Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మోడ్రన్ మీస కట్టు కోసం ప్రయత్నిస్తున్నారా...?

ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్ క్యాచ్ చేస్తూ, తమ మీసాల స్టయిల్‌ను కూడా మార్చుకుంటున్నారు. అయితే ఇది అన్నిసార్లు వారికి ముఖ సౌందర్యానికి నప్పకపోవచ్చు. ఒకరి మోడ్రన్ మీస కట్ చూసి అసూయతో మరొకరు అలా చేయించుకోవాలని ప్రయత్నిస్తే ఫలించకపోవచ్చు. ఎందుకంటే మగవారి హెయిర్ స్టైల్ కంటే మీస కట్ మెయింటైన్ చేయడం కొంచెం కష్టమైన పనే.
మీసాలను తనంతట తాను స్టయిలిష్‌గా ట్రిమ్ చేసుకోవాటం కొద్దిగా కష్టమే. మీసాలను ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తూ, పాటు కొన్ని జాగ్రత్తలను తీసుకున్నట్లయితే మీకు నచ్చిన మీస కట్ మీ సొంతమవుతుంది.
మీసాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి:
మీ మీసాన్ని ట్రిమ్ చేయడానికి ముందు, దానిని సరిగ్గా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తేలికపాటి షాంపూను ఉపయోగించి, మీసాలను శుభ్రం చేసుకోవాలి. లేదా ఏదైనా ఫేస్ వాష్ లేదా లిక్విడ్ సోప్ వంటివి కూడా ఉపయోగించవచ్చు. మీసం శుభ్రంగా ఉంచుకోవడానికి హాండ్ వాష్‌ను ఉపయోగించకూడదు. సాధారణ సోపులు, హ్యాండ్ వాష్‌లు మీసపు వెంట్రుకలు రఫ్‌గా మారి, పెళుసుగా మారేలా చేస్తుంది.
బ్రెషింగ్ విధానం:
మెదటి చిట్కా ప్రకారం మీసం శుభ్రపరుచుకొన్న తర్వాత, పొడి టవల్‌తో తడిని పూర్తి తొలగించి, తర్వాత సన్నని దువ్వెన తీసుకొని దాంతో సున్నితంగా దువ్వాలి. ఇలా చేయడం వల్ల రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి మీసంలో నీటిచుక్కలు ఏవైనా మిగిలిఉంటే సులభంగా తొలగిస్తుంది. రెండవది ముఖం మీద వెంట్రుకలు లేదా ఇతర పొక్కులు మలినాలు, ఏవైనా మీసంలో చిక్కుకొన్నా తొలగిపోతాయి.
మీసం ట్రిమ్ చేయడానికి కరెక్ట్ సామాగ్రిని ఎంపిక:
మీ మీసం యొక్క స్టైల్ ను బట్టి మీరు మీసం ఉపయోగించే పరికరం లేదా సామాగ్రిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఫర్ ఫెక్ట్ ట్రిమ్ వస్తుంది. ఒక వేళ ముఖం (గడ్డము)మీద వెంట్రుకులు ఉన్నట్లైతే వాటిని కత్తెరతో తొలగించాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు కోరుకొన్న మీసం షేప్ రాకుండా, మీసం ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమించి దట్టంగా పెరిగినట్లైతే, సాదారణ పద్దతిలో కానీ, లేదా ఎలక్ట్రిక్ రేజర్ తో కానీ షేవ్ చేసిన తర్వాత ట్రిమ్ చేయించుకోవడం మంచిది.
సరైన పొజీషన్ లో అద్దం:
మీరు మీసం ట్రిమ్ చేసుకొనేప్పుడు, లేదా ట్రిమ్ చేయించే సమయంలో అద్దం తప్పనిసరిగా మీకు కనబడేవిధంగా అమర్చుకోవాలి. దాంతో మీ మీసకట్ ఎలా ఉందో మీకు తెలుస్తుంది. మీరు సాధారణంగా కొన్ని ప్రదేశాల్లో క్లోజప్ లో కనబడే అద్దం బెటర్ గా కనిపిస్తుంది. ఇలాంటి అద్దంలో ముఖం క్లియర్ గా కనిపించి ట్రిమ్ చేయడానికి సహాయపడుతుంది.
ట్రిమ్ చేసిన తర్వాత:
మీసాలు ట్రిమ్ చేసిన తర్వాత వాటి సంబందిత వెంట్రుకలు శరీరంపై చెల్లాచెదురుగా పడి ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా బాడీ వాష్ చేసుకోవాలి. తర్వాత జెల్ రాసుకోవడం వల్ల మీకు నచ్చే ఆకారంలో మీ మీస కట్ మీ సొంత అవుతుంది.



Click it and Unblock the Notifications