Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రోజువారి జాగ్రత్తలతో కేశ సౌందర్యం మీ చేతుల్లోనే....

1. జుట్టును అందంగా ఉంచుకోవటానికి తలస్నానం సాధ్యమైనంత ఎక్కువసార్లు చేస్తూ జుత్తును శుభ్రంగా ఉంచుకోవాలి.
2. తలస్నానానికి హెర్బల్ షాంపూలు, హెర్బల్ హెయిర్ కండిషనర్ లు ఉపయోగిస్తే మంచిది.
3. వారానికి రెండుసార్లన్నా కొబ్బరినూనెతో తలకు మాయిశ్చరైజర్ చేయడం మరిచిపోకూడదు.
4. గుంట గలకరాకు తెచ్చి శుభ్రం చేసుకొని, మిక్సీలో రసం తీసి తలకు పట్టించి గంట తరువాత తలస్నానం చేస్తూ ఉంటే, తెల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుంది. మాడుకు చల్లదనం ఇస్తుంది. ఈ రసాన్ని, మందారపూలను కలిపి కొబ్బరి నూనెలో మరిగించి, చల్లారాక సీసాలో పోసి రాసుకుంటున్నా మంచి ఫలితం కన్పిస్తుంది.
5. ఎక్కువగా జుట్టు రాలుతోందా ఒక ఉల్లిపాయను మెత్తగా పేస్టులా చేసుకోవాలి. దానికి చెంచాడు తేనె కలపాలి. తలకు పట్టించి గంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
6. వెంట్రుకలు తెల్లబడకుండా ఉండాలంటే ఉసిరికాయ రసం, నువ్వుల నూనె సమపాళ్ళలో కలిపి, కాచి తలకు రాసుకోవాలి.
7. కొంతమంది జుట్టు జిడ్డుగా, నూనె కారుతూ ఉంటుంది. తలస్నానం చేసిన కొద్దిసేపటికే జుట్టు జిడ్డుగా తయారై రాలిపోతుంటుంది. ఇటువంటివారు ఒకవేళ కండీషనర్ వాడదలుచుకుంటే పెరుగును మాత్రం వాడుకోవాలి. కండీషనర్‌ను తలకు కాకుండా వెంట్రుకల కొసలకు ప్రయోగించాలి. స్నానానికి ఉపయోగించే నీళ్లకు కొద్దిగా నిమ్మరసాన్ని చేర్చితే జిడ్డు వదులుతుంది.
8. దువ్వెన, హెయిర్‌బ్రష్‌ల బ్రిసిల్స్ పెళుసుబారినట్లు అనిపిస్తే వాడకం ఆపేయాలి, లేదంటే వెంట్రుకలు పాడైపోతాయి. దువ్వెనలను అధిక వేడి ఉన్న హెయిర్ డ్రయర్ సమీపాన ఉంచకండి, వేడికి దువ్వెన పళ్లు దెబ్బతింటాయి.



Click it and Unblock the Notifications