Latest Updates
-
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్! -
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా? -
మీ నాలుక ఇలా ఉంటే మహారాజ యోగమే.. శాస్త్రం ఏం చెబుతోందంటే? -
మైదా బ్రెడ్ కు గుడ్ బై.. ఇంట్లోనే ఈజీగా రాగి బ్రెడ్ చేసుకోండిలా..ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి! -
దంతాలు డైమండ్స్ లా మెరవాలా? తేనెతో ఇలా చేయండి.. -
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా సలాడ్..తింటే ఎముకలు ఉక్కులా, కండరాల పుష్ఠి! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.!
పీచులా పలుచగా ఉండే జుట్టు ఒత్తుగా పెరిగే చిట్కా...

1. ఎక్కువగా జుట్టు రాలుతోందా ఒక ఉల్లిపాయను మెత్తగా పేస్టులా చేసుకోవాలి. దానికి చెంచాడు తేనె కలపాలి. తలకు పట్టించి గంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
2. ఒక కప్పు దంపుడు బియ్యానికి మూడు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి.అన్నం ఉడికిన తర్వాత బియ్యాన్ని విడిగా తీయగా వచ్చిన గంజిని చల్లారబెట్టాలి. ఈ గంజిని ఆరంగ ఆరంగా కనీసం మూడుసార్లు జుట్టుకు పట్టించాలి. తర్వాత చల్లని నీటితో శిరోజాలను శుభ్రపరుచుకోవాలి. ఇది జొన్న పీచులా పలుచగా ఉండే జుట్టును ఒత్తుగా చేస్తుంది.
3. ఒక్కోసారి తలంతా దురద పుడుతుంది. అలాగని ఊరికే గోకుతుంటే మాడు పుండు పడుతుంది తప్ప దురద మానదు. ఇందుకు బీట్ రూట్ రసం మంచి చికిత్స. తాజా బీట్ రూట్ ముక్కలను మిక్సీలో వేసి చిక్కటి రసం తీయాలి. దీనిని నేరుగా తలకు పట్టించాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే జుట్టు పట్టులా మెరుస్తుంది.
4. గాలి తగిలేలా మూడు రోజులు నిల్వ ఉంచిన పెరుగును తలకి మర్దన చేసి తలస్నానం చేస్తే చుండ్రు పోతుంది.
5. తల స్నానానికి ముందు తలకు నూనె పెట్టుకుని, మృదువైన షాంపూ తో తలస్నానం చేయండి. జుట్టు పొడిబారటం తగ్గుతుంది.
6. తలకు గోరింటాకు పెట్టుకునే ముందుదానిలో కొద్దిగా బీట్ రూట్ రసాన్ని కలిపితే జుట్టుకు మంచి మెరుపుతో పాటు రాగిరంగు ఛాయ వస్తుంది.
7. పొడిజుట్టుకి కొబ్బరినూనె, కొబ్బరిపాలు, పెరుగు సమభాగంలో తీసుకొని, గుడ్డులోని తెల్లసొన చేర్చి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ళకు ఇంకేలా పట్టించాలి. 20 నిమిషాల తర్వాత కడగేయాలి.



Click it and Unblock the Notifications