Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ కేశ అలకంరణ మీ భావాలను ప్రతిబింబిస్తుంది....!

ఈ తరం అమ్మాయిలు ఎప్పుడూ ఒకే తరహా హెయిర్ స్టైల్ లో ఉండాలనుకోవటంలేదు. ముఖానికి తగిన హెయిర్ స్టైల్ కోరుకుంటున్నారు. ప్రకృతిలో ఉన్న ఏ రంగునైనా శిరోజాలకు వేసుకోవచ్చు. హెయిర్ స్టైల్ మార్చుకోవటంలో భాగం శిరోజాలకు కొత్త రంగు వేసుకోవటమే.
చాలామంది మహిళలు డ్రెస్సింగ్ స్టైల్ పై చూపే శ్రద్ధ తమ హెయిర్ స్టైల్ పై చూపరు. దీంతో మీరు ఎంత విలువైన దుస్తులు ధరించినా ఎక్కడో లోటు కనపడుతుంటుంది. అదే హెయిర్ స్టైల్ పై ప్రత్యేక దృష్టి పెడితే మరింత అందంగా కనబడుతారు. మీ హెయిర్ స్టైల్ తో మీ పర్సనాలిటీ పెరుగుతుంది.
హెయిర్ స్టైల్ అనేది వాతావరణాన్నిబట్టి మార్చాల్సివుంటుంది. ఎందుకంటే వేసవి కాలంలో మీరు వెంట్రుకలను ముడి వేయకుండా గాలికి వదిలేస్తే మీరు మీ వ్యక్తిత్వంలో నిలకడ లేనివారిగా నలుగురిలో తక్కువగా చూడబడుతారు.
ప్రస్తుతం మళ్ళీ పొడవాటి వెంట్రుకల ఫ్యాషన్ వచ్చేసింది. మీ ముఖం గుండ్రటి ముఖమైతే పొడవాటి వెంట్రుకలపై దృష్టి సారించండి. వీటిని ముడి వేయకండి. అదే విధంగా కోలముఖం కలిగినవారైతే మీ పొడవైన వెంట్రుకలను సగానికి ముడి వేసి మిగిలిన భాగాన్ని వదిలివేయండి. దీంతో మీ వ్యక్తిత్వంతో పాటు అందం కూడా మరింతగా కనిపిస్తుంది.
హెయిర్ స్టైల్ వయసుకు తగ్గట్టు, మీరు ధరించే దుస్తులకు తగ్గట్టు ఉండాలి. విలువైన, అందమైన దుస్తులు ధరించినా మీ హెయిర్ స్టైల్ సరిగా లేకపోతే వాటికి విలువ పోతుంది. దీంతోపాటు మీ అందం కాస్త తగ్గుతుంది.



Click it and Unblock the Notifications