Latest Updates
-
అష్టమి తిథిఎందుకు అంత శక్తివంతమైనది? -
మునగాకు నువ్వుల పచ్చడితో ఎముకలు ఉక్కుగా మారాల్సిందే.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
పట్టులా మెరిసే జుట్టు కోసం ఇంట్లోనే హెయిర్ కండిషనర్.. చిటికెలో ఇలా చేసేయండి.? -
అదే పనిగా స్మార్ట్‌ఫోన్ చూస్తున్నారా.. డ్రై ఐ సిండ్రోమ్కి దారి తీసే లక్షణాలివే.! -
ఈ నెగిటివ్ ఆలోచనలతో శరీరంలో ఎన్ని మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసా.? -
పెళ్లయిన తర్వాత ఎన్నేళ్లకు విడాకుల ముప్పు ఎక్కువ? ఈ నిజాలు తెలుసుకోండి! -
జూన్ 19: ఈ రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం.. ధనలాభం, కెరీర్లో ఊహించని మార్పులు! -
వంటగదిలో వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఇక మీ హెల్త్ రిస్క్‌లో పడినట్లే.! -
గజకేసరి రాజయోగం: నేడు ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. అదృష్టం మీదే! -
దంతాల నుంచి తరచూ రక్తస్రావం.. ఈ ఐదు తప్పులు చేస్తున్నారేమో.!
కురులు బాగా పెరగాలంటే ఆలివ్ ఆయిల్....
Hair Care
oi-Saraswathi
By Sindhu

2. ఈ ఆయిల్‌లో వెల్లుల్లిపొట్టును కాల్చిన పొడిని కలిపి కానీ లేదా వెల్లుల్లి పొట్టును అలాగే ఆయిల్‌లో కలిపి కాచి కానీ తలకు రాసుకుంటే జుట్టు నల్లబడటమే కాకుండా, త్వరగా జుట్టు నెరవదు.
3. ఆలివ్‌ఆయిల్‌లో కోడిగుడ్డులోని తెల్లసొనను కలిపి, తలకురాచుకుని, తలస్నానం చేసినట్లయితే వెంట్రుకలు మెత్తగా మారుతాయి. కేశాలు పొడవుగా పెరుగుతాయి.
4. ఆలివ్ ఆయిల్‌ను వెచ్చచేసి, వెంట్రుకల కుదుళ్ళకు పట్టించి, పది పదిహేను నిమిషాల తర్వాత తలస్నానం చేసినట్లయితే, జుట్టు రాలిపోకుండా వుంటుంది.
5. నాలుగుచుక్కల అల్లంరసంలో కొద్దిగా ఆలివ్‌నూనె చేర్చి జుట్టు కుదళ్లకు పట్టించాలి. గంటయ్యాక తలస్నానం చేయాలి. కుదుళ్లు దృఢమవుతాయి.
6. జుట్టు పొడిగా, దెబ్బతిని ఉన్నట్లయితే ఒక టీస్పూన్ ఆముదం, రెండు స్పూన్లు స్వచ్ఛమైన ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెను కలిపి మసాజ్ చేసుకుని వేడినీటి టవల్ చుట్టి ఆపై స్నానం చేయాలి.
7. ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, కొబ్బరినూనె సమానంగా తీసుకుని బాగా కలిపి తలకు పట్టించి మర్దన చేయాలి. తరువాత వేడి నీళ్ళల్లో ముంచిన టవల్ ను తలకు చుట్టుకుని ఉంచి పదిహేను నిమిషాల తరువాత తలస్నానం చేయాలి.
8. ఆలివ్ ఆయిల్, తేనె సమపాళ్లలో తీసుకొని మాడుకు, కేశాలకు పట్టించాలి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే చుండ్రు తగ్గుతుంది. పొడి జుట్టుకు ఆలివ్ ఆయిల్, తేనె కండిషనర్‌గా పనిచేస్తాయి.
9. ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ కలిపి తలకు పట్టించి ఓ పావుగంట ఆగి కడిగేస్తుంటే జుట్టు ఊడటం చాలావరకు తగ్గుతుంది. నెలకు రెండుసార్లు ఇలాచేస్తే సరిపోతుంది.
10. ఒక కోడిగుడ్డు, కీరదోస కాయ, రెండు టీస్పూన్ల ఆలివ్ ఆయిల్ తీసుకుని మిక్సీలో వేసి బాగా మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును తలకు పట్టించి పదిహేను నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. నెలకొక సారి ఇలా చేస్తూ ఉంటే జుట్టు ఆరోగ్యంగా, ధృడంగా ఉండటమే కాక ఒత్తుగా కూడా పెరుగుతుంది.
Comments
English summary
Olive Oil For Healthy and Growing Hair....! | కురులు బాగా పెరగాలంటే ఆలివ్ ఆయిల్....
Story first published: Saturday, April 7, 2012, 17:11 [IST]
Other articles published on Apr 7, 2012



Click it and Unblock the Notifications