Latest Updates
-
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే..
జుట్టు సంరక్షణలో ఉల్లిపాయ....

జుట్టురాలడం అనేది సాధారణ సమస్య. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ రాలిపోతుందనే ఫిర్యాదును ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం. జుట్టు కూడా చర్మం లాగానే కెర్సటైల్ అనే పదార్థంతో చేయబడింది. చర్మానికి ఎలా శ్రద్ధ తీసుకుంటున్నామో, శిరోజాల పట్లా అలానే ఉండాలి. శరీరం మాదిరి వాటికీ పోషక విలువలు అవసరం. సహజంగా రోజుకు యాభై నుంచి వంద వెంట్రుకలు రాలతాయి. అయితే అంత కంటే ఎక్కువ రాలినపుడే సమస్యగా భావించాలి.
కాబట్టి వంటింట్లో వస్తువులతో చర్మాన్ని ఎలా రక్షించుకుంటామో..అలాగే వంటింటి వస్తువులతో వెంట్రుకలను కూడా కాపాడుకోవచ్చు ఉదాహరణకు ఉల్లిపాయ....ఉల్లిపాయ గాటుగా అందరినీ ఎడిపిస్తుంది. ఆ వాసనకు క్రిమికీటకాదులు బలాదూర్..అలాగే జుట్టు సంరక్షణలో కూడా ఉపయోగపడుతుందంటే ఆశ్చర్యమే కదా....అదెలాగో చూద్దామా...జుట్టు సంరక్షణ కోసం ఇంటి చిట్కాలు, హెయిర్ ట్రీట్ మెంట్స్, స్పా, ఇలా రకరకాలుగా ప్రయత్నించింటారు. ఉల్లిపాయతోనూ వెంట్రుక సంరక్షించడం ఎలాగో చూద్దాం...
1. ఉల్లిపాయ జ్యూస్: ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బ్లెండ్ చేసి ఈ రసం డైరెక్ట్ గా వెంట్రుకలకు రాయకముందే కాటన్ టవల్ ను వేడినీళ్ళలో ముంచి బాగా పిండేసి తలకు బాగా చుట్టి అరగంట పాటు అలాగే వదిలేయాలి. తర్వాత బ్లెండ్ చేసి పెట్టుకొన్న ఈ వెల్లుల్లి రసాన్ని తలకు మర్దన చేసి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో తలను శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే వెంట్రుకలు గట్టిపడటంతో పాటు బాగా పెరుగుతాయి.
2. ఉల్లిపాయ మరియు తేనె: ఉల్లిపాయ రసంలో ఒక టీస్పూన్ తేనె కలిపి తలకు మాస్క్ లా వేసి సున్నితంగా మర్దన చేసి అరగంట పాటు అలాగే వదిలేసి తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెట్రుకలు సైనింగ్ రావడంతో పాటు మృదువుగా పట్టుకుచ్చులా తయారవుతాయి.
3. ఉల్లిపాయ రసం మరియు బీర్ హెయిర్ ప్యాక్: ఎన్ని రకాలు షాంపూలు, ఎన్నిరకాలు నూనెలు, ఎన్ని రకాల హెయిర్ సంరక్షణ పద్దతులు ఉపయోగించినప్పటికీ జుట్టు రాలడం అనేది అలానే ఉంటుంది. దీనికి ఉల్లిపాయ రసంతో హెయిర్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. ఉల్లిపాయ రసంకి కొద్దిగా కొబ్బరి నూనె చేర్చి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీనకి ఒక కప్పు బీర్ కలిపి తలకు ప్యాక్ వేసి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెంట్రులకు సహజసిద్దమైన మెరుపు నిస్తుంది. కొబ్బరి నూనె వెంట్రుకల మొదల్లకు న్యూట్రిషియన్ గా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications