Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గుడ్డు..శిరోజాలకు..వెరీగుడ్డు...

1. హెన్నాలో కోడి గుడ్డు సొన కలిపి తలకి పట్టించి బాగా ఆరని చ్చాక గోరు వెచ్చని నీటితో స్నానం చేయం డి... జుట్టు నిగనిగలాడు తుంటుంది. జుట్టు చిట్లదు.
2. అరటిపండు గుజ్జు, కప్పు పెరుగు, విటమిన్ ఇ క్యాప్సూల్ లోని పదార్థం అన్నీ కలిపి తలకు పట్టించి పదిహేను నిమిషాలయ్యాక తలస్నానం చేయాలి. ఇది చక్కటి కండీషనర్ గా పనిచేస్తుంది.
3. అలాగే ఓ రెండు గుడ్లలోని సొనని ఓ కప్‌లోకి తీసుకుని బాగా గిలకొట్టి దాన్ని తలకు పట్టించి ఆరాక గోరు వెచ్చని నీటితో కడిగేస్తే జుట్టు నల్లబడటం ప్రారంభిస్తుంది. పొడువాటి వెంట్రుకల చిగుళ్లు చిట్లిపోకుండా ఉంటుంది.
4. కొబ్బరి నూనెలో గుడ్డు సొనను కలిపి, తెల్లటి పేస్టులా తయారుచేసి, అందులో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి, మరోసారి కలిపి కుదుళ్ళకు పట్టించి అరగంట తర్వాత తల స్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలకపోగా పట్టుకుచ్చులా తయారౌతుంది.
5. తల స్నానం చేసేముందు కుదిరితే కోడి గుడ్డు లో నిమ్మకాయరసం, కొంచం పెరుగు కలిపి పెట్టుకోండి, కోడి గుడ్డు జుట్టి కి మంచి కండీషనర్ లాగా పనిచేస్తుంది.(కోడి గుడ్డు లోని పచ్చ సొన లేకుండా పెట్టుకోవాలి.)
6. అరటిపండు గుజ్జు పావుకప్పు, రెండు చెంచాల చొప్పున తేనె, నిమ్మరసం, కలిపి గంటపాటు పక్కన పెట్టి తర్వాత కురులకు పట్టించి ఆరిన తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య నియంత్రణలో ఉంటుంది.
7. నాలుగు చెంచాల ఆలివ్ నూనెకు గుడ్డులోని తెల్లసొన కలిపి బాగా గిలకొట్టి మాడుకు మర్దన చేసి అలానే తకు ఒక వస్త్రాన్ని చుట్టుకుని పదినిమిషాల తర్వాత కడిగేస్తే సరిపోతుంది. పదిహేను రోజులకోసారి ఇలా చేస్తే శిరోజాలు పట్టుకుచ్చులా జాలువారిపోతాయి.
8. గుడ్డు తెల్లసొన లేదా మజ్జికతో కలిపి రుబ్బిన కరివేపాకు లేదా మెంతి ఆకు పేస్టుల్ని తలకు ప్యాక్‌గా వేసుకోవాలి.



Click it and Unblock the Notifications