For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు ఒత్తుగా పెరగాలంటే మస్టర్డ్ ఆయిల్ రాయాల్సిందే...!

|

Mustard oil is a great addition for healthy hair growth..
సాధారణంగా స్త్రీ, పురుషుల సౌందర్య పోషణలో మగువల జుట్టుకి ఉన్న ప్రాధాన్యం అంతా, ఇంతా కాదు. ఎవరయినా ఎంత ఆరోగ్యంగా ఉన్నారో, వారిని జుట్టును చూసి చెప్పవచ్చని అంటుంటారు. ఎందుకంటే, నిగనిగలాడే ఒత్తైన జుట్టు ఆరోగ్యానికి సంకేతం కాబట్టి. సాధారణంగా వాతావరణ కాలుష్యం వల్ల, సరైన పోషణ లేక జుట్టు పొడిబారిపోయి రాలుతుంది. అలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే సరిపోతుంది. ముఖ్యంగా చర్మ సౌందర్యంలో, కేశ సౌందర్యంలో ఆవనూనెను విరివిగా ఉపయోగిస్తారు. పోవు దినుసుగా ప్రతి ఇంట్లో ఉండే ఆవాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

వీటిలో మెగ్నీషియం , కాల్సియం, మాగనీస్, జింక్, ఒమెగా 3 ఫ్యాటియాసిడ్స్, ప్రోటీన్లు, పీచుపదార్దము ఉంటాయి. ఘాటైన వాసనను కలిగి ఉండే ఆవాలు ఆయుర్వేదంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. అరబకెట్‌ వేడినీళ్లలో చెంచా ఆవాల పొడి వేసి కాళ్లను కొద్దిసేపు ఉంచితే పాదాల నొప్పులు త్వరగా తగ్గుతాయి.

తెల్ల ఆవనూనె చర్మ రంగును మెరుగు పరుస్తుంది. దీన్ని శరీరానికి రాసుకొని, నలుగుపెట్టి స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గి రంగు తేలుతుంది. అలానే కొబ్బరినూనెలో ఆవనూనెను కలిపి శిరోజాలకు రాస్తుంటే ఫలితం ఉంటుంది. ఆవనూనెను శరీరానికి బాగా మర్ధన చేయడం ద్వారా శరీరానికి రక్షణ కల్పిస్తుంది.

ఆవనూనెను తరచూ తలకు రాయడం వల్ల హెయిర్ బాగా పెరగుతాయి. ఆరోగ్యంగానూ ఉంటాయి. జుట్టు తెగిపోకుండా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఆవాలపోడితో జుట్టు కడుక్కూంటే .. జుట్టు రాలడం తగ్గుతుంది. తలలో పేలు తగ్గడానికి ఆవాల నూనే రాసుకోవాలి. మాడు మీద కురుపులు, దురదలను ఆవ నూనె భాగా తగ్గిస్తుంది.

ఒక టీ స్పూన్ తేనె, మరో టీస్పూన్ ఆలీవ్ ఆయిల్, ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపిన మిశ్రమంలో కోడిగుడ్డులోని తెల్లసొనని వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి, కుదుళ్లకు బాగా పట్టించాలి. అలాగే 20 నిమిషాలు ఉంచిన తరువాత తలస్నానం చేయాలి.

ఒక కప్పు కొబ్బరి నూనె, ఒక కప్పు ఆవాల నూనె కలపాలి. ఈ మిశ్రమంలో ఒక కప్పు కరివేపాకుల్ని వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో పోసి చిన్న మంటపై వేడి చేయాలి. కరివేపాకు కాస్త వేగగానే నూనెలోంచి తీసి, మూడు కర్పూరం బిళ్లలు వేయాలి. చల్లారాక ఈ మిశ్రమాన్ని జుట్టుకు, కుదుళ్లకు బాగా పట్టించి, ఓ రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు తలస్నానం చేస్తే సరి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

ఆవానూనెను తలకు రాయాలంటే ముందు తలపొడిగా ఉంచుకోవాలి. తర్వాత ఆవనూనెను తలకు బాగా మర్థన చేయాలి. చేసిన తర్వాత తలకు షవర్ క్యాప్ ను పెట్టుకొని మూడు నాలుగు గంటల పాటు అలాగే ఉంచేసుకోవాలి. (ఇలా ఉండాలంటే మీరు తప్పకుండా ఇంట్లో సమయం ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా ట్రై చేయాలి). తర్వాత మీ పద్దతిలోనే షాంపూతో తలస్నానం చేసి కండీషనర్ ను అప్లై చేసుకోవాలి.

English summary

Mustard oil is a great addition for healthy hair growth...| మస్టర్డ్ ఆయిల్ తో జుట్టు ఒత్తుగా.. ఆరోగ్యంగా...!

Mustard oil is measured to be oil that has low saturated fat as contrast to other cooking oils. The mustard oil is complete from crushed or pressed mustard seeds. It is very accepted all over the world both for cooking reason and for healing purpose. It is aromatic in natural world it is highly concentrated, deeply tasty oil that can be used in a variety of special dishes. As mustard oil contains vitamins like E and C and calcium is a great addition for healthy hair growth. Mustard oil acts as the hair vitalizer and promotes hair growth and makes the hair extremely strong, therefore preventing breakage.
Story first published:Wednesday, July 25, 2012, 16:43 [IST]
Desktop Bottom Promotion