For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాలుష్య భారీ నుండి కేశాల సంరక్షణ....

|

To Protect Hair from Pollution
కాలుష్యం వల్ల కేవలం చర్మంపైనే కాక కేశాలపపైన కూడా దుష్ఫ్రభావం పడుతోంది. వెంట్రుకలు రాలిపోవడం ఉన్నది కాలుష్యం వల్ల జరిగే సాధారణ ప్రక్రియ. అందుకే వెంట్రుకలు రాలిపోవడం అన్నది నగరీకరణ, పారీశ్రామికీకరణ ఎక్కువగా ఉన్న చోట్ల చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాలుష్యం వల్ల వెంట్రుకలు బలహీనవమవుతుంది. ఇక దీనికి తోడు ఉష్ణోగ్రత కూడా పెరిగితే శరీరానికి అవసరమైన పోషకాలు అందం తగ్గి ఆ ప్రభావం వెంట్రుకల మీద కూడా పడుతుంది. దుమ్మూధూళి వల్ల జుట్టు తేలిగ్గా చింపిరిగా మారడంతో పాటు మాడుపైన కొన్ని దుష్పరిణామాలు రావచ్చు. ఫలితంగా చుండ్రు వంటివి పెరిగేందుకు అవకాశం ఎక్కువ. వీటన్నింటి సంయుక్త ప్రభావాల వల్ల వెంట్రుకలు తేలిగ్గా రాలడం వంటివి జరుగుతాయి. అలా వెంట్రుకలు రాలకుండా ఉండటం కోసం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరి...

1. తప్పకుండా వెంట్రుకలను షాంపూతో శుభ్రం చేసుకోవాలి. అయితే మరీ ఎక్కువగా వెంట్రుకలను కడగటం కూడా మంచిదికాదని గుర్తుంచుకోవాలి. దీనివల్ల వెంట్రుకలు పొడిబారవచ్చు.
2. అలర్జెన్స్, కాలుష్యాలు నేరుగా వెంట్రుకలకు తాకకుండా స్కార్ఫ్ కట్టుకోవడం, హ్యాట్ పెట్టుకోవడం చేయాలి.
3. ఒకవేళ చుండ్రు వంటి సమస్య ఉంటే కీటోకెనజాల్ లేదా సైక్లోపిరోగ్సాలమైన్ ఉండే షాంపూలతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి.
4. వెంట్రుక చివర్లు చిట్లిపోకుండా ఉండేలా ప్రతి ఆరువారాలకు ఓమారు జుట్టును ట్రిమ్ చేసుకోవాలి.
5. రంగు వేసుకునేవారైతే అది పడుతోందా లేదా అన్నది పరిశీలించుకోవాలి.
6. స్వచ్ఛమైన కొబ్బరినూనె రాయడం
7. బైకు మీద బయటకు వెళ్లినపుడు తలకు చేతిరుమాలు చుట్టుకోవాలి.
8. చేపలు (ప్రొటీన్లు అధికంగా వుండే ఆహారం) తీసుకోవాలి. పప్పులు- ధాన్యాలు, పాలకూర, క్యారెట్, పాలు, జీడిపప్పు వంటి వాటిని ఎక్కుగా తీసుకొంటుండాలి.

English summary

How to Protect Your Hair From Pollution... | కాలుష్య భారీ నుండి కేశాల సంరక్షణ....

Pollution can do a lot of damage to your hair. It can take away its shine and make it look dull and limp. Pollution can also make your hair feel dry and undernourished. Sadly, just regular shampooing and conditioning is not enough to fight the ill-effects of pollution.
Story first published:Friday, January 20, 2012, 12:56 [IST]
Desktop Bottom Promotion