For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాలుష్యం మీ ‘జుట్టు’ను కాటేస్తుందా..?

|

Pollution Damaging our Hair..?
పట్టణాలతో పాటు ప్రముఖ నగరాలన్ని కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయి. పరిశ్రమలు ఇతరత్రా కారణాల వల్ల విడుదలదవుతున్న విషపూరిత వాయువులు మనిషి ఆరోగ్యానికి చేటు తెస్తున్నాయి. రాష్ట్లంలోని ముఖ్యనగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలు నిత్యం కాలుష్య సమస్యలతో సతమతమవుతున్నాయి. పరిశ్రమల ద్వారా వెలువడుతున్న రసాయనాల కాలుష్యం ఓ సమస్య అయితే, వాహానాలు ఇతర పారిశుధ్య శుభ్రత కారణాల వల్ల విడుదలవుతున్న పొగ కాలుష్యం మరో సమస్యగా పరిణమిస్తోంది.

ప్రస్తుతం చోటుచేసుకుంటున్న కాలుష్య రుగ్మతల కారణంగా జుత్తు విపరీతంగా ఊడిపోవటంతో పాటు జీవం కోల్పోతుంది. ఆరోగ్యవంతమైన జుత్తు కోసం ప్రణాళికాబద్ధంగా వ్యవహిరిస్తే సమస్యను సులువుగా అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు...

- బయటకు వెళ్లిన సందర్భలో కాలుష్యం నుంచి జుత్తును కాపాడుకునేందుకు టోపి ధరించటం ఉత్తమం.

- జుత్తు సంరక్షణలో భాగంగా ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తప్పనిసరి. విటమిన్ 'సి'వెంట్రుకల ధ్రడత్వానికి దోహదపడుతుంది. సిట్రస్ ఫలాలలను అధికంగా తీసుకోవాలి.

- జింక్ శాతం అధికంగా ఉంటే పాలు ఉత్పత్తులతో పాటు చేపలను తినాలి.

- వెంట్రుకుల సమస్యకు ఒత్తిడి కూడా కారణమంటున్న నిపుణులు మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం వంటి అలవాట్లను చేసుకోవటం మంచి పరిణామమట.

English summary

Pollution Damaging our Hair..? | కాలుష్యం మీ ‘జుట్టు’ను కాటేస్తుందా..?

The pollution affects the climate into Global Warming where the summers are VERY hot. This does affect hair in a close aspect because of the extra heat. The heat will start to burn your hair if global warming continues and none wants to smells that disgusting smell of burning hair.
Story first published:Thursday, October 27, 2011, 10:46 [IST]
Desktop Bottom Promotion