Latest Updates
-
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.!
ఆరోగ్యకరమైన కురులకు ఆరోగ్యకరమైన ఆహారం...
జుట్టు సంరక్షణ గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా సరిపోవు. నిరంతరం ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంటుంది. జుట్టు రాలిపోతున్నదని చాలా మంది ఆందోళన పడుతూ ఉంటారు. పలు రకాల నూనెలు రాసి, జుట్టు రాలడాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తారు. నిజానికి కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టడంతో పాటు ఆరోగ్యమైన జుట్టును పొందే వీలుందంటున్నారు నిపుణులు. పోషకాహారం తీసుకోవడం అన్నది శరీరానికే కాకుండా శిరోజాలకు చాలా మేలు చేకూరుస్తుందని వారు చెబుతున్నారు. పోషకాహారం వలన జుట్టు ఊడిపోవడం, తెల్లబడడం, చుండ్రు వంటి సమస్యలను తేలికగానే అధిగమించవచ్చు. కాబట్టి నిగనిగలాడే జుట్టు కోసం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో చూద్దాం.

అవొకాడోలో 25 రకాల న్యూట్రిషియన్స్ కలిగి ఉంటుాయి. ముఖ్యంగా అందులో విటమిన్ ఇ మరియు బి అధికంగా ఉంటాయి. పచ్చి అవొకాడోను మెత్తని పేస్ట్ లా తయారు చేసి తల మాడుకు అప్లై చేసి కొద్ది సేపటి తర్వత తలను శుభ్రం చేసుకోవాలి. దాంతో కురులు క్లీన్ గా ఫ్రెష్ గా.. మెరుస్తూ ప్రకాశవంతంగా కనబడుతాయి.

బీన్స్ లో బి6 విటమిన్ అధికంగా కలిగి ఉంది. మరియు ఫోలిక్ యాసిడ్, మినిరల్స్, మెగ్నీషియల్, సల్ఫర్ మరియు జింక్ ఇవన్నీ కూడా బీన్స్ లో పుష్కలంగా ఉన్నందున వీటిని తరచూ ఆహారంలో తీసుకొవడం వల్ల జుట్టు పెరుగుదలకు కావల్సిన పోషకాలను అందిస్తుంది.

కొన్ని దశాబ్దాలుగా కొబ్బరి నూనెను కొన్న ఆయుర్వేద చికిత్సలలో మరియు ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తున్నారు. కొబ్బరి నూనెలో వయస్సు పైయబడనీయకుండా చేసే గుణంతో పాటు ఒత్తిడిని తగ్గిచే రిలీవింగ్ ట్రీట్మెంట్స్ లో కూడా అధికంగా ఉపయోగిస్తారు. కొన్ని నిముషాల పాటు గోరువెచ్చని కొబ్బరి నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు కణాలకురక్త ప్రసరణ బాగా జరిగా జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. చుండ్రు, చిట్లడం, జుట్టురాలడం తగ్గిస్తుంది.

డైరీప్రొడక్ట్స్ ను తీసుకోవడం వల్ల అధికమొత్తంలో కార్బోహైడ్రేట్లు, క్యాల్షియం, విటమిన్ డి మరియు బి12 అంధి ఒక్క ఎముకలను మాత్రమే కాపడడమే కాదు జుట్టు మొదళ్ళు స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తుంది. డైరీ ప్రొడక్ట్స్ లోని లోఫ్యాట్ మిక్క్, మరియు కాటేజ్ చీజ్ వంటివి మెరిసే జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతాయి.

గుడ్లు విలువ తక్కువ అయితే వీటిలో వుండే ప్రోటీనుల వల్ల ప్రయోజనం ఎక్కువ. చాలా రకాలా ఆర్గానిక్ షాంపూలల్లో గుడ్డును వినియోగించడం వల్ల జుట్టును శుభ్రపరిచి, కురులకు మెరుపును అందించి ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతాయి. గుడ్డును తలకు మసాజ్ చేసి పదిహేను నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే ప్రకాశవంతమైన కురులు మీ సొంత అవుతాయి.

సీఫుడ్ ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గడానికి బాడీ స్లిమ్ గా మెయింటైన్ చేయడానికి, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే కురులకు కూడా చాలా ఆరోగ్యకరం. ఇతర సీఫుడ్స్ తో పోల్చిచే హాలీబట్ ఫిష్ లో అధిక శాతంలో ఐరెన్ కంటెంట్ కలిగి ఉంటుంది. ఇది కురులకు స్ట్రాంగ్ గా పెరిగేలా చేస్తుంది. కాబట్టి మీకు కావలసినంత ఐరన్ లభించే ఈ ఫిష్ ను ఉడికించి లేదా, ఫ్రై చేసి లేదా గ్రిల్ చేసి తినొచ్చు...

తేనె చక్కటి రుచిని మాత్రమే కాదు కేశాలకు కావల్సినంత కాంతిని అంధించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అందుకు 2చెంచాల తేనెకు అరకప్పు ఆలివ్ ఆయిల్ కలిపి తలకు బాగా మసాజ్ చేయాలి. తర్వాత వెచ్చని టవల్ తో చుట్టి అరగంట పాటు అలాగే వదిలేసి తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి దాంతో మీ కురులు కాంతివంతంగా మారుతాయి.

కురులకు కావల్సిన కార్బోహైడ్రేట్స్, పొటాషియం పచ్చిబఠానీ అంధిస్తుంది. పచ్చిబఠానీను ఆహారంలో తీసుకోవడం వల్ల కురులు స్ట్రాంగ్ గా పెరగడానికి బాగా సహాయపడుతుంది. ఇతర గ్రీన్ వెజిటేబుల్ తో పోల్చితే అధిక క్యాలరీలను కలిఉన్న పచ్చిబఠానీలు తినడం వల్ల కురులు ఆరోగ్యంగా ఉంటాయి.

టర్కీలో ప్రోటీన్స్ అధికశాతంలో ఉంటాయి. అంతే కాదు ఐరన్ కూడా అధికంగా ఉండి కురులకు పెరుగుదలకు బాగా సహకరిస్తుంది. బీఫ్ కంటే లోక్యాలరీ, తక్కువ ఫ్యాట్ కలిగిన టర్కీని తరచు ఆహారంతో పాటు తీసుకోవడం చాలా ఆరోగ్యకరం.

విటమిన్ ఇ అధికంగా ఉండే వాల్ నట్స్ మీ కురులకు కావల్సిన తేమను, అందించి కులరులు ఎప్పుడు కాంతివంతంగా మెరుస్తూ ఉండేలా చేస్తుంది. వాల్ నట్స్ ను మిక్సీలో వేసి మెత్తగా చేసి, నీటిలో కలిపి వడగట్టి తలకు మసాజ్ చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల కురులు ఆరోగ్యంగా మెరుస్తుంటాయి.



Click it and Unblock the Notifications