For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సిటీలో ఉంటున్నారా జుట్టు జర భద్రం..?

|

Hair Fall Due To Pollution..?
పట్టణ ప్రాంతాల్లో నివశించే వారిలో నూటికి 80 శాతం మందిని జుట్టు రాలటం వంటి సమస్య వేధిస్తోంది. కాలుష్యం, ఆహార ప్రణాళికలో మార్పులు, ఆశ్రద్ధ, అపరిశుభ్రత తదితర కారణాలు ఈ సమస్యను పెంచి పోషిస్తున్నాయని సర్వేలు హెచ్చరిస్తున్నాయి.

జుట్టు రాలటం అనేది నేడు చిన్నా, పెద్దా ప్రతి ఒక్కరినీ బాధిస్తున్న సమస్య. చర్మం మాదిరిగానే జుట్టుకూడా 'కెర్సటైల్' అనే పదార్థంతో తయారు చేయబడింది. కాబట్టి చర్మానికి ఎలాంటి శ్రద్ధ తీసుకుంటామో, జుట్టు పట్ల కూడా అంతే శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. శరీరానికి పోషక విలువలు అవసరమైనట్లే, జుట్టుకు కూడా అవసరమని వారంటున్నారు. అయితే సహజంగా రోజుకి 50 నుంచి 100 వెంట్రుకల వరకు రాలటం సహజమేననీ, అంతకుమించి ఎక్కువగా రాలితే మాత్రమే ఆందోళన చెందాలని వైద్యులు సూచిస్తున్నారు.

వాతావరణం పొడిగా ఉన్నప్పుడు జట్టు పొడిబారి తెగిపోతుంటుంది. అదే తేమగా ఉన్నప్పుడు చిక్కుపడి జుట్టు రాలిపోతుంది. వేసవిలో సూర్య కిరణాలు, అతి నీలలోహిత కిరణాల ప్రభావం.. మానసిక ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, పరీక్షల భయం, వేడి ఎక్కువగా ఉండే నీటితో తలస్నానం చేయటం, హెయిర్ డ్రయ్యర్ల వినియోగం, హార్మోన్ల లోపం, హైపో థైరాయిడిజం, రక్తహీనత, విటమిన్ లోపం, డైటింగ్.. తదితరాలు జట్టు రాలేందుకు కారణాలు కావచ్చు.

జుట్టు రాలటాన్ని అరికట్టేందుకు.. జుట్టు తత్వాన్ని బట్టి షాంపూలను ఎంపిక చేసుకోవటం, వారానికి రెండుసార్లు షాంపూతో తలస్నానం చేయటం, కండీషనింగ్ చేయటం లాంటి జాగ్రత్తలు పాటించాలి. అలాగే పొడితత్వం గలవారు తలస్నానానికి ముందుగా నూనె పెట్టుకుని కాసేపటి తరువాత స్నానం చేయాలి. సమతులాహారం తీసుకోవటంవల్ల జుట్టుకు తగిన పోషణ అందుతుంది. తద్వారా జుట్టు రాలటం కూడా తగ్గుతుంది.

English summary

Hair Fall Due To Pollution..? | సిటీలో ఉంటున్నారా జుట్టు జర భద్రం..?

How to prevent hair fall due to pollution and several other factors.
Story first published:Thursday, November 24, 2011, 12:09 [IST]
Desktop Bottom Promotion