Latest Updates
-
గ్యాస్, అసిడిటీకి తక్షణమే చెక్ పెట్టే అద్భుతమైన వాము పరాఠా.. ఎలా చేయాలో తెలుసా? -
తొలి ఏకాదశి తేదీ, తిథి, పూజా విధానం, ఉపవాసం ఎలా విరమించాలి.. పూర్తి వివరాలు.! -
టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా? యూరాలజిస్ట్ చెబుతున్న అసలు నిజం ఇదే! -
వృశ్చికంలోకి చంద్రుడు.. రానున్న మూడు రోజులు ఈ రాశుల వారి గోల్డెన్ డేస్.! -
హిమాచల్ ప్రదేశ్ ఫేమస్ కధి పకోడి..వేడి వేడి అన్నంతో తింటే అమృతమే..ఈజీగా చేసుకోండిలా.. -
నాన్‌వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ !
స్ట్రైయిట్ హెయిర్ (నిఠారైన కురుల) ఇలా సొంతం... !

కేశాల్లో కొందరికి కర్లీ హెయిర్ వుంటే మరి కొందరికి స్ట్రెయిట్ హెయిర్ వుంటుంది. తమ సహజసిద్ధమైన కేశాలను ఇష్టపడేవారూ ఉన్నారు. అలా కాకుండా నిటారుగా ఉన్న జుట్టును వంకీలు తిప్పించుకునేవారు, నొక్కులుగా ఉన్న కురులను తిన్నగా మార్చుకునేవారూ ఉన్నారు. అయితే ఇప్పుడు అమ్మాయిల్లో ఎక్కువగా స్ట్రైయిటనింగ్ హెయిర్ స్టైల్ బాగా ప్రాచుర్యం పొందుతోంది. అయితే ఇలా చేయించుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. హెయిర్ ప్రొసీజర్స్ ఏమైనా చేయించుకున్నప్పుడు అంటే పెర్మింగ్, స్ట్రెయిటెనింగ్ వంటి వాటి వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి. ఫలితంగా వెంట్రుకలు పొడిబారిపోయి, నిస్తేజంగా, నిర్జీవంగా మారిపోతాయి. కొన్ని సందర్భాలలో చివర్లు చిట్లిపోవడం, కుదుళ్లు పూర్తిగా దెబ్బతినడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి వీలయినంతవరకు మీ జుట్టు స్వతస్సిద్ధంగా ఎలా ఉంటుందో అలానే ఉంచుకోవడం మంచిది. మంచి హెయిర్ ఆయిల్‌ను జుట్టు కుదుళ్లకు పట్టేటట్లు సున్నితంగా మసాజ్‌చేసి, ఆ తర్వాత కండిషనర్ ఉన్న షాంపూతో తలంటు పోసుకుని గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయడం లేదా తలస్నానం తర్వాత తలకు కండిషనింగ్ అప్లై చేయడం వల్ల కురులు కాంతివంతంగా సున్నితంగా, నైస్ గా కనబడుతాయి.
బ్యూటీ పార్లర్లకు వెళ్లి వేలరూపాయలు కర్చుపెట్టి కృత్రిమ పద్దతులతో స్ట్రైయిట్ హెయిర్ చేయించుకొని సమస్యలు కొని తెచ్చుకోవడం కంటే ఇంట్లో సహజసిద్దంగా లభించే వాటితో స్ట్రైయిట్ హెయిర్ కోసం ప్రయత్నించవచ్చు. వివిధ రకాలైనటువంటి హెయిర్ స్టైల్, సిల్కీ హెయిర్ కోసం ఇంట్లో తయారు చేసుకొనే కొన్ని సహజ పద్దతులు మీకోసం....
