Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
కురుల చిక్కులకు చక్కని చిట్కాలు...!

చాలామంది వేసవిలోనూ డ్రయ్యర్లను వాడుతుంటారు. స్ట్రయిటనింగ్ కూడా చేయించుకుంటారు. వీటి వల్ల జుట్టు చిట్లపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అవసరాన్ని బట్టి...మితంగా వాడుకోవాలి. సాధ్యమైనంత వరకూ వాటిజోలికి వెళ్లకపోవడం మంచిది.
తేమ తగ్గినప్పుడూ కూడా వెంట్రుకలు చీలిపోతాయి. ముఖ్యంగా రంగులు, ఘాటైన షాంపూల వాడకం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. నిపుణుల పర్యవేక్షణలోనే వీటిని ఉపయోగిస్తే ఇబ్బందులు ఉండవు.
స్విమ్మింగ్ చేసి నప్పుడు తల తడవకుండా జాగ్రత్త పడటం మేలు. లేదంటే కలుషిత నీటితో కురుకలు హాని జరుగుతుంది. కొబ్బరి నూనెలో కొద్దిగా ఆముదం కలిపి వారానికి రెండుసార్లు మాడుకు మర్ధన చేసి మర్నాడు తలస్నానం చేయాలి. దీని వల్ల జుట్టు రాలడం, తెగిపోవడం వంటి ఇబ్బందులు దూరమవుతాయి.
గుడ్డులోని తెల్లసొనలో తేనె, ఆలివ్ నూనె కలిపి పూతలా వేయాలి. గంటయ్యాక షాంపూతో శుభ్రపరచుకొంటే శిరోజాలకు తేమ అందుతుంది.
సాయంత్రం పూట చక్కగా జుట్టుకు చిక్కు తీసి పాయలుగా విడదీసి ప్రతిపాయకు, మాడుకు నూనె మర్ధనా చేస్తే తలనొప్పులు తగ్గి జుట్టు మృదువుగా ఉంటుంది.
చిక్కు దువ్వెనతో ముందు చిక్కు తీసుకొని, తరువాత మామూలు దువ్వెనతో దువ్వుకోవటం ద్వారా జుట్టు రాలటాన్ని అరికట్టవచ్చు.
జుట్టుకుదుళ్లని చేతి మునివేళ్లతో మసాజ్ చేయటం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు అందం, ఆరోగ్యం మెరుగవడమే కాకుండా టెన్షన్ తొలగుతుంది. తలపై నుంచి చెవుల వరకు తల వెనుక నుంచి కణతల వరకు మసాజ్ చేస్తూ తల మొత్తం మసాజ్ జరిగేలా చేయాలి. తరువాత పెద్ద పళ్ల దువ్వెనతో జుట్టు చిక్కు తీయాలి.
జుట్టు తడిగా వున్నపుడు తలదువ్వుకోకూడదు. కుదుళ్ళలో నుండి వెంట్రుకలు వూడి వస్తాయి. జుట్టు తడి పొడిగా వున్నప్పుడు దువ్వుకోండి. లకు రోజూ నూనె రాసుకోవటంలో (లేదా వారానికి రెండుసార్లయినా) అన్నది కేశాలను బలంగా వుంచుతుంది. జుట్టు జిడ్డుగా వున్న కారణంగా దానికి నూనె అవసరం లేదని భావించవద్దు.
గుంటగలరాకు, ఉసిరికపొడి, మందారపూలు, గోరింటాకు ఈ నాలుగింటినీ మిళితం చేసి బాగా మరగకాచి చల్లార్చిన నూనెను కలిపి తలకు మర్దన చేసుకొంటే వేసవి కాలంలో కూడా హాయిగా వుంటుంది. శిరోజాలు మృదువుగా, తయారవటమే కాకుండా మిలమిలా మెరుస్తాయి!



Click it and Unblock the Notifications
