For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెత్తని...మృదువైన కేశసౌందర్యానికి మందారం....

|

Hibiscus for Soft and Shiny Hair....
ఎర్రమందారం..ముద్దమందారం ఎంతదంగా ముదురాకుపచ్చని రెమ్మల మధ్య దాగిఉంటుంది. మందారంలో ఎన్నో రంగులు, సొబగులు, రాకాలు ఉన్నా ముద్దమందారం అందం, రంగు ముందు మరే పువ్వు సాటిరాదు. అటువంటి మందారంను సహజ సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తారు. మందార ఆకులు, ఎండిన పువ్వులు రెండూ ఎంతో ఉపయోగం. సౌందర్య పోషణలో మందార ఆకులు, పూలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మందారాలతో మెత్తటి కురులను మీ సొంతం చేసుకోవచ్చు.

1. జుట్టు పెరగడానికి, నల్లబడేందుకు దీని పువ్వుల రసం కొబ్బరినూనెతో సమపాళ్లలో కలిపి వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది. ఎండిన మందారాలను కొబ్బరి నూనెలో వేసి మరగకాచి తరచూ తలకు పెట్టుకొంటుంటే జుట్టు రాలడం తగ్గి వెంట్రుకలు ఏపుగా పెరగడానికి దోహదపడుతుంది.
2. ఆకులు మెత్తగా రుబ్బి, నూరి కుంకుడు రసంలో కలిపి తలంటుస్నానానికి వాడతారు. దాంతో జుట్టు ఎంతో మృదువుగా తయారవుతుంది.
3. పేను కొరికిన చోట దీని పువ్వులను నలిపి రోజుకు రెండు, మూడుసార్లు రాస్తే తిరిగి వెంట్రుకలు వస్తాయి.
4. మందార పూలను మెత్తగా మిక్సీ పట్టాలి. దీన్ని కుదుళ్లకు, జుట్టు మొత్తానికి బాగా పట్టించాలి. అరగంట తర్వాత గోరు నీటితో తలస్నానం చేయాలి. ఇలా రోజు విడిచి రోజు చేస్తే జుట్టు రాలడం, చుండ్రు బాధా తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల జుట్టు నల్లగా నిగనిగలాడుతుంటుంది. అంతేకాదు..మాడుకు చల్లదనాన్ని ఇచ్చి, కుదుళ్లను గట్టిపరుస్తుంది.
5. మందార ఆకులను మెత్తగా నూరి అందులో పెరుగు వేయాలి. దీన్ని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. ఇది జుట్టుకు కండీషనర్‌ గా కూడా పనిచేస్తుంది.
6. మందార పూల గుజ్జు, కలబంద గుజ్జును సమపాళ్లలో తీసుకొని కలిపి దాన్ని తలకు రాసి అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడగాలి. ఇలా చేస్తే జుట్టు మెత్తబడడమే కాదు, చుండ్రూ తగ్గుతుంది.

English summary

Hibiscus for Soft and Shiny Hair.... | మెత్తని...మృదువైన కేశసౌందర్యానికి మందారం....

In Ayurveda, Hibiscus is known as one of the best secrets to healthy and beautiful hair. Hibiscus promotes hair growth, stops hairfall, gives hair healthy shine and bounce and delays pre mature graying.
Story first published:Thursday, March 15, 2012, 17:13 [IST]
Desktop Bottom Promotion