For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెల్ల జుట్టుకు చక్కటి కండీషనర్ మందారం-టీ...!

|

Hibiscus Hair Conditioners for Thick Hair...!
సాధారణంగా కొందరిలో పోషకాల లోపం, మరికొందరిలో వాతావరణ.. ఇలా కారణం ఏదేనా కావచ్చు కేశాలు రాలిపోవడానికి. అయితే కొందరు మానసికంగా కుంగిపోతుంటారు. మరికొందరు కురుల రాలిపోవడానికి అసలు కారణమేంటో తెలుసుకొని మరీ రకరకాలుగా ప్రయోగాలు చేస్తుంటారు. అలా ప్రయోగాలు చేసేవారు రసాయనాలతో తయారైనటు వంటివి కాకుండా సహజంగా లభించే వాటితోనే హెయిర్ ఫాలింగ్ కి పరిష్కారం ఉంది.

ముఖ్యంగా కురుల సంరక్షణలో పరిశుభ్రత అవసం. పరిశుభ్రత పాటించకపోతే కేశాలకు అనేక సమస్యలు చుట్టుముడుతాయి. అందుకే ముందుగా శిరోజాల్ని శుభ్రంగా పెట్టుకోవడం తప్పనిసరి. ఉల్లిపాయ ముక్కలు వేసి మరిగించిన నూనెను తలకు పట్టించి మర్ధన చేసి, అరగంట తర్వాత గంజిని తలకు పట్టించి ారేవరకూ ఉంచాలి. ఆరిన తర్వాత మృదువైన షాంపూతో తలస్నానం చేస్తే రక్త ప్రసరణ జరిగి ఒత్తైన శిరోజాలు సొంతమవుతాయి.

పొడిబారిన జుట్టుకి: దుమ్ము, ధూళి, కాలుష్య ప్రభావంతో కొన్నిసార్లు జుట్టు నిర్జీవంగా మారుతుంది. అలాంటప్పుడు ఆరు మందార ఆకులు, రెండు చెంచాల కలబంద గుజ్జుని మెత్తగా చేసుకొని తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే ఆరోగ్యంగా ఎదుగుతుంది.

కండీషనర్ గా: నిత్యం ప్రయాణాలు చేసేవారు వారానికోసారి కండిషనర్ ను ఉపయోగించడం మేలు. దీనికి టీ పొడి చక్కగా పనిచేస్తుంది. టీ డికాషన్ లో చెంచా మందార పొడి, రెండు చుక్కల నిమ్మరసం, కోడిగుడ్డులోని తెల్లసొన, రెండు చుక్కల బాదం నూనె కలిపి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేస్తే సరి. ఇది తెల్లబడిన జుట్టుకి కూడా చక్కగా పనిచేస్తుంది.

చల్లచల్లగా: సూర్యకిరణాలు నేరుగా తాకే ప్రదేశం తల. కాబట్టి అతినీలలోహిత కిరణాల ప్రభావం, అధిక వేడి వల్ల జుట్టు చిట్లపోవడం, రంగుమారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీనికి నివారణగా రాత్రి నానబెట్టిన మెంతుల్ని మెత్తగా చేసుకొని దానిలో రెండు చెంచాల చొప్పున మందారపొడి, పుల్లని పెరుగు, చెంచా ఆముదం కలపి తలకు పట్టించాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే కురులు కొత్త కాంతిని సంతరిచుకోవడంతో పాటూ ఒత్తుగా పెరుగుతాయి.

తేమ అందేలా: కురులకు తగిన తేమ అవసరం. లేకపోతే కురులు బలహీనంగా తయారువుతాయి. ఇలాంటప్పుడు కొబ్బరి నూనెలో గుప్పెడు చొప్పున మందార పువ్వు రేకులు, తులసి, కరివేపాకు వేసి మరిగించాలి. దీన్ని వారానికోసారి తలకు పట్టించి అరగంట తర్వాత మృదువైన షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు పట్టులా ఉంటుంది.

నల్లగా నిగనిగలాడేలా: వివిధ కారణాల వల్ల కొందరి జుట్టు చిన్న వయసులోనే నెరిసిపోతుంది. ఇలాంటివారికి చక్కని పరిష్కారం మందారంతో లభిస్తుంది. ముందురోజు రాత్రి పెరగులో నాలు చెంచాల మందారపొడి, సరపడేంత గోరింట పొడులను నానబెట్టాలి. ఉదయాన్నే కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా ఇన్ స్టంట్ కాఫీ పొడి కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో రోజులకోసారి చేయడం వల్ల జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది.

English summary

Hibiscus Hair Conditioners for Thick Hair...! | ఒత్తైన కురులకు మందార సౌందర్యం...!

This is a simple DIY hair pack which is extremely awesome. Aloe vera is so good for hair and also hibiscus leaves and flowers. So, this hair pack has only these two ingredients. Use for hair care purposes the red flower and leaves, extract are a simple application that involves soaking the leaves and the flowers in water. Then grinded while wet to make a thick paste to make a natural shampoo. The flower petals are used to cure fever while the roots are used to cure cough which can be applied on hair to tackle dandruff on the scalp. It is used to make hair-protective oils much like modern day hair conditioners.
Story first published:Saturday, June 23, 2012, 17:00 [IST]
Desktop Bottom Promotion