Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఒత్తైన...మెరిసేటి కురుల కోసం....!

1. ఆముదం: కనీసం పది-పదిహేను రోజులకోసారి మీ జుట్టు కుదుళ్ళనుండి చివరి వరకు ఆముదపునూనెను పట్టించండి. అరగంట అయిన తర్వాత కుంకుడు కాయల రసంతో తలస్నానం చేయండి. మీకురులలో నిగారింపు వస్తుందంటున్ననారు నిపుణులు.
2. గుడ్డు: గుడ్డులోని తెల్లసొన, రెండు చెంచాల ఆముదం, ఒక స్పూను గ్లిజరిన్ కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి కాసేపయ్యాక తలస్నానం చేయండి.
3. తలస్నానం చేయడానికి ముందుగా ఓగంటముందు కొబ్బరినూనెను గోరువెచ్చగా వేడిచేసి తలకి పట్టించి గోరువెచ్చని నీటిలో తడిపిన టవల్‌ను చుట్టుకోవాలి. ఇలా ఓ గంటపాటు ఉంచి ఆ తర్వాత తలస్నానం చేయండి. మీ కురులు పట్టులాగా నిగనిగలాడుతుంటాయి. ఏపుగాకూడా పెరుగుతాయంటున్నారు ఆరోగ్యనిపుణులు.
4. తలస్నానం చేసేటప్పుడు వేడి ఎక్కువగానున్న నీటిని ఉపయోగించకండి. అలాగే వెంట్రుకలను రుద్దకండి. తలస్నానం పూర్తయిన తర్వాత వెంట్రుకలను ఆరబెట్టేందుకు మంచి తువాలును ఉపయోగించండి. తువాలును తలకు చుట్టి ఉంచండి. దీంతో వెంట్రుకలలోనున్న చెమ్మను తువాలు పీల్చేస్తుంది.
5. తల దువ్వేందుకు వెడల్పాటి దంతాలున్న దువ్వెనలు ఉపయోగించండి లేదా బ్రష్‌లను ఉపయోగించండి. వెంట్రుకలు చెమ్మగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోను దువ్వకండి. తల దువ్వేముందు చిక్కులుపడ్డ వెంట్రుకలను నిదానంగా విడదీయండి.
6. మీ వెంట్రుకలను అందంగా నిగనిగలాడేలా చేయాలనుకుంటే మీరు తీసుకునే ఆహార పదార్థాలలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూడండి. తాజా కూరగాయలు, పండ్లను ఆహారంగా తీసుకోండి.
7. తలస్నానం చేసిన తర్వాత మీ వెంట్రుకలకు రబ్బర్ బ్యాండ్ వేయకండి. రాత్రి సమయంలో వెంట్రుకలకు రోలర్‌లను ధరించకండి. ఇలా చేస్తే వెంట్రుకలు బలహీనమై రాలిపోయేందుకు ఆస్కారం ఎక్కువ.
8. వెంట్రుకలు పొడిబారినట్లుంటే వెంట్రుకలకు తేనెను పూసి అరగంట అయిన తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా చేస్తే మీ వెంట్రుకలు పట్టులా మెరవడమే కాకుండా నున్నగా తయారవుతాయంటున్నారు బ్యుటిషియన్లు.
9. వెంట్రుకలు చిట్లిపోయినట్లుంటే వెంట్రుకల చివర అర ఇంచి మేరకు కత్తిరించండి. దీంతో వెంట్రుకలు ఏపుగా పెరుగుతాయి.
10. ప్రస్తుతం మార్కెట్లో షాంపూ, కండీషనర్‌లలో సువాసలు వెదజల్లేందుకు కొన్ని రకాల రసాయనాలు, రంగులు వాడుతున్నారు. కాబట్టి మీరు వాడే షాంపూలను ఎన్నుకోవడంలో కాస్త మెళుకువలు పాటించండి.
11. మీరు యాంటీ డ్యాండ్రఫ్ షాంపూను ఉపయోగించేటట్లైతే ఇలాంటి షాంపూలను వారానికి ఒకసారే ఉపయోగించండి. ఎందుకంటే ఇవి చాలా హార్డ్ గా ఉంటాయి.
12. తగిన నూనెను పూసి వెంట్రుకలకు పోషణ అందిస్తుండాలి. దీంతోపాటు వెంట్రుకలను శుభ్రపరచుకోవడం కూడా ముఖ్యమే.
13. 30సంవత్సరాలకన్నా ముందుగానే మీ వెంట్రుకలు తెల్లబడుతున్నట్లైతే మీ వెంట్రుకలకు రసాయనాలతో కూడుకున్న షాంపూలను మీరు ఇదివరకే వాడినట్లు లెక్క లేదా మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై ఉంటారు లేదా మీరు శరీరానికి కావలసిన పోషక పదార్థాలు తీసుకోవడం లేదు.
14. వెంట్రుకలకు ఎక్కువ కలరింగ్, రీబౌండింగ్ మరియు రసాయనాల ఉపయోగించకండి. అయినాకూడా ఇవన్నీ చేస్తుంటే మీరు తగిన హెయిర్ కేర్ తీసుకోవాల్సిందే.
15. వారానికి రెండు సార్లు తప్పనిసరిగా తలకు నూనెను రాయండి. అది మీ వెంట్రుకలకు మంచి కండీషనర్‌గా ఉపయోగపడుతుంది. మీ వెంట్రుకలు కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి.



Click it and Unblock the Notifications