Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
రఫ్ గా ఉన్న మీ హెయిర్ ను సిల్కీగా మార్చేయండిలా....!

1. అవకాడో -బనానా మాస్క్: ఈ హెయిర్ మాస్క్ ను ఉపయోగించడం వల్ల కేశాలు పునరుత్పత్తి చెంది మంచి షైనింగ్ తో మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటాయి అందుకు కావల్సిన పదార్థాలు:
మీడియంగా మాగిన పచ్చి అరటికాయ 1
అవకాడో: 1/2
గుడ్డు: 1
పెరుగు: 3tbsp
ఆలివ్ ఆయిల్: 3tbsp
తేనె: 2tbsp
ఎలా తయారు చేయాలో చూద్దాం: ముందుగా బనానా, అవాకాడోని బాగా చిదిమి పెట్టుకోవాలి. లేదా చితగొట్టి ఒక బౌల్ లోని తీసుకొని అందులో గుడ్డులోని తెల్లసొన, పెరుగు, ఆలివ్ ఆయిల్, తేనె కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలమాడుకు, కేశాలకు చేతి వేళ్ళతో అప్లై చేసుకోవాలి. పూర్తి తలంతా అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉండి, అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో గోరు వెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
2. పెరుగుతో హెయిర్ మాస్క్: పొడిబారిన వెంట్రుకలు, మరియు చిక్కుబడిన జుట్టుకోసం ఈ మాస్క్ చక్కటి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. దాంతో హెయిర్ సిల్కీగా మెరుస్తూ ఉంటుంది. ఇది చిక్కుముడి ఉన్న వెంట్రుకలకు, పొడబారినా తలకు ఇదా చాలా చక్కగా పనిచేస్తుంది. కాబట్టి పెరుగు మాస్క్ తో మీ హెయిర్ ను సిల్కీగా తీర్చి దిద్దుకోవచ్చు. అందుకు కావల్సిన పదార్థాలు:
పెరుగు: 1/4cup
గుడ్డులోని తెల్లని సొన
మయోనైజ్: 1/4cup
ముందుగా గుడ్డులోని తెల్లటి సొనను ఒక బౌల్ లోనికి తీసుకొని అందులో పెరుగు, మయోనైజ్ ను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమం బాగా మిక్స్ అయ్యేలా కలుపుపోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని తడి జుట్టుకు అప్లై చేసి, తలను ప్లాస్టిక్ క్యాప్ తో కట్టేసుకొని అరగంట పాటు ఆరనివ్వాలి. అరగంట తర్వాత హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా నెలకు ఒక్కసిరి చేస్తే చాలు. ఇది కురులకు మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications