Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆరోగ్యకరమైన కేశ సౌందర్యానికి హోం మేడ్ హెయిర్ మాస్క్ లు
కేశ సౌందర్యం అభివృద్ధి చేసుకోవలాంటే చర్మానికి ఎంత జాగ్రత్తలు తీసుకొంటామో అంతే జాగ్రత్తలు కేశాల గురించి కూడా తీసుకొంటే మీ కురులు మరింత ఒత్తుగా ..అందంగా పెరుగుతాయంటే ఆశ్చర్యం కలగక మానదు. మీకు ఎక్కువగా హెయిర్ ఫాల్, జుట్టు తెగడం, పొడిబారిపోవడం వంటి డ్యామేజ్ హెయిర్ తో బాధపడుతుంటే కనుక వాటిగురించి ప్రత్యేకమైన శ్రద్ద తీసుకోవాలి. అందుకోసం వీకెండ్ దాకా ఆగాల్సిన పనిలేదు. అందుకోసం చాలా సులభమైనటువంటి (అతి తక్కువ సమయంలో) పద్దతులతో వీక్ డేస్ లో హెయిర్ కేర్ తీసుకోవచ్చు. ఒక వేళ మీ జుట్టు పొడిబారి, తెగిన జట్టు, షైనింగ్ లేకుండా నిర్జీవంగా మారిన కురులకు హోం మేడ్ హెయిర్ మాస్క్ లతోటే సరిచేసుకోవచ్చు. మంచి ఫలితాలను మీరు చూడొచ్చు. అందుకోసం ఏ ఇతర కత్రిమ ప్రొడక్ట్స్ కోసం పరుగులు తీయకుండా ఇంట్లోనే ఖరీదు తక్కువ, విలువలను ఎక్కువగా చూసించే ఆరోగ్య కరమైనటు వంటి పదార్థానలు వినియోగించవచ్చు. అందులోనూ వీటిలో ఎటువంటి రసాయనాలు కలిగి ఉండవు. కాబట్టి వీక్ డేస్ లో ఉపయోగించే ఆరుదైన పదార్థాలేంటో చూద్దాం...

యోగ్రట్ (పెరుగు)హెయిర్ మాస్క్
బాగా పొడిబారిన, చిక్కుబడిన కురులకు యోగ్రట్ హెయిర్ మాస్క్ బాగా ఉపయోగపడుతుంది.

ఆలివ్ ఆయిల్ హెయిర్ మాస్క్ లేదా హెయిర్ ప్యాక్
రెండు గుడ్లసొనను తీసుకొని అందులో ఐదు టేబుల్స్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేసి, తలకు, కురులపొడవును పూర్తిగా అప్లై చేయాలి.

ఎసెన్సియల్ ఆయిల్
వెంట్రుకలు రాలిపోవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఎటుంటి హెయిర్ ప్రాబ్లెమ్స్ కు అయినా వెజిటేబుల్ ఆయిల్స్...

మెంతులతో మాస్క్
కొద్దిగా నీళ్ళలో మెంతులను రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు ఉదయం వాటిని మెత్తగా పేస్ట్ చేసుకొని, ఆ పేస్ట్ ను తలకు అప్లై చేయాలి.

కేశాలకు మెరుపునిచ్చే తేనె
నాలుగు కప్పుల గోరువెచ్చని నీటిలో, ఒక టీస్సూన్ తేనెను మిక్స్ చేసి బాగా మిక్స్ చేయాలి. షాంపూ చేసిన తర్వాత తలరా...
యోగ్రట్ (పెరుగు)హెయిర్ మాస్క్: బాగా పొడిబారిన, చిక్కుబడిన కురులకు యోగ్రట్ హెయిర్ మాస్క్ బాగా ఉపయోగపడుతుంది. యోగ్రట్ హెయిర్ మాస్క్ తో కురులకు మంచి మాయిశ్చరైజర్ గానూ, కురులను సిల్కీగాను ఉంచుతుంది. అందుకు ఒక గుడ్డులోని తెల్లసొన తీసుకొని, దానిక అరకప్పు పెరుగు, మోయనైజ్ ను చేర్చి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని తడి వెంట్రుకలకు బాగా పట్టించి ప్లాస్టిక్ కవర్ తో కప్పేయాలి. అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో కురులను శుభ్రం చేసుకోవాలి.
ఆలివ్ ఆయిల్ హెయిర్ మాస్క్ లేదా హెయిర్ ప్యాక్: రెండు గుడ్లసొనను తీసుకొని అందులో ఐదు టేబుల్స్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేసి, తలకు, కురులపొడవును పూర్తిగా అప్లై చేయాలి. తర్వాత తలకు షవర్ క్యాప్ లేదా ప్లాస్టిక్ కవర్ తో పూర్తిగా కవర్ చేసి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో మంచి షాంపూను ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.
ఎసెన్సియల్ ఆయిల్: వెంట్రుకలు రాలిపోవడం: వెంట్రుకలు రాలిపోవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఎటుంటి హెయిర్ ప్రాబ్లెమ్స్ కు అయినా వెజిటేబుల్ ఆయిల్స్ లేదా ఎసెన్సియల్ ఆయిల్స్ చాలా అద్భుతంగా పనిచేసి, కురులను ఆరోగ్యంగా ఉంచుతాయి. రెండు టేబుల్ స్పూన్ల వెజిటేబుల్ ఆయిల్ ను తలస్నానం చేసే ముందు అప్లై చేసి తర్వాత తలస్నానం చేయడం, కురుకెంతో ఆరోగ్యకరం.
మెంతులతో మాస్క్: కొద్దిగా నీళ్ళలో మెంతులను రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు ఉదయం వాటిని మెత్తగా పేస్ట్ చేసుకొని, ఆ పేస్ట్ ను తలకు అప్లై చేయాలి. అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో గోరువెచ్చని నీటితో తలను శుభ్రం చేసుకోవాలి.
కేశాలకు మెరుపునిచ్చే తేనె: నాలుగు కప్పుల గోరువెచ్చని నీటిలో, ఒక టీస్సూన్ తేనెను మిక్స్ చేసి బాగా మిక్స్ చేయాలి. షాంపూ చేసిన తర్వాత తలరా ఈ నీటిని పోసుకోవాలి. మామూలుగానే వదిలేసి, సాధారణంగానే ఆరబెట్టుకోవాలి. దాంతో మీ హెయిర్ ప్రకాశవంతంగా (సిల్కీ)గా మెరుస్తుంటాయి.



Click it and Unblock the Notifications