Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
పోషకాహారంతో నల్లటి కురులు మీ సొంతం...!
జుత్తు పొడిబారకుండా సహజ సౌందర్యంతో నిగనిగలాడుతూ ఉండాలి. కొందరిలో జుట్టు అందవిహీనంగా, నిర్జీవంగా మారడానికి పోషకాహారలోపం ప్రధాన కారణం అంటున్నారు కొందరు సౌందర్య నిపుణులు. పోషకాహారం తీసుకోవడం అన్నది శరీరానికే కాకుండా శిరోజాలకు చాలా మేలు చేకూరుస్తుందని వారు చెబుతున్నారు. పోషకాహారం వలన జుట్టు ఊడిపోవడం, తెల్లబడడం, చుండ్రు వంటి సమస్యలను తేలికగానే అధిగమించవచ్చు. జుట్టు రాలిపోతున్నదని చాలా మంది ఆందోళన పడుతూ ఉంటారు. పలు రకాల నూనెలు రాసి, జుట్టు రాలడాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తారు. నిజానికి కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టడంతో పాటు ఆరోగ్యమైన జుట్టును పొందే వీలుందంటున్నారు నిపుణులు. కాబట్టి నిగనిగలాడే జుట్టు కోసం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో చూద్దాం.

జుట్టు పెరిగేందుకు సిలికా అనే మినరల్ చాలా అవసరం. క్యాబేజీ, దోసకాయ, క్యాలీఫ్లవర్, ఆకుకూరలు, ఓట్స్‌లో ఈ మినరల్ అధికంగా ఉంటుంది. కాబట్టి మన ఆహారంలో ఇవి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
సోయాపాలు లేదా సోయా చిక్కుడులో ప్రోటీన్ అత్యధికంగా ఉంటుంది. జుట్టురాలడాన్ని సోయా సమర్థంగా అరికడుతుంది. ఠీజుట్టు పెరిగేందుకు జింక్ చాలా అవసరం. అది జీడిపప్పులో పుష్కలంగా ఉంటుంది.
మీరు మాంసాహారులైతే చికెన్ తీసుకోవడం వల్ల నిగనిగలాడే జుట్టును సొంతం చేసుకోవచ్చు. చుట్టు ఎదుగుదలకు అవసరమైన ప్రొటీన్, ఐరన్ చికెన్‌లో లభిస్తుంది.
ఆల్ఫాలినోలెటిక్ యాసిడ్ జుట్టు ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది. ఈ యాసిడ్ బాదంపప్పు, జీడిపప్పు, వాల్‌నట్స్‌లో అధికంగా ఉంటుంది.
పాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. జుట్టు పెరిగేందుకు కాల్షియం చాలా అవసరం. అందుకే ఎదిగే పిల్లలకు రోజూ పాలు ఇవ్వడం వల్ల ఎముకలు పెరగడంతో పాటు నిగనిగలాడే జుట్టు వస్తుంది
కోడిగుడ్డు: గుడ్డు వేడి చేస్తుందని చాలా మంది అనుకుంటారు. అయితే అది అవాస్తవం. ఎందుకంటే గుడ్డులో సల్ఫర్ శిరోజాలను అందంగా, ఆకర్షణీయంగా వుంచడానికి దోహదపడుతుంది. అందువల్ల ప్రతి రోజూ ఆహారంలో గుడ్డు తీసుకోవడం మంచిది. కోడిగుడ్లలో బయోటిన్‌లో పాటు విటమిన్ బి12 ఉంది. ప్రొటీన్‌లు కూడా అత్యధికంగా ఉండే కోడిగుడ్లు తీసుకోవడం కేశాల ఆరోగ్యానికి ఎంతైనా అవసరం.
ఖర్జూరం: ఇనుము లోపం వలన కూడా జుట్టు రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖర్జూరంలో ఇనుము అధికంగా లభిస్తుంది. ఖర్జూరం ఎండ వేడి నుంచి శరీరాన్ని కాపాడుతుంది కూడా
టమోటో, బత్తాయి, ఉసిరి: విటమిన్ సి లోపం వలన కూడా జుట్టు చిట్లిపోవడం, రాలిపోవడం జరుగుతుంది. దాంతో అందవిహీనంగా కనపడతాయి. జామలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీనితో పాటు ఉసిరి, టమాటా, బత్తాయి తదితరాలు సాధ్యమైనంత ఎక్కువగా తీసుకోవాలి.
మాంసకృత్తులు: కుదుళ్ళను ఆరోగ్యంగా వుంచడానికి దోహదపడుతుంది. చేపలలో ఎక్కువగా లభిస్తాయి. అయితే గుడ్లు, చేపలు తినలేని వారు సోయాను ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. సోయాలోని లైసిన్ అమినో ఆమ్లం జుట్టు కుదుళ్ళను ఆరోగ్యంగా వుంచుతుంది.
నీరు : నీటితో పాటు కొబ్బరి నీళ్ళు, పండ్ల రసాలు, సలాడ్ లు అధికంగా తీసుకోవాలి.
హార్మోన్లు సమతుల్యంగా ఉండటానికి పౌష్టిక ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా బాదం, పిస్తా, జీడిపప్పు, మొలకెత్తిన విత్తనాలు, పండ్లు, ఆకుకూరలు, వెజిటబుల్స్ తీసుకోవాలి. తలకు వాడే షాంపూ, నూనె, సబ్బులను డాక్టర్ సలహా మేరకేవాడాలి. షాంపూ లేదా ఆయిల్‌ను వెంట్రుకల కుదుళ్ళలో, వ్రేళ్ళతో నెమ్మదిగా ఎక్కువసేపు మర్దన చేయటంవలన ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.



Click it and Unblock the Notifications