Latest Updates
-
డయాబెటిస్ బాధితులు తేనె తీసుకోవచ్చా.. తీపి తినాలనిపిస్తే ఏం చేయాలి.? -
దీని ముందు బిర్యానీ కూడా దిగదుడుపే.. కుక్కర్లో ఈజీగా ఘుమఘుమలాడే గోంగూర పులావ్.! -
కేరళ స్టైల్ రొయ్యల వేపుడు.. మసాలా ఇలా దట్టించారంటే కారం నషాళానికి అంటాల్సిందే.! -
గజకేసరి రాజయోగంతో కనక వర్షం.. ఈ మూడు రాశుల వారికి తిరుగే లేదు.! -
ఉదయం నిద్ర లేవగానే షుగర్ ఉన్నవారిని వేధించే అతిపెద్ద ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం తినాలి?. -
ఒకే రాశిలో సూర్య కేతువులు.. వీరికి ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.. లేదంటే.! -
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి!
మాన్ సూన్ ‘హెయిర్ ’కేర్ టిప్స్....!

మానసిక ఒత్తిడి, వృత్తి, వ్యక్తిగత సమస్యలు, విద్యార్థులకైతే పరీక్షల భయం. వేడి ఎక్కువగా ఉన్న నీళ్లతో తలస్నానం చేయడం, హెయిర్ డ్రయ్యర్ల వాడకం. స్ట్రెయిటెనింగ్, రింగులు చేయించుకోవడం. వర్షాకాలంలో కురులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
తలస్నానం చేసేముందు మీ జుట్టుకు కొబ్బరినూనె కనీసం అరగంట మర్దన చేయండి. తరచు తలస్నానం చేయడం వల్ల జుట్టు శుభ్రంగా ఉంటుంది. తరువాత ఆయిల్ రాసి మర్దన చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం మంచిది. గోరువెచ్చని నూనెతో మర్దన చేయడం వల్ల సత్ఫలితాలుంటాయి. ఇందువల్ల జుట్టు రాలడం తగ్గుతుంది కూడా. ఇలా తరచు కొబ్బరినూనెతో మాడుకు మర్జన చేయడం వల్ల నూనె మెదడు లోపలి కణజాలాలలోకి చొచ్చుకుపోయి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుందని సౌందరన్య నిపుణుల సూచన.
వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా తడుస్తుంది.త్వరగా ఆరుతుంది కదా అని డ్రయ్యర్ తో ఆరబెట్టకూడదు.అలా చేయడం వలనా వెంట్రుకలు చిట్లిపోయేఅవకాశం వుంటుంది.మెత్తని బట్టతో తలను తుడిచి వీలయితే నిప్పులతో ఆరబెట్టుకోవాలి. వర్షాకాలంలో పగటివేల ఎటువంటి నూనెలు తలకు రాయకుండా ఉండడం మంచిది నూనె వలన ముఖ:మంతా జిడ్డుగా అయ్యే ప్రమాదం ఉంటుంది.
ఎండా, దుమ్ము,ధూలీ వలన జుట్టు రాలిపోతుంటే & జీవం లేనట్టు కనిపిస్తే ఒక కప్పు పాలలో ఒక కోడి గుడ్డు సొన కలిపి తలకు పట్టించి 30 నిమిషముల తరువాత శుభ్రపరుచుకోవాలి.చలికాలంలో జుట్టు పొడిగా ఉంటే ఆలివ్ ఆయిల్ గోరువెచ్చగా చేసి దానితో మర్దనా చేసుకోవాలి.జుట్టు మరీ జిడ్డుగా ఉంటే నువ్వుల నూనెతో మర్ధనా చేసుకుని గంట తరువాత శుభ్రపరుచుకోవాలి.
కురులకు కండీషనర్ : జుట్టు ఆరొగ్యంగా పొడవుగా పెరగాలంటే వారానికి ఒకసారి ఆముదం రాయాలి. వారానికి ఒకసారి టీ డికాషనుతో తల స్నానం చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
నిమ్మకాయ గింజలు,మిరియాల మిశ్రమం కలిపి జుట్టు తక్కువగా ఉన్న ప్రాంతంలో పెట్టాలి.అప్పుడు జుట్టు పెరగడానికి అవకాశం ఉంటుంది.
ముందుగా జుట్టు తత్వాన్నిబట్టి షాంపూలను ఎంచుకోవాలి. వారానికి రెండు సార్లు షాంపూ చేయాలి. నూనెతత్వం ఉన్న శిరోజాలైతే రెండు రోజులకోసారి తప్పనిసరి. కండిషనర్ తప్పనిసరి. పొడి తత్వం ఉన్నవారు తలస్నానానికి ముందు నూనె పెట్టుకోవాలి. సమతులాహారంతో జుట్టుకు తగిన పోషణ అందుతుంది. అంటే ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమినులు, మినరల్స్ ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, తాజాపండ్లు, గుడ్లు, పప్పులు, డైరీ ఉత్పత్తుల్లో అవి సమృద్ధిగా దొరుకుతాయి.



Click it and Unblock the Notifications