Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
వేసవితాపానికి జుట్టుకీ సన్ స్ర్కీన్ లోషన్....

1. పాత్రలో టేబుల్ స్పూన్ అవొకాడో గుజ్జు, టీ స్పూన్ తేనె, రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి అయిదు నిమిషాలపాటు బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని హెయిర్ బ్రష్ సహాయంతో తలకు పట్టించి అరగంట తరవాత షాంపూతో తల స్నానం చేయాలి. డ్రై హెయిర్ గల వారు 15 రోజులకి ఒకసారి ఈ మాస్క్ వేసుకుంటే నిర్జీవమైన జుట్టు నిగనిగలాడుతుంది.
2. చిట్లిపోయినట్లుగా ఉండే జుట్టు చివర్లను కత్తిరించాలి. అయితే పొడిబారి, బిరుసుగా ఉన్నట్లయితే పొట్టిగా కత్తిరించుకోవటం ఉత్తమం. ఎండనుంచి రక్షణ కోసం తలకు క్యాప్ లేదా స్కార్ప్ పెట్టుకోవటం మంచిదే అయినా, వాటిని మరీ బిగుతుగా కాకుండా కాస్త వదులుగా పెట్టుకోవాలి.
3. హెన్నా మిశ్రమంలో మందార ఆకులను పేస్ట్ చేసి కలిపి జుట్టుకు పట్టించి అరగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
4. వేడి నీటితో తల స్నానం మానాలి. గోరువెచ్చని లేదా చల్లని నీటినే వాడటం శ్రేయస్కరం. వేసవిలో ఆల్కహాల్ ఉన్న హెయిర్ ప్రొడక్ట్స్ తలకు ఉపయోగించకూడదు. ఇవి జుట్టును పొడిబారేలా చేస్తాయి. ప్రతి రోజూ తలస్నానం చేయాలి. షాంపూతో కాకుండా ప్రకృతి సిద్ధమైన శీకాకాయ, కుంకుడుకాయలతో అయితే మరీ మంచిది.
5. కప్పు పెరుగులో రెండు కోడిగుడ్ల సొన కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంటన్నర తరవాత షాంపూతో తలస్నానం చేయాలి. పది రోజులకి ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే నిగనిగలాడే జుట్టు సొంతం అవుతుంది.
6. జుట్టును ముడిలా పైకి కట్టుకోవడం వల్ల చిట్లి పోకుండా, పీచుగా తయారవకుండా కాపాడుకోవచ్చు. ఎక్కువ సమయం ఎండలో తిరగడం వల్ల జుట్టు పాడైపోతే సన్‌హెయిర్ రిపెయిర్ మాస్క్ వాడవచ్చు. తలకు మరింత వేడినిచ్చే హెయిర్ డ్రయర్స్ లేదా హెయిర్ కర్లర్స్ వాడడం మంచిది కాదు. ఒక వేళ తప్పని సరి వాడాల్సి వస్తే హెయిర్ కండి షన్ అప్లై చేసిన తరువాత వాడాలి.



Click it and Unblock the Notifications