Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కురల సంరక్షణ పట్ల శ్రద్ద వహిస్తున్నా..కురులు రాలిపోతున్నాయా...?

ప్రతి నిత్యం కురులకు నూనె కూడా రాసుకోలేని వారు కొందరైతే... ట్రేండు, స్టైల్ అంటూ ఆధునికత పేరుతో కురుల సంరక్షణకి సమయాన్ని కేటాయించక ఎలా పడితే అలా అనేక రకాల రంగులలో ముంచెత్తుతుండటంతో వాటి కురులు చిట్లిపోవటం, కట్ అవ్వడం, రాలిపోవటం ప్రారంభించి చివరికి బట్ట తల కూడా వచ్చే అవకాశాలు బొలెడు ఉన్నాయి. అయితే మరి కొందరు కనీసం అప్పుడప్పుడు తలంటు కొని కేశ సంరక్షణ పట్ల శ్రద్ధ వహిస్తున్నా... వెంట్రుకలు రాలుట, చిక్కు తీసుకొనుట మొదలైన ప్రక్రియ లపైనే శ్రద్ధ వహిస్తుంటే... మరి కొందరు స్పాః ట్రీట్‌మెంట్‌ని ఆశ్రయించేందుకు మక్కువ చూపు తాన్నారు. అయితే ఈ ప్రక్రియ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదే అయినా దానివలన పొందే ప్రయోజనం ఎక్కువకాలం ఉండదని... దాని కన్నా ఇంట్లో తీసుకునే సంరక్షణ చర్యలే కురులకు మేలు చేకూరుస్తాయని బ్యుటీషియన్లు సైతం అంగీకరి స్తున్నారు.
అందుకోసం కురల సంరక్షణలో ఇంటిలోనే కేశసంరక్షణకు తీసుకో వలసిన కొన్ని జాగ్రత్తలను మీకోసం.....
1. అయిదు స్పూన్ల ఆలివ్ నూనెకు అరకప్పు తెల్లసొనను కలిపి తలకు రాసుకోవాలి, ఇరవై నిమిషాల తరువాత స్నానం చేస్తే పోషణ అంది తలకట్టు పట్టుకుచ్చులా ఉంటుంది.
2. ఒక టీ స్పూన్ తేనె, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపిన మిశ్రమంలో కోడిగుడ్డులోని తెల్లసొనను వేసి బాగా కలపాలి, ఈ మిశ్రమాన్ని జుట్టుకి కుదుళ్లనుండి పట్టించాలి. 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి.
3. జుట్టు ఎక్కువగా తెగ రాలుతుంటే దానిని పొట్టిగా కట్ చేయించాలి. అప్పటినుంచి మరింత కేర్ తీసుకోవడం మొదలెట్టండి. రెగ్యులర్‌గా ఆయిల్ పెట్టడం, రోజుమార్చి రోజు తలస్నానం చేయాలి. జుట్టును ప్రతిరోజూ మర్జన చేసుకోవాలి. జుట్టును మెత్తని టవల్ తీసుకుని దానితో నిదానంగా తుడవాలి.
4. జుట్టు మరీ జీవం కోల్పోయినట్టు కనిపిస్తుంటే బాగా పండిన అరటిపండు గుడ్డుకు నాలుగు బాదం చుక్కల నూనె చేర్చి ప్యాక్ వేసుకోవాలి. తలస్నానం చేసి చివరగా కండిషనింగ్ చేసుకుంటే సరిపోతుంది.
5. ఒక కప్పు కొబ్బరినూనె, ఒక కప్పు ఆవాల నూనె కలపాలి. ఈ మిశ్రమంలో ఒక కప్పు కరివేపాకు వేసి రాత్రంతా నానపెట్టి మరుసటిరోజు ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో వేసి, చిన్నమంటపై వేడి చేయాలి. కరివేపా కు కాస్త వేగగానే నూనె మిశ్రమంలోనించి తీసేయాలి. ఆ తరువాత దింపి మూడు కర్పూరం బిళ్లలు వేయాలి. చల్లారిన తరువాత నూనె మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లనుంచి జుట్టుకంతా పట్టించి రాత్రంతా అలాగే ఉంచి, మర్నాడు తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications