Latest Updates
-
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా..
నిర్జీవంగా మారిన కేశాలు..తళతళ మెరవాలంటే..
వాతావరణంలో వచ్చే తేడాల వలన, ఉష్ణోగ్రతల తారతమ్యం వలన రకరకాల కేశసంపద కలిగిన వ్యక్తులను ఒకే చోట చూసే అవకాశం అప్పుడప్పుడు మనకు కలుగుతుంది. సాధారణంగా కేశాలు కలిగిన వ్యక్తులను ఒకే చోట చూసే అవకాశం అప్పుడప్పుడు మనకు కలుగుతుంది. సాధారణంగా కేశాలు ఎటువంటివైనా అవి ఆరోగ్యంతో నిగనిగలాడుతుంటేనే వాటికి చక్కగా అలంకరించడం సాధ్యమవుతుంది.
ఎండిపోయి నిర్జీవంగా మారిపోతే వాటిని ఎటువంటి స్టైయిల్ లో అలంకరించినా అతికించినట్లుగానే ఉంటాయి తప్ప సహజసిద్దమైన రంగు వాటికి కనబడదు. వెంట్రుకలు నిర్జీవంగా మారిపోకుండా ఉండాలంటే వాటికి అప్పుడప్పుడు ఎంత తేమ అవసరమవుతుందో పరీక్షించి చూసుకోవడం చాలా మంచిది. మరి కేశాలకు సంబంధించిన కొన్ని చిట్కాలు మీకోసం...

1. రెండు అరటి పండ్లను మెత్తని గుజ్జులా చేసుకోవాలి. రెండుటేబుల్‌స్పూన్ల తేనెను అందులో కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి, అరగంట తర్వాత తల స్నానం చేయాలి. ఇది పొడిబారిన జుట్టుకు చక్కని పరిష్కారం. ఇలా చేస్తే మీ జూట్టు పట్టులా మెరుస్తుంది.
2. వెంట్రుకలు తెల్లబడకుండా ఉండాలంటే ఉసిరికాయ రసం, నువ్వుల నూనె సమపాళ్ళలో కలిపి, కాచి తలకు రాసుకోవాలి.
3. ఒక కోడిగుడ్డులోని సొనను చిన్న గిన్నెలో వేసి బాగా చిలకరించి అందులో ఒక నిమ్మపండు రసం కలపండి. నాలుగు చెంచాల పెరుగును కూడా ఈ సొనకు కలిపి తలకు పట్టించి అరగంటసేపు వుండండి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే మీ వెంట్రుకలు మృదువుగా, కాంతివంతంగా వుంటాయి.
4. కొబ్బరినూనెలో వెల్లుల్లిపాయలను ఉడికించి, వడకట్టి ప్రతిరోజూ తలకు రాస్తే తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి
5. ఉసిరి పొడిని ఇనప పాత్రలో రాత్రిపూట నానవేసి ఉదయాన్నే ఆ మిశ్రమాన్ని బ్రష్‌తో వెంట్రుకలకు పట్టించండి. అనంతరం తలకు షవర్ క్యాప్ పెట్టుకోవడం వల్ల మిశ్రమం ఒంటి మీద పడదు. గంట తర్వాత స్నానం చేస్తే సరి.
6. ఎండలో బయటకి వెళ్ళినపుడు సన్‌స్క్రీన్‌ని చర్మ సంరక్షణ కోసం వాడుతుంటారు. అలాగే ఎక్కువ సేపు ఎండలో తిరగాల్సి ఉన్నప్పు డు సన్‌స్క్రీన్ ఉన్న జుట్టు ఉత్పత్తులను వాడవచ్చు.
7.ఎక్కువగా జుట్టు రాలుతోందా ఒక ఉల్లిపాయను మెత్తగా పేస్టులా చేసుకోవాలి. దానికి చెంచాడు తేనె కలపాలి. తలకు పట్టించి గంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
8. ఒక కప్పు దంపుడు బియ్యానికి మూడు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. అన్నం ఉడికిన తర్వాత బియ్యాన్ని విడిగా తీయగా వచ్చిన గంజిని చల్లారబెట్టాలి. ఈ గంజిని ఆరంగ ఆరంగా కనీసం మూడుసార్లు జుట్టుకు పట్టించాలి. తర్వాత చల్లని నీటితో శిరోజాలను శుభ్రపరుచుకోవాలి. ఇది జొన్న పీచులా పలుచగా ఉండే జుట్టును ఒత్తుగా చేస్తుంది.
9. ఒక్కోసారి తలంతా దురద పుడుతుంది. అలాగని ఊరికే గోకుతుంటే మాడు పుండు పడుతుంది తప్ప దురద మానదు. ఇందుకు బీట్ రూట్ రసం మంచి చికిత్స. అందుకు ఏం చేయాలంటే తాజా బీట్ రూట్‌ను చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో చిక్కటి రసం తీయాలి. దీనిని నేరుగా తలకు పట్టించుకోవాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. జుట్టు పట్టులా మెరుస్తుంది.
10. కొంతమంది జుట్టు జిడ్డుగా, నూనె కారుతూ ఉంటుంది. తలస్నానం చేసిన కొద్దిసేపటికే జుట్టు జిడ్డుగా తయారై రాలిపోతుంటుంది. ఇటువంటివారు ఒకవేళ కండీషనర్ వాడదలుచుకుంటే పెరుగును మాత్రం వాడుకోవాలి. కండీషనర్‌ను తలకు కాకుండా వెంట్రుకల కొసలకు ప్రయోగించాలి. స్నానానికి ఉపయోగించే నీళ్లకు కొద్దిగా నిమ్మరసాన్ని చేర్చితే జిడ్డు వదులుతుంది.



Click it and Unblock the Notifications