For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రకృతి సిద్దమైన ఆయుర్వేదంతో కురుల సొగసులు...

|

Ayurvedic Treatment for Hair Loss....!
మగువల అందాలను మరింత ఎక్కువగా చూపటంలో కేశాలది ప్రధాన పాత్ర.. ఎవరికైనా సరి వెంట్రుకలు పొడవుగా, లావవుగా, రింగులుగా ఇలా రకరకాలు కేశాలున్నట్లైతే వారినే పదే పదే చూస్తుండిపోతాం. ఈ ష్యాషన్ ట్రెండ్ లో కూడా చాలా మంది స్త్రీలు తమ కేశ సౌందర్యం పెంచుకోవాడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ట్రెండ్ కు తగిన విధంగా...వస్త్రాధారణకు తగ్గట్లుగా కేశాలను అలంకరించుకోవడం మొదలెట్టారు. అయితే కొంతమంది జుట్టు రాలడం సమస్యగా మారింది. అందుకు కారణం, కాలుష్యం, ఎండవేడిమి, వెంట్రులక పట్ల సరైన అవగాహన లేకపోవడం. దానివల్ల చుండ్రు, వెంట్రుకలు రాలిపోవడం, చిట్లిపోవడం జరుగుతుంటాయి.

చాలామందిలో శారీరకంగా, మానసికంగా ఒత్తిడి ప్రభావం జుట్టు మీద పడి జుట్టు రాలిపోవడం, జుట్టు తెల్లబడటం జరుగుతుంటుంది. అలాగే ఆహార లోపం వల్ల వచ్చే రక్తహీనత, తలలో పేలు, చుండ్రు ఇన్‌ ఫెక్షన్స్‌ కారణంగా తలపై వచ్చే గజ్జి, తామర వంటి వ్యాధుల వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. ముఖ్యంగా ఆడపిల్లలలో జుట్టు రాలిపోవటా నికి ముఖ్యకారణం హార్మోన్ల ప్రభావం. ఇంకా సాధరణంగా వాడే రకరకాల షాంపూలు, హెయిర్ డైలు, హెయిర్ కలర్ లు కారణంగా అనేక కెమికల్స్ కేశాలపై ప్రభావాన్ని చూపిస్తాయి. వీటన్నింటికీ హెయిర్ ప్యాక్ లు, హెయిర్ మాస్క్ లు, స్పాలు ఇలాంటివి కాకుండా సహజసిద్దమైనటువంటి ఆయుర్వేద పద్దతుల ద్వారా జుట్టు రాలడం అరికట్టుకోవచ్చు...

1. కెమికల్స్‌ ఉన్న షాంపూల వాడకం తగ్గించి ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే కుంకుడుకాయ రసంలో వేపాకు, మందారఆకు వేసి సేప్ట్ లా చేసి తలకు పట్టించి గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. అలా చేయడం వల్ల ఆ రసంలో ఉన్న జిగురు జుట్టు మొదళ్లని శుభ్రం చేసి, సున్నిత త్వాన్ని ఇవ్వ డమే కాక జుట్టు మెరిసేలా చేస్తుంది.

2. వారానికొక్కసారి క్రమం తప్పకుండా తలకి నువ్వుల నూనె రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. నువ్వుల నూనెలో నీలగిరి తైలం కాస్త కలిపి మరగ కాచి ప్రతిరోజూ తలకి రాసుకుంటే జుట్టురాలడం తగ్గి చక్కగా పెరుగు తుంది.

3. వేపాకు, మందారం ఆకులు కలిపి పేస్ట్ లా చేసి నువ్వుల నూనెలో పోసి నూనె మిగిలేదాకా మరగ కాచి వడకట్టి సీసాలో పోసు కుని దాన్ని రోజూ తలకి రాసుకుంటే జుట్టు నిగనిగ లాడుతుంది.

4. పల్లేరు పువ్వులు, నువ్వులు సమానంగా తీసుకుని ముద్ద చేసి కాస్త నెయ్యి కలిపి తలకు పట్టిస్తే పేను కొరుకుడు వల్ల ఊడిపోయిన జుట్టు తిరిగి మొలుస్తుంది.

5. కొబ్బరినూనె లో మాచికాయ, కరక్కాయ, ఉసిరికాయ, కాచు ఉడికించాలి... ఈ తైలాన్ని రాత్రిపూట తలకు పట్టించుకుని ఉదయాన్నే తల స్నానం చేస్తే తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి.

English summary

Ayurvedic Treatment for Hair Loss....! | ఆయుర్వేద చిట్కాలతో కురుల సొగసులు...

If a dozen types of shampoos and hair oils have been a fiasco in controlling hair loss for you, then it is definitely your time to switch over to a reliable hair loss treatment. Talking about reliability, what could be better than Ayurveda for hair loss treatment? Ayurvedic hair loss treatment measures are known for their effectiveness.
Story first published:Monday, April 2, 2012, 17:50 [IST]
Desktop Bottom Promotion