పెరుగు: మీ కేశాలు సిల్కీగా, నునుపుగా తయారవ్వాలంటే పెరుగు బాగా పనిచేస్తుంది. తలస్నానం చేసే ముందు మీ తలకు కేశాల చివర్ల వరకు పెరుగును అప్లై చేసి అరగంట పాటు అలాగే వదిలేయాలి. (పెరుగు పెట్టిన తర్వాత అరగంటకు మించి ఎక్కువ సమయం అలాగే ఉంచకూడదు. అలా చేయడం వల్ల కేశాలు పొడిబారుతాయి). అరగంట తర్వాత మంచి షాంపూతో తలస్నానం చేయాలి. కావాలనుకుంటే పెరుగులో తేనె కలిపి అప్లై చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల తేనె జుట్టు నిగనిగా మెరిసేలా సహాయపడుతుంది. ఒక వేళ చుండ్రు ఉన్నట్లైతే అందులో కొద్దిగా నిమ్మరసం కూడ కలుపుకోవచ్చు.
ఎగ్ ప్యాక్: నునుపైన సిల్కీ, షైనీ హెయిర్ కు ఎగ్ బాగా సహాయపడుతుంది. మీ కురుల పొడవు, ఒత్తును బట్టి గుడ్లు ఎన్ని కావాలో ఎంపిక చేసుకోవాలి. చిన్న బౌల్లో గుడ్డులోని తెల్ల సొన వేసి బాగా గిలకొట్టి కురులకు అప్లై చేసి అరగంట పాటు అలాగే ఆరనివ్వాలి. తర్వాత ఒక మంచి షాంపూతో తలస్నానం చేయాలి.
వెనిగర్: స్ట్రైయిటనింగ్ (నిఠారైన) కురులకు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే, కురులు నిర్జీవంగా మారి పొడిబారినట్లు కనిపిస్తాయి. వెనిగర్ స్ట్రైయిట్ హెయిర్ కు బాగా పనిచేస్తుంది. ఇది అప్లై చేయడం వల్ల హెయిర్ గ్లాసీగా కనిపిస్తాయి. కొన్ని చుక్కల వెనిగర్ ను ఒక మగ్ నీటిలో పోసి తలస్నానం పూర్తి అయిన చివరన అలార పోసుకొని రావాలి. ఇలా తరచూ చేస్తూ వుంటే సిల్కీ , షైనీ స్ట్రైయిట్ హెయిర్ మీ సొంతం అవుతాయి.
వేడి నూనె మసాజ్: వారానికి ఒక్కసారి హాట్ ఆయిల్ మసాజ్ చేస్తూ ఉండాలి. హాట్ ఆయిల్ మసాజ్ చేయడం వల్ల స్ట్రైయిట్ హెయిర్ మాత్రం కోసమే కాదు. కేశాలు గట్టిపడి పెరగడానికి ఉపయోగపడుతుంది. వారానికి ఒక సారి తలస్నానానికి ముందు హాట్ ఆయిల్ మసాజ్ చేసుకోవడం మంచిది. అందులో కొబ్బరినూనె, బాదం నూనె చాలా మంచిది. నూనె చిన్న బౌల్ లో వేడి చేసి చేతి ముని వేళ్లతో తల మాడుకు కొన్ని నిమిషాల పాటు బాగా మర్థన చేసి, రాత్రంతా అలాగే వదిలేయాలి. ఉదయాన్నే లేచి చల్లటి నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కురులు చాలా సున్నితంగా షైనింగ్ హెయిర్ గా మారుతాయి.
టీ: కురులకు టీ చాలా మంచి కండీషనర్. మరియు ఇది కలర్ ఏజెంట్ కూడా. కొద్దిగా బ్లాక్ టీ పొడి గిన్నెలో వేసి బాగా వేడి చేసి తలకు సహజ కండిషనర్ గా వాడుకోవచ్చు. నీటి డికాషన్ ను తలకు పట్టించి ఇరవై నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కురులు నిఠారుగా మారడానికి మంచి కలరింగ్ తో పెరగడానికి బాగా సహకరిస్తుంది. కాబట్టి పైన తెలిపి సూచనలన్నీ క్రమం తప్పకుండా పాటిస్తుంటా తప్పకుండా మీ కురుల స్ట్రైయిట్ హెయిర్ గా మారే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రయత్నించి చూడండి.



Click it and Unblock the Notifications