Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
వర్షాకాలంలో కూడా మీ కురులు సురక్షితంగా...!

ముఖ్యంగా వర్షాకాలంలో హెయిర్ కేర్ అంటే కొంచెం కష్టమైన పనే. వర్షాకాలంలో సరిగా కేర్ తీసుకోకపోతే తడిచిన వెంట్రుకల నుండి చెడు వాసనలు వచ్చే అవకాశం కూడా వుంది. దాంతో చుండ్రు, వెంట్రుకలు తెగిపోవడం, రాలిపోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో తల తడిగా ఉండటం వల్ల తలనొప్పి తరచూ వేదిస్తుంటుంది. కాబట్టి అందుకు తగ్గ సంరక్షణ పద్దతులు పాటిస్తే వర్షాకాలంలో కూడా కురులు సురక్షితంగా ఉంటాయి. అందుకు మీకోసం కొన్ని చిట్కాలు...
1. చుండ్రు ఉన్నవారు వర్షాకాలంలో డైరెక్ట్ గా తలస్నానం చేయకూడదు. తలస్నానానికి ముందు పెరుగు లేదా రీఫైయిన్డ్ ఆయిల్ ను తల మాడుకు బాగా మసాజ్ చేసి. అరగంట తర్వాత స్నానం చేయాలి. నూనెలు చిక్కగా (ఆముదం)ఉన్నవి ఉపయోగించకుండా పలుచగా ఉండే బాదాం ఆయిల్, కొబ్బరినూనె వంటివి గోరువెచ్చగా చేసి తలకు మర్థన చేయాల్సి వుంటుంది.
2. తలకు నూనెను మసాజ్ చేసిన తర్వాత పది-పదిహేను నిమిషాల తర్వాత తలను దువ్వడం కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే తలకు వేడి నూనెతో మసాజ్ చేయడం, వెంటనే తలను దువ్వడం వల్ల రక్తప్రసరణ బాగా జరిగేందుకు సహాయపడుతుంది. దాంతో కేశ కణాలు పునురుత్తేజం చెంది జుట్టు దృడంగా ఉండేలా చేస్తుంది.
3. వెంట్రుకలు పెరగడానికి: తల మాడు చాలా చల్లగా, తడిగా మరియు దురదతో ఇరిటేషన్ తెప్పించే విధంగా ఉంటే వేపనూనె చాలా బాగా పనిచేస్తుంది. నిమ్మనూనెను తలకు రాయడం వల్ల తలను శాంతపరుస్తుంది. నిమ్మలోనున్న ఆయుర్వేద గుణాలు కురులు బాగా పెరిగేందుకు సహాయపడుతుంది.
4. కురులు మందంగా, నల్లగా నిగనిగలాడాలంటే నూనెలో కరివేపాకు ఆకులను వేసి నూనెను వేడి చేసి గోరువెచ్చగా తలకు మర్దన చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తుంటే వెంట్రుకలు సున్నితంగా నల్లగా పెరుగుతాయి.
5. తలకు హెర్బల్ షాంపూ లేదా యాంటీ డాండ్రఫ్ షాంపూను ఉపయోగించడం మంచిది. వారానికి రెండు లేదా మూడు సార్లు తలస్నానం చేయడం మంచిది. లేదంటే వాతావరణంలోని కాలుష్యంతో హెయిర్ దెబ్బతిని రాలిపోవడం, తెగిపోవడం వంటివి జరుగుతాయి. పొడి జుట్టు వున్నవారా తలస్నానానికి ముందు తప్పనిసరిగా కండిషనర్ ను అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
6. తలస్నానం తర్వాత తలను తడి ఆర్పుకోవడానికి హెయిర్ డ్రైయర్ ను ఉపయోగించకుండా మంచి పొడి టవల్, మెత్తని టవల్ తో తలను తడుచుకోవడం వల్ల ఇదితలకు మసాజ్(మాయిశ్చరైజర్)గాను ఉపయోగపడుతుంది.
7. తడిగా ఉన్నప్పుడు తలను దువ్వకూడదు. తడిలె కురులు బలహీన బడి ఉండటం వల్ల కురులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది.
8. హెయిర్ కలరింగ్ లేదా స్ట్రైయిట్ హెయిర్ చేయించుకోవడం ఈ సీజన్ లో అంత మంచిది కాదు. హెయిర్ కలరింగ్, స్ట్రైటనింగ్ చేయించుకోవడనికి తర్వాత తలస్నానం చేసుకోవడానికి, తలను తడి ఆర్పడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఈ ప్రొసెస్ లో వెంట్రుకలు రాలిలోపోయే అవకాశం ఉంది. కాబట్టి తలకు సహజ పద్దతులల్లో కేర్ తీసుకోవడం ఉత్తమం.
ఈ హెయిర్ కేర్ టిప్స్ వర్షాకాలం ప్రతి రోజూ తీసుకోవాల్సినవి. నేచురల్ కలర్స్ (మెహింది లేదా టీ డికాషన్)ను ఉపయోగించడం ఎంతో ఉత్తమమై పద్దతి.



Click it and Unblock the Notifications