ఒక కప్పు పెరుగు మిశ్రమాన్ని కలిపి తలకు పట్టించి ఆ తరువాత తలస్నానం చేస్తే వెంట్రుకలకు పట్టిన చుండ్రు దశలు వారీగా మటుమాయమవుతుంది.
- చుండ్రు సమస్యతో భాదపడుతున్న వారు సిట్రస్ పళ్ల రసాలను అధికంగా తీసుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications