Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ఎంత స్నానం చేసి జుట్టు జిడ్డుగా ఉంటే...!

చాలా మందిలో ఈ సమస్య ఉంటుంది. ముఖ్యంగా జుట్టు ఒత్తుగా ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎక్కువ జుట్టు ఉండటం వల్ల తలలోని నూనె గ్రంథులు ఎక్కువగా ఉండా అవి నూనెను ఉత్పత్తి చేస్తాయి. అది జిడ్డుగా మారి కేశాలపై ప్రభావాన్ని చూపిస్తాయి. దాంతో తలలో చుండ్రు, దురద, జుట్టు రాలడం వంటి సమస్యలకు దారితీస్తుంది.
ఆస్ట్రిజెంట్: ఇడి జిడ్డుగల కేశాలకు బాగా పనిచేస్తుంది. వేపాకులో దివ్యమైన ఔషుధ గుణాలు కలిగి ఉంటాయని మన పూర్వీకులు అంటుండేవారు'.. అవును అది అక్షరాల నిజమే.. వేపాకు చర్మ సౌందర్యాన్నే కాదు కేశ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. యాంటీ సెప్టిక్ లక్షణాలు మెండుగా ఉండే వేపాకు మంచి ఆస్ట్రిజెంట్ గా పనిచేస్తుంది. జిడ్డు స్వభావంతో ఉండే శరీరం, లేదా జుట్టు కలిగిని వారికి వేపాకు తాజాదనాన్ని ప్రసాదిస్తుంది.
జుట్టు సంబంధిత సమస్యలను సైతం వేపాకు నయం చేస్తుంది. వేపాకులను వేసి కాచిన నీటితో జుట్టును శుభ్రం చేస్తూ ఉంటే.. వెంట్రుకలు రాలటం తగ్గటమేగాకుండా, జట్టు బాగా పెరుగుతుంది. అంతేగాకుండా వెంట్రుకులు నిగనిగలాడుతూ ఉంటాయి. పేలు, చండ్రులాంటి సమస్యలకు సైతం వేపాకు రసం చక్కగా పనిచేస్తుంది. వేపాకు రసాన్ని వారానికి ఒకసారి రాసుకుంటూ ఉంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
నీళ్ళతో నిమ్మకాయ: తలమీద జిడ్డు తత్వాన్ని తొలగించడానికి ఇది ఒక మంచి ఉపాయం. తలకు ఉపయోగించేటటువంటి నీటిలో రెండు నిమ్మాకాయలను నానబెట్టి ఆ నీటితో తలస్నానం చేయవచ్చు. ఇది చాలా సులభమైన మార్గం. నిమ్మకాయ చెక్కతో తల రుద్దుకొని వేడి నీళ్ళతో స్నానం చేస్తే చుండ్రు పోతుంది.
కేశాలకు వెనిగర్: వెనిగర్ చాలా శక్తివంతమైన పదార్థం ఇది. ఇది తలలోని జిడ్డును వదలగొట్టడం మాత్రమే కాదు మంచి క్లీనింగ్ ఏజెంట్ గా పినిచేస్తుంది. అయితే వెనిగర్ నిమ్మకాయ ఇచ్చినంత సువాసనను ఇవ్వలేందు. అయితే జిడ్డును తొలగించడంలో చాలా బాగా పనిచేస్తుంది. మంచి ఫలితాల కోసం రెండు చెంచాల వెనిగర్ ను ఒక మగ్గు నీటిలో తీసుకోవాలి. తలస్నానం తర్వాత తలలో ఉన్న షాంపూను వదలగొట్టడమే కాకుండా జిడ్డును తొలగిస్తుంది. తల స్నానం తరువాత కొంచెం వెనిగర్ రాసుకుని తరువాత కడిగేయాలి. ఇలా చేస్తే జుట్టు మెత్తగా వుంటుంది. చలికాలంలో వెంట్రుకలు రాలడం, తెగిపోవడం, చుండ్రు ఎక్కువగా ఉంటుంది. ముందు కొబ్బరి నూనెతో పాటు నిమ్మకాయ రసాన్ని కలిపి మీ జుట్టుకు మర్దనా చెయ్యండి. తరువాత టవల్‌ని వేడి నీళ్ళలో ముంచి తలకు చుట్టేయండి. ఆవిరి పట్టించడం ఎంతో మంచిది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు.
ముందు షాంపూతో వెంట్రుకలను కడిగేయండి. 2గంటల తరువాత 2 టీస్పూన్ల ఉసిరి, శీకాయ్, ఫెనుక్షిగీక్, లీకరిస్ (యష్ఠి మధుకం), 2గుడ్లును కలిపి ముద్దలా చేసి దీన్ని వెంట్రుకల మొదళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట పాటు ఆరనివ్వాలి. తరువాత షాంపూతో కడిగేయండి. ఇది జుట్టుకి మంచి కండీషనర్‌లా పని చేస్తుంది. నిర్జ్జీవంగా లేదా ఆయిలీగా ఉండే జట్టుకి సగం గ్లాస్ డికాషన్, సగం గ్లాస్ బీర్, నిమ్మకాయరసం, ఆరెంజ్ జ్యూస్‌ను కలిపి షాంపూ చేసిన తరువాత జుట్టుకు పట్టించి అరనివ్వాలి. దీంతో జుట్టు అందంగా, సిల్కీగా అవుతుంది.
షాంపూ తయారు చేసుకోవడం: మనమే షాంపూను తయారు చేసుకోవడం చాలా సులభం. జిడ్డును తొలగించి, కేశాలను ఆరోగ్యంగా ఉంచడానికి మీరు తరచూ ఉపయోగించే షాంపుకి కొన్ని ఇంట్లోని వస్తువులను చేర్చడం వల్ల జుట్టుకున్న జిడ్డు వదిలిపోతుంది. ప్రతి రోజూ ఉపయోగించే మీ షాంపూకు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక చెంచా కలబంద గుజ్జును మిక్స్ చేయాలి. దీన్ని ఉపయోగించేటప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా గిలకొట్టి తర్వాత ఉపయోగించాలి. తర్వాత తలకు పట్టించి శుభ్రం చేసుకోవాలి. ఈ షాంపూ చాలా రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవచ్చు.
బేబే పౌడర్: తలలోని జిడ్డును వదిలించడానికి, శుభ్రపరచడానికి బేబి పౌడర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. బేబి పౌడర్ ను తల మీద లేదా వెంట్రుకలపై చిలకరించి, తర్వాత తలను దువ్వుకోవడం వల్ల జుట్టుకు ఉన్న జిడ్డు వదలిపోతుంది.
ఇలా సహజ పద్దతులను ఉపయోగించడం వల్ల అనవసరమైన రసాయనిక షాంపూలు, లేదా కండిషనర్లు కొనవలసిన అవసరముండదు. కాబట్టి కొన్ని సందర్బాల్లో నేచ్యురల్ గా దొరికే వాటి మీద ఆధార పడటమే మంచిది.



Click it and Unblock the Notifications