Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పోషకాహారంతో పట్టుకుచ్చులాంటి కురుల సిరులు....

పట్టుకుచ్చులా ఉండే కేశాలతో పొడవాటి జడతో మురిసిపోవాలని ప్రతి అమ్మాయీ కోరుకుంటుంది. అయితే ఎంతకీ పెరగని జుట్టుతో మదిలో మదనపడుతుంటారు. కొత్తకొత్త ప్రయోగాలు చేయాలని ఉన్నా శిరోజాలు ఒత్తుగా లేక వెనకుడుగు వేస్తుంటారు. వీటితోపాటు జుట్టు పొడిబారిపోవడం, చుండ్రు, జుట్టు చివర్లు చిట్లిపోవడం, రాలిపోవడం, జుట్టు తెల్లబడటం వంటి సమస్యలు మహిళలని కలవరపరిచేలా చేస్తుంది.
వీటన్నింటికీ కారణం ఒత్తిడి, అనారోగ్యాలు, జీవనశైలిలో మార్పులు. అయితే సరైన పోషకాహారం తీసుకొన్నట్టైతే వీటన్నింటికి అడ్డు కట్ట వేయవచ్చు. సరీరంలో జింక్ లోపం ఉన్నట్లైతే జుట్టు పెరుగుదల సరిగా ఉండదు. అలాగే జుట్టు పెరుగుదలకి విటమిన్ బి1, విటమిన్ సి, లైసీన్, నయాసిన్ లు ముఖ్యంగా అవసరం. బీటా కెరటిన్ ఫ్యాటీ ఆమ్లాలు సరిగా అందకపోతే చుండ్రు సమస్య తీవ్రం అవుతుంది. కాబట్టి ఆహారంలో ఇవన్నీ తప్పనిసరిగా ఉండేట్టు జాగ్రత్త పడాలి.
కోడిగుడ్డు: గుడ్డులో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. గుడ్డులోని సల్ఫర్ ఆధారిత అమైనో అమ్లాలు..కెరటిన్ ని అందించి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ ఆహారంలో గుడ్డు తీసుకోవడం వల్ల పట్టుకుచ్చులాంటి కేశాలతో పాటు ఆరోగ్యమవంతమైన గోళ్ళు కూడా సొంతమవుతాయి.
ఖర్జూరం: ఖర్జూరంలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. ఈ ఇనుము అందకే చాలామందికి జుట్టు రాలిపోతుంటుంది. రోజుకో ఖర్జూరం తింటే ఎంతో మేలు. డ్రైఫ్రూట్స్, నల్లటి ఎండు ద్రాక్ష, ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకు కూరలు ఉసిరి వంటివి ఇనుమును అందించే ఇతర పదార్థాలు.
జుట్టు చివర్లు చిట్ల ఇబ్బంది పడుతుంటే జామకాయలు తింటే మంచిది. జామలోని విటమిన్ సి చివర్లు చిట్లిపోకుండా కాపాడుతుంది. ఇనుము గ్రహిస్తుంది. జామతో పాటు ఉసిరి, టమాటా, బత్తాయి ఇందుకు సహకరిస్తాయి. నయాసిన్ విటమిన్ మాంసం, మొలకెత్తిన గింజలు, పచ్చిబఠాణి, ఆకుపచ్చ బఠాణి, వేరుశెనగ, మొలకెత్తిన గోధుమ గింజల నుంచి ఎక్కువగా దొరుకుతుంది. ఈ విటమిన్ జుట్టు తెల్లబడకుండా రాలిపోకుండా కాపాడుతుంది.
కుదుళ్ల ఆరోగ్యానికి చేపల్లో మాంసకృత్తులు అధికం శిరోజాల ఎదుగుదలకి ఇవి కీలకం. వీటి నుంచి ఒమగా 3బాగా లభిస్తుంది. ఇది జుట్టు పొడిబారిపోకుండా కాపాడుతుంది. చుండ్రురాకుండా చూస్తుంది. గుడ్డు, చేపలు తినలేని వారికి సోయా చక్కని ప్రత్యామ్నాయం. ఆరోగ్యవంతమైన కుదుళ్లకి సోయాలోని లైసీన్ అమినో ఆమ్లం బాగా ఉపకరిస్తుంది మొలకలొచ్చిన గోధుమలలో విటమిన్ ఇ ఎక్కువ.



Click it and Unblock the Notifications