Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ట్రెండ్ ను బట్టి మారుతున్న కేశ అలంకరణ.....

తర్వాత కలానుగుణంగా ట్రెండ్ మారే కొద్ది మినీ స్కర్టులూ, జీన్సూ, పోనీటెయిళ్లూ, బాబ్డ్ హెయిర్‌ల రాకతో జడ కాస్తా కటింగయిపోయింది. లూజ్ హెయిర్ గా స్టైల్‌పోతుంది. పాతవన్నీ మళ్ళీ వచ్చాయి. కారణం ఈనాటి అతివలలో సందర్భానుసారంగా మోజుతో అలంకరించుకుంటున్నారు. డ్రెస్సును బట్టి హెయిర్ స్టైల్. క్యాజువల్ డ్రెసెస్ లో జుట్టు పొట్టిగా ఉండాలి. ఫంక్షన్లకి మాత్రం వాలుజడే కావాలి.. అందుకే అమ్మాయిలు సవరాలు పెట్టుకొని అయినా సరే చూడముచ్చటగా జడలల్లుతున్నారు. వాటిని మళ్ళీ బంగారు జడలతోనూ బిగిస్తున్నారు. ఒకప్పుడు ఆర్డరిస్తేనే కానీ చేయని పసిడి జడలు నేడు రకరకాల డిజైన్లలో జ్యువెలరీ షాపుల్లో కొలువుదీరున్నాయి. బంగారం కొనే స్థోమత అందరికీ లేదు కాబట్టీ కృత్రిమ జ్యువెలరీలున్నాయి. వన్‌గ్రామ్ గోల్డ్ ఉండనే ఉంది. వీటిని మించి క్రిస్టల్ యాక్సెసరీలూ, మొత్తం జుట్టంతా సింగారమే.
కాస్త పెద్ద వయసొస్తేగానీ ముడి జోలికి పోని మగువలు ముప్ఫయ్యేళ్ళకే ముచ్చటపడి మరీ సిగ చుట్టేసేవారు. అయితే ఆ కొప్పుల్లో నాజూగ్గా ఓ గులాబీ పెట్టడంతోనే అలంకరణను సరిపెట్టేవారు. మరి ఇప్పుడో… ముడి ఫ్యాషన్ మాయలేదు. అలాగే ఉంది. ఈ తరం అతివలు మరీ యిష్టపడి ముడివేస్తున్నారు. పెళ్లికి జడ వేస్తే, రిసెప్షన్లకి ప్రత్యేక హెయిర్ స్టైల్స్‌తో మెరుస్తున్నారు.
ఇక బాబ్డ్ హెయిర్లకీ పోనీటెయిళ్ళకీ, పొట్టి జడలకూ బోలెడు యాక్ససరీలు.. హెయిర్ పిన్నులు, క్లిప్పులు, జడబిళ్ళలు.. వంటివన్నీ రంగు రంగుల రాళ్ళతో సిల్కు రిబ్బన్లతో చిత్రవిచిత్రమైన డిజైన్లలో తళుక్కుమంటున్నాయి. పూసలు, దంతం, చెక్కతో చేసినవీ వస్తున్నాయి. ఇలా సిగలో అలంకరించుకునే ఆభరణాలెన్నో ! సో… కొనాలేగానీ మనసు మెచ్చిన మగువల కోసం ట్రెండ్ కు తగ్గ కేశాభరణాలు ఎన్నో...



Click it and Unblock the Notifications