Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
మీకు ఇష్టమైన హెయిర్ కలర్ ఎంపిక ఎలా...?

చర్మం రంగుకి సరిపోయే హెయిర్ కలర్స్ ని ఎంచుకోవాలి. కొద్దిగా రంగు తక్కువగా ఉండే వారికి ఎరుపు రంగు కలిగిన హెయిర్ కలర్ నప్పుతుంది. ఈ కాలం మరీ ఎర్రగా వుండే హెయిర్ కలర్ కాకుండా కొద్దిగా ఆరంజ్ రంగులో వుండే వాటిని ఎంపిక చేసుకుంటే బాగుంటుంది.
ధరించే దుస్తులకు అనుగుణంగా హెయిర్ కలర్ ను ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. ఎక్కువగా కాటన్ దుస్తులు, వైట్ కలర్ దుస్తులను ధరించేటప్పుడు బ్లాక్ హెయిర్ కలర్ అందంగా కనపడుతుంటుంది. బ్లాక్ హెయిర్ కలర్ వేసుకున్నప్పుడు జుట్టుకు నేరుగా సూర్య రశ్మి తగలకుండా జాగ్రత్త పడాలి. తలకి టోపి లేదా స్కార్ఫ్ లాంటివి చుట్టుకోవాలి.
హెయిర్ కలర్ చేసుకునే ముందు తప్పనిసరిగా తల స్నానం చేయాలి. కలర్ వేసుకున్న గంట తర్వాత మరీ వేడి నీటిని లేదా మరీ చల్లనీటిని తలస్నానానికి ఉపయోగించకూడదు. గోరు వెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి. ఇంట్లోనే కలర్ వేసుకునేటట్టయితే తల వెనుక భాగం నుంచి వేసుకోవడం మొదలు పెట్టాలి.
హెయిర్ కలర్స్ కొనుగోలు చేసేటప్పుడు మంచి బ్రాండ్ వున్న వాటిని ఎంచుకోవడంతో పాటు బ్యూటీషియన్ సలహా తీసుకోవడం మరిచిపోకూడదు. మీ శరీరతత్వానికి, చర్మం రంగుకు ఏ రంగు సరిపోతుందో వారు చెప్పగలరు. తరచూ బ్రాండ్ లను మార్చడం అంత మంచి పద్దతి కాదు. ఒక వేళ మార్చవలసి వస్తే మాత్రం బ్యూటీషియన్ల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. సొంత నిర్ణయాలు మంచిది కాదు.
మీరు ఇష్టపడే హెయిర్ కలర్ షేడ్, ఊహించుకున్న విధంగా ఉందా? లేదా అనే విషయం పరిశీలించాలి. మేకప్ హెయిర్ కలర్ పూర్తిగా సరిపోయే విధంగా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
కొత్తదనం కోసం జుట్టుకు బ్రౌనిష్ షేడ్ వున్న రంగును అప్లై చేశారనుకుందాం. అప్పుడు మీ మేకప్ కూడా బ్రౌన్ షేడ్‌ను సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. ఏ హెయిర్ కలర్ షేడ్ అప్లై చేయించుకోవడానికైనా ముందుగా ఒక ఫోటో తీయించు కోవాలి. ఆ తరువాత మరో ఫోటో తీయించుకోవాలి. అప్పుడు మీకు తేడా కచ్చితంగా తెలుస్తుంది.
మీరు అద్దంలో మిమ్మల్ని పరిశీలించుకునే సమయం లో మీ హెయిర్ కలర్ పైన దృష్టిని కేంద్రీకరించాలి. మీరు ఇష్టపడే హెయిర్ కలర్ షేడ్, మీరు ఊహించుకున్న విధంగా వుందా? లేదా అనే విషయం పరిశీలించాలి. మేకప్ హెయిర్ కలర్ పూర్తిగా మాచ్ అయ్యే విధంగా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.



Click it and Unblock the Notifications