Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
చుండ్రు నివారణకు నేచర్ క్యూర్....

హార్మోన్లు సమతుల్యంగా ఉండటానికి పౌష్టికాహారం తీసుకోవాలి. ఎక్కువగా మొలకెత్తిన విత్తనాలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయాలు తీసుకోవాలి. తలకు వాడే షాంపు, నూనె, సబ్బులను ధర ఎక్కువైనా మన్నికైనవి ఎన్నుకోవాలి. షాంపు లేదా ఆయిల్ ను వెంట్రుకల కుదళ్లలో, వేళ్లతో నెమ్మదిగా ఎక్కువసేపు మర్దనం చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందొచ్చు. బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీ ధరించడం మంచిది. కొవ్వు, నూనె సంబంధిత పదార్థాలు ఎక్కువగా తీసుకోరాదు. మానసిక ఒత్తిడి కూడా చుండ్రుపై ప్రభావం చూపుతుంది. చుండ్రు నివారించటానికి కొన్ని సులభమైర పద్దతులు.
నిమ్మకాయ: చుండ్రు అనగానే చాలామంది నిమ్మచెక్కతో బరాబరా జట్టుపై రాసి రుద్దేసి కడిగేస్తుంటారు. అలా కాకుండా తలస్నానం చేసిన తరువాత ఒక టీస్పూన్ తాజా నిమ్మరసాన్ని ఓ మగ్గు మంచినీటిలో కలిపి జుట్టు తడిసేలా కడిగితే సరిపోతుంది. ఇలా నెలకు ఒకసారి చేస్తే చుండ్రు మాయమవుతుంది.
వేపాకు: చుండ్రు నివారణకు ఒక మంచి దివ్వ ఔషదం. తలస్నానం చేసే రోజు కొన్ని వేపాకులు తీసుకొని ఒక గిన్నెడు నీళ్ళలో ఉడకబెట్టి బాగా మరిగిన నీళ్ళ రంగు మారుతుంది. మామూలుగా ప్రతి నిత్యం ఎలా తలస్నానం చేస్తారో అలాగే తలస్నానం చేసి, చివరగా మరిగిన వేపాకు నీళ్ళు కొద్దిగ చల్లరాక తల మీద పోసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే చాలు దీనివల్ల చుండ్రు తగ్గటమే కాకుండా జుట్టు పెరగుతుంది కూడా
మెంతులు: చుండ్రు నివారణకు మెంతులు కూడా మంచి ఔషధమే. మెంతులను రాత్రిపూట నానబెట్టి, మరుసటిరోజు మెత్తటి పేస్టులాగా చేయాలి. ఈ మిశ్రమాన్ని తలంతా, మాడుకు కూడా బాగా పట్టించి, అరగంటసేపు అలాగే ఉంచి.. ఆ తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా పదిహేను రోజులకు ఒకసారి చేసుకుంటే చుండ్రు తగ్గుతుంది, జట్టు పొడిబారకుండా ఉంటుంది.
పెసరపిండి: చుండ్రును తగ్గించటంలో మరో మహత్తరమైన ఔషధంగా పెసరపిండి ఉపయోగపడుతుంది. రెండు టీస్పూన్ల పెసరపిండిని అరకప్పు పెరుగులో కలిపి తలకు పట్టించాలి. అరగంట తరువాత మంచినీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుస్రాలు చేసినట్లయితే చుండ్రు బాగా తగ్గిపోతుంది. జట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
బీట్ రూట్: బీట్ రూట్ ను చిన్న చిన్న ముక్కలుగా చేసి నీళ్ళలో వేసి వేడిచేసి రాత్రి పడుకొనే ముందు తల మాడుకు బాగా మర్దన చేసి మరుసటి రోజు ఉదయాన్ని తలస్నానం చేస్తే చుండ్రు తగ్గి వెంట్రులకు పెరుగుతాయి.



Click it and Unblock the Notifications