Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
జుట్టు రాలడాన్ని అరికట్టి.. ఆరోగ్యంగా ఉంచే 7 వండర్ ఫుడ్స్...!

సడన్ గా జుట్టు రాలడం మొదలైతే ఏం చేస్తారు? హైరానా పడిపోతుందని హైనా పడుతూ అందుకు ఖరీదైన ఉత్పత్తులను కొని వాడటానికి ప్రయత్నిస్తారు. హెయిర్ ట్రీట్మెంటులు మొదలు పెడతారు. ఇవన్నీ అవసరం లేకుండా ఇంట్లో వస్తువులతోనే మీ కేశాను ఆరోగ్యంగా నిలుపుకోవచ్చు. అందుకు ముందుగా జుట్టు రాలడానికి అసలు కారణం తెలుసుకోండి. కొంత మంది నిపుణు అభిప్రాయం ప్రకారం జుట్టు రాలడానికి కొన్ని సాధారణ కారణాలను తెలుపుతున్నారు. ఆహారం పానియాల్లో అసమతుల్యతలు, విటమిన్స్, జన్యు సంబంధ సమస్యలు, అధిక ఒత్తిడి, చింత మరియు ఆందోళనలతో పాటు ఆరోగ్యపరంగా టైఫాయిడ్, అనీమియా, జాండీస్ వంటివి కూడా కారణమౌతాయి.
తలలోని రూట్ కెనాల్ కు రక్తం సరఫరా సరిగా లేకపోవడం, తలను శుభ్రంగా ఉంచుకోక పోవడం వంటివన్నీ కారణాలే.. కాబట్టి ముందుగా మీ సమస్యకు ఏది కారణమైతుందో ముందుగా పసిగట్టినట్లైతే జుట్టు రాలకుండా ఆరోగ్యంగా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఆహారం విషయం తగు జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అందుకు ఏడు వండర్ ఫుల్ ఫుడ్స్ ఉన్నాయి అవేంటో చూద్దాం.
పాలు: తెల్లగా ఉండే పాలు నల్లని జుట్టుని ఎలాంటి మ్యాజిక్ చేయగలవు అని సందేహం రావుచ్చు మీకు. నిజానికి పాల వల్ల శరీరానికి కాల్షియంతో పాటు జుట్టుకు కూడా బోలెడు లాభాలు. జుట్టు చిక్కులు పడకుండా దానికి చేతనెైనంతగా అది కృషి చేయడంతో పాటు సరికొత్త కేశ కళను లిగించడంలో మీకు ఎంతో తోడ్పడుతుంది. డ్రైహేయిర్ ను మంచి కండీషన్‌లో తీసుకురావాలనుకుంటే మాత్రం పాలను నమ్ముకోవడం బెస్ట్.
బాదం: రోజుకో ఆపిల్ తీసుకుంటే డాక్టర్ వద్దకు వెళ్లే అవసరం లేదనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయం బాదాంకు కూడా వర్తిస్తుంది. రోజుకు గుప్పెడు బాదాంలను తింటే కేవలం జుట్టుకే లాభం కాదు మీ గుండెకు కూడా మంచిది. టాపిక్ హెయిర్ గురించి కాబట్టి బాదాం వల్ల మీ హెయిర్ సరికొత్త మెరుపును సంతరించుకోవడంతో పాటు, జుట్టు రాలిపోవడం వంటి సవుస్యలు ఎదురుకావు.
వెజిటేబుల్స్ : వెజిటేబుల్స్ తక్కువేం కాదు ఆకుపచ్చ రంగులో ఊరించే బ్రకోలీ, పాలకూరల వంటి ఆకు కూరల వల్ల డబుల్ బెనిఫిట్. ఒకటి వీటిని తరచూ మీ ఆహారంలో భాగం చేయడం వల్ల ఎ, సి , కె వంటి విటమిన్లతో పాటు ఐరన్, కాల్షియం సము పాళ్లలో అందుతుంది. రెండవది మీ జుట్టుకు మంచి కండీషన ర్‌గా కూడా పనిచేస్తాయి.
క్యారెట్ : రేటు తక్కువ .. రేంజ్ ఎక్కువ. అం దమైన కళ్లకు, దృష్టికి తోడ్పడటంతో పాటు శరీరాన్ని డిటాక్సికేట్ చేస్తుంది. చిరుతిళ్లు తినాలనిపించినప్పుడు ఒకటి రెండు క్యారెట్స్‌ను తినండి. కొన్ని రోజుల్లోనే అందమైన మార్పును మీరూ గమనిస్తారు.
ఫ్లాక్స్ సీడ్స్: ఫ్లాక్స్ సీడ్స్‌లో జుట్టు పెరుగుదలకు అవసరమైన ఒమెగా 3 ఫాటీ ఆసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి.ఆరోగ్యవంతమైన కురులకోసం కావాల్సిన ప్రొటీన్, ప్రాకృతిక ఫైబర్‌లను ఇది అందిస్తుంది.ఈ విత్తనాల నూనెను సాధారణ నూనెలాగే ఆహారపదార్ధాలలో వినియోగించవచ్చు.
చికెన్: చికెన్ తింటే న్యూట్రీషన్స్‌తో పాటు విటిమిన్స్ ఫ్రీ. జుట్టు ఎదుగుదలకు దోహదం చేసే ప్రోటీన్స్‌కూడా సమృద్ధం. ఇది చికెన్ థెరపీ.
చేపలు: సముద్రంలో ఉండే చేపలకు మనిషి జుట్టుకు కొన్ని లింక్స్ ఉన్నాయి. వలలో చిక్కుకోకుండా తప్పించుకోవడంలో చేప ఎక్స్‌పర్ట్. రెగ్యురల్‌గా చేపలను ఆహారంలో భాగంచేసుకుంటే మీ జుట్టు కూడా చిక్కులలో చిక్కుకోవు.. చేపలలో ఉండే విటమిన్ డి ఆరోగ్య వంతమైన కురులకోసం ఉపయోగకర మైనవే కాకుండా, ఒమెగా 3 ఫాటీ ఆసిడ్స్‌తో సమృద్ధం. ఇది నాన్‌వెజ్ హెయిర్ థెరపీ.



Click it and Unblock the Notifications