Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
శీతాకాలంలో జుట్టు సంరక్షించుకోవడం ఎలా...?

అలాగే బాగా వేడి నీటిని తలపై పోసుకోకూడదు. షాంపూ చేసుకున్న తర్వాత కండీషనర్ అప్లై చేయాలి. లేదా కండిషనర్ కలిపి ఉన్న షాంపూను ఎంచుకోవాలి. హెయిర్ డ్రయర్ ను జుట్టుకు కనీసం పది అంగుళాల దూరంలో ఉంచాలి. అసలు వాడకుండా ఉంటే ఇంకా మంచిది. వారానికి రెండుసార్లు తలకు నూనె పెట్టుకుని, ఆ నూనెను రాత్రంతా అలా ఉంచేయాలి.
వారానికి రెండుసార్లు పెరుగు లేదా గుడ్డులోని పచ్చసొన పొడి జుట్టుకు అప్లై చేస్తే కేశాలు మృదువుగా ఉంటాయి. కొబ్బరి నూనె, నువ్వులు లేదా ఆలివ్ ఆయిల్ కలిపి వేడి చేసి మాడుకు, శిరోజాలకు పట్టించి వేడి నీటిలో ముంచిన టవల్ తలకు చుట్టుకోవాలి. ఐదు నిమిషాలుంచి, మరోమారు టవల్ ను వేడి నీటిలో ముంచి చుట్టుకుని కొద్ది నిమిషాలు ఉంచుకోవాలి.
జుట్లు తడిగా వున్నప్పుడు తలదువ్వుకోకూడదు. కుదుళ్ళలో నుండి వెంట్రుకలు వూడి వస్తాయి. జుట్టు తడి పొడిగా వున్నప్పుడు దువ్వుకోండి. తలకు రోజూ నూనె రాసుకోవటం (లేదా వారానికి రెండుసార్లయినా) అన్నది కేశఆలను బలంగా వుంచుతుంది. జుట్టు జిడ్డుగావున్న కారణంగా దానికి నూనె అవసరం లేదని భావించవద్దు.
ఇలా చేయడం ద్వారా మాడు నూనెను బాగా గ్రహిస్తుంది. పొడిగా, పేలవంగా జుట్టు ఉన్నట్లయితే ఒక కప్పు తేనె, అరకప్పు ఆలివ్ ఆయిల్ లేదా నువ్వుల నూనె, రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం కలిపి ఓ రాత్రంతా ఉంచేసి కొద్దిగా తీసుకుని తలకు మసాజ్ చేయాలి.
వేడి టవల్ చుట్టుకుని కొద్దిసేపు షాంపూ చేసుకోవాలి. జుట్టు పొడిగా, దెబ్బతిని ఉన్నట్లయితే ఒక టీస్పూన్ ఆముదం, రెండు స్పూన్లు స్వచ్ఛమైన ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెను కలిపి మసాజ్ చేసుకుని వేడినీటి టవల్ చుట్టి ఆపై స్నానం చేయాలి.
చుండ్ర విపరీతంగా వుంటె నాలుగు టొమోటోలను తీసుకుని వాటిని మెత్తగా నలిపి ఆ గుజ్జును తలకు బాగా పట్టించడండి. రెండు నిమిషాలు మర్థన చెయ్యండి ఆ తర్వాత తలస్నానం చెయ్యాలి. వీటినంటిని పాటించినట్టైతే మీ జట్టు పదిలంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications