Latest Updates
-
శ్రావణ మాసం స్పెషల్ హెల్తీ లడ్డు.. పప్పు నానబెట్టే పనే లేదు,పాకం పట్టే శ్రమ లేదు..ఈజీగా చేసుకోండిలా.. -
పాలు విరిగిపోయాయా? అయితే పారబోయకుండా ఈ 5 అద్భుతమైన వంటకాలు చేయండి! -
ఇడ్లీ, దోసె పిండి బాగా పులిసిపోయిందా? పారేయకుండా ఈ చిట్కాలతో ఫ్రెష్ గా మార్చేయండి! -
కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, జలదరింపుని లైట్ తీసుకుంటున్నారా? పక్షవాతానికి ముందస్తు హెచ్చరిక? -
ఆరోగ్యానికి మహా బలం అందించే నువ్వుల బాదం లడ్డు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే -
ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ప్రోటీన్ చిక్కి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Chanakya Niti: మహిళలు ఈ 5 విషయాలను రహస్యంగా ఉంచితేనే జీవితంలో తిరుగుండదు! -
ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు..ఇది కాకరకాయ ఫ్రైస్..ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు.. -
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్!
సిగరెట్ కు చెక్ పెట్టండి..జుట్టు సంరక్షించుకోండి..

ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, కాలుష్యం, మానసిక సమస్యలు.. ఇవన్నీ జుట్టు రాలిపోవటానికి దారి తీసేవే. పైగా సహజంగా జుట్టు రాలిపోయే వయసు కూడా ఒకప్పటికన్నా ఇప్పుడు గణనీయంగా తగ్గుతూ వస్తోంద. ఇది పురుషుల్లో 20ల్లోనే మొదలైతే. స్త్రీలల్లో 30ల్లోనే ఆరంభమవుతోంది. మహిళల్లో పాపిడి మధ్యలో ఖాళీ పెద్దగా అవుతుండటం.. పురుషుల్లో నుదురు విశాలం కావటం, కణతల దగ్గర వెలితిగా కనిపిస్తుంటే జుట్టు రాలటం ఎక్కువగా ఉన్నట్టు భావించొచ్చు. రోజుకి 100 వెంట్రుకల రాలటం సాధారణమే కానీ.. అంతకు మించి కొన్ని నెలల పాటు రాలుతున్నట్టు అనుమానం వస్తే నిపుణులను సంప్రదించాల్సిందే. ముఖ్యంగా మహిళల్లో కన్నా పురుషుల్లో వెంట్రుకలు ఎక్కువ సంఖ్యలో రాలిపోతుంటాయి. కాబట్టి పురుషులు త్వరగా జాగ్రత్త పడటం మంచిది. అందుకోసం కొన్ని చిట్కాలు
1. జుట్టును ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి. వారానికి రెండుమూడు సార్లు యాంటిడాండ్రఫ్ షాంపుతో తలస్నానం చేయండి.
2. హేయిర్ డ్రైయర్స్, జెల్స్ ఎక్కువగా వాడక పోవడమే మంచిది.
3. జుట్టు బాగా పెరగడానికి సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం.
4. జట్టు ఊడటానికి స్మోకింగ్ పరోక్షంగా దోహదపడుతుందని చెప్పవచ్చు. పొగతాగేవారిలో తలకు, మాడుకు జరగాల్సిన రక్తప్రసరణలో అంతరాయం కలగవచ్చు. ఇది కొంత నేరుగా జరిగే ప్రక్రియ. ఇదిగాక... పొగతాగడం వల్ల ఇతరత్రా ప్రమాదకరమైన వ్యాధులు వస్తే దాని ఫలితంగా జట్టు విపరీతంగా రాలవచ్చు.
5. పొగ తాగేవారిలో రక్త ప్రసరణ సరిగా జరగకపోవటం వల్ల వెంట్రుకలు పెరగటం దెబ్బతింటుంది. 20 కన్నా ఎక్కువ సిగరెట్లు తాగేవారికి జట్టు రాలే సమస్య అధికమే..
6. ధూమపానం వాడకం వల్ల శారీరక సామర్థ్యం లేదా పటుత్వం తగ్గిపోతుంది.



Click it and Unblock the Notifications