Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
తెల్లజుట్టు నివారించి జుట్టు పట్టుకుచ్చులా మెరవాలంటే...

1. తెల్ల వెంట్రుకలు నల్లగా మారాలంటే కొబ్బరి నూనె లో వెల్లుల్లి పాయలను ఉడికించి, తర్వాత వడకట్టి, ప్రతి రోజు తల కు రాస్తే తెల్ల వెంట్రుకలు నలుపు గా మారుతాయి.
2. తెల్ల వెంట్రుకలు నల్లబడటానికీ గోరింట చాలా ఉపయోగపడుతుంది. జుట్టుకుదుళ్ళకు, కంటికి, మెదడుకు కూడా ఎంతో మేలు చేస్తుంది.
3. గోరింట ఆకును రుబ్బి బిళ్లలుగా ఎండనిచ్చి కొబ్బరినూనెలో వేసి రోజూ తలకు మర్దనచేస్తే దీర్ఘకాల తలనొప్పి ఇట్టే తగ్గుతుంది. జుట్టు రాలటాన్ని కూడా అరికట్టవచ్చు.
4. పాల కూర ఆకులను గ్రైండ్ చేసి దానితో తల రుద్దుకుంటే నిర్జీవంగా ఉన్న జుట్టు ఆరోగ్యంగా మెరుస్తుంది.
5. కోడి గుడ్డు తెల్లసొన, రెండు స్పూన్ల ఆముదం, ఒక స్పూన్ గ్లిజరిన్ కలిపి తలకు పట్టించి గంట తరువాత తలస్నానం చేస్తే తల నిగనిగలాడుతుంది.
6. జుట్టు సున్నితంగా మారాలంటే 5 స్పూన్ల తేనని తలకు పట్టించి అరగంట తర్వాత శుభ్రపరచుకోవాలి.
7. ఇంట్లో చేసే దోసె పిండిని జుట్టుకు పట్టించి పదిహేను నిమిషాల తరువాత తలస్నానం చేస్తే నిగనిగలాడుతుంది.
8. వారానికి ఒకసారి కొబ్బరినీటితో తలరుద్దుకుని తరువాత చల్లని లేదా గోరువెచ్చని నీటితో తలంటుకుంటే కురులు పట్టులా మారుతాయి.
9. తాజా కొత్తిమీర రసం జుట్టుకు పట్టించడం వలన నిగారింపు వస్తుంది.
10. వెచ్చటి కొబ్బరినూనెతో తలకు మర్దనా చేసి తరువాత తలకు వేడి నీటిలో ముంచిన టవల్ చుట్టి గంట సేపు ఉంచి తరువాత తలస్నానం చేస్తే జుట్టు మెత్తగా పట్టుకుచ్చులా మారుతుంది.



Click it and Unblock the Notifications