Latest Updates
-
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.!
మీ జుట్టు రంగు మార్చేయాలనుకొంటున్నారా....

కలరింగ్ చేయడానికి ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు: 1. జుట్టును శుభ్రంగా కడిగిన తర్వాతే కలరింగ్ చేయాలి. మురికిగా, జిడ్డుగా ఉంటే వెంట్రుకలకు రంగు సరిగా అంటుకోదు. పైగా ఇలా చేసిన రంగు ఎక్కవ కాలం నిలువ వుండదు.
2. తలమీద ఎక్కడైనా గాయం, పుండు, దురద లాంటివి ఉన్నట్లైతే కలరింగ్ చేయకపోవడమే మంచిది.
3. కలరింగ్ తో జుట్టు కుదుళ్లు బలహీనపడటం, వెంట్రుకలు చిట్లడం జరుగుతుంది. అందుకే రంగు వేసేముందు జుట్టును ట్రిమ్ చేయించుకొంటే మంచిది.
4. వెంట్రుకలు స్ట్రైటనింగ్, పర్మింగ్ లాంటివి కలరింగ్ కు రెండు వారాల ముందే చేయించండి. ఇవన్నీ కెమికల్స్ తో కూడినవి. కాబట్టి ఒకదానికి తర్వాత ఒకటి వెంటవెంటనే చేయిస్తే వెంట్రుకుల సహజత్వాన్ని కోల్పోతాయి.
5. జుట్టుకు హెన్నా పెడితే కలరింగ్ చేయించకూడదు ఎందకంటే హెన్నా ప్రభావం ఉన్నంతవరకు కలర్ అంటుకోదు, కాబట్టి హెన్నా తీసేశాకే కలరింగ్ చేయాలి.
6. హెయిర్ డైలో కొత్తబ్రాండ్ ను వాడేముందు మీ మోచేయి దగ్గర ఆ రంగును అద్ది 15-20నిమిషాలు ఉంచి కడిగేసినట్లైతే ఆ ప్రదేశంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ కానీ, దురద, మంటపుట్టటం వంటివి లేనట్లైతే కలరింగ్ ను మీరు దారాళంగా ఉపయోగించవచ్చు...



Click it and Unblock the Notifications