Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కేశ సంపదను వృద్దిచేయండిలా...

1. రోజూ ఒక కప్పు మొలకెత్తిన గింజలు పచ్చివే తినడం ఆరంభించాలి.
2. ప్రోటీన్ల కోసం ప్రతి రోజూ ఒక గుడ్డు తినాలి.
3. వెన్న తీసిన పాలు రెండు గ్లాసుల చొప్పున ప్రతి రోజు తాగితే ఎంతో లాభం చేకూరుతుంది.
4. ఐరన్ పుష్కలంగా లభించేటటువంటి ఆకుకూరలను ప్రతి రోజూ భోజనంలో ఉండేటట్లు చూసుకోవాలి. లేదంటే మెడికల్ ష్కాప్ లో టాబ్లెట్ లు దొరుకుతాయి. డాక్టర్ సలహా మేరకు ఐరన్ టాబ్లెట్ ను వాడొచ్చు.
5. ఉదయాన్నే అవిసె గింజలు నానపెట్టిన ఒక గ్లాసు మంచి నీటిని తీసుకోవాలి. అవిసె గింజల్లో ఒమెగా 3 ఆమ్లాలు ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
6. రోజూ ఉదయాన్నే ఒక ఉసిరి కాయ తినాలి.
7. ప్రతిరోజూ రాత్రి ఐదు ఆల్మండ్(బాదాం) గింజలను నానపెట్టి వాటిని తెల్లవారి ఉదయాన పొట్టు తీయకుండా తినేయాలి.
8. మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు వంటి ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలి. రోజూ ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తప్పక తాగాలి. ఇవి జుట్టుకి కావలసిన పోషకాలను అందిస్తాయి.
9. కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. పాలకూర ఎంత ఎక్కువగా తింటే అంత మంచిది. పాల కూర ఆకులను గ్రైండ్ చేసి దానితో తల రుద్దుకుంటే నిర్జీవంగా ఉన్న జుట్టు ఆరోగ్యంగా మెరుస్తుంది.
10. పండ్లు: అరటిపండ్లు, యాపిల్స్, మామిడి, సపోట, ద్రాక్ష, స్ట్రాబెర్రీలను ప్రతి రోజూ రెండు లేదా మూడు పళ్లు తింటే కేశ ఉత్పత్తికి కావలసిన ప్రోటీన్లు, విటమిన్లు అందుతాయి.



Click it and Unblock the Notifications