Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
జుట్టు ఆరోగ్యవంతంగా పెరగాలంటే మంచి పోషకాహారం అవసరం

జంక్ ఫుడ్‌లతో బరువు పెరుగుతారే కానీ కావలసిన పోషక తత్త్వాలు లభించవు. దీనితో రక్తహీనతకు గురవుతుంటారు. ఇలాంటివన్నీ అరికట్టాలంటే ఉద్యోగినులు తమ ఆహార అలవాట్లపై శ్రద్ధ వహించాల్సిందే. జుట్టు బాగుండడం అనేది మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ఆహారంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే జుట్టు నిర్జీవంగా తయారవుతాయి. జుట్టు రాలిపోవడం, చిట్లిపోవడం, పొడిబారడం మనం ఆరోగ్యంగా లేము అనడానికి సూచనలు. కొద్ది పాటి జాగ్రత్తలతో మంచి ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు అందంగా నిగ నిగలాడుతూ ఉంటుంది.
1. ఉసిరి జుట్టు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఎండు ఉసిరిని రాత్రంతా నీళ్లల్లో నానబెట్టి తలస్నానం చేయడానికి ఉపయోగించాలి.
2. బి విటమిన్ లోపించినప్పుడు జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది. కాబట్టి ప్రత్యేకించి బి6, బయోటిన్, ఫోలిక్ యాసిడ్స్, మెగ్నీషియం, సల్ఫర్, జింక్, సిలికా లాంటి మినరల్స్ ఉండే ఫుడ్ తీసుకోవాలి.
3. సిలికా: ఇది గ్రీన్ రెడ్ పెప్పర్, కీర దోస, బీన్స్ లో ఉంటుంది.
4. మెగ్నీషియం: సోయా ఉత్పత్తులన్నింటిలో మెగ్నీషియం ఉంటుంది. బాదం సహా డ్రై ఫ్రూట్స్‌లోనూ మెగ్నీషియం ఉంటుంది.
5. సల్ఫర్ :చేపలు, పాలు, ఉల్లిగడ్డలు, అల్లం, క్యాబేజ్ లలో సల్ఫర్ అధికంగా ఉంటుంది.
6. ఫ్యాటీ యాసిడ్ :జుట్టు పొడిబారకుండా ఉండటానికి అవిశలు ఎంతో ఉపయోగపడతాయి. రోజ్ ఆయిల్ కూడా మంచిది.
7. ఐరన్ లోపం: ఐరన్ లోపంతో జుట్టు ఎక్కువగా రాలుతుంది. సీ విటమిన్ ఎక్కువగా ఉన్న పళ్లను, కూరగాయలను తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. నిమ్మ జాతి పళ్లు, కాలీఫ్లవర్స్, ఆకు కూరలలో ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్ సమస్య వల్ల కూడా జట్టు రాలుతుంది. విటమిన్ ఎ, ఆయోడిన్‌తీసుకోవడం వల్ల జట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. క్యారెట్, పాలకూర, అవిశల నూనె, గుమ్మడి పండు, సముద్ర ఉప్పు తీసుకోవడం వల్ల దీనిని నివారించవచ్చు.



Click it and Unblock the Notifications