Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మీ కురులను స్టైల్ గా మలచుకోవాలంటే...!?

అయితే హెయిర్ స్టైల్ విషయంలో అందరికీ నప్పవు. అది వారి పర్సనాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి హెయిర్ స్టైల్ మార్చాలనుకొన్నప్పుడు సౌందర్య నిపుణులను, బ్యూటీషియన్ల సలహా మేరకు మీకు నప్పే విధంగా చేయించుకోవడం మంచిది. హెయిర్ స్టైల్ కోరుకొనే వారి కోసం కొన్నిచిట్కాలు....
1. కురులను తరచూ కట్ చేస్తూ ఉండాలి. సంవత్సరానికో ఆర్నెల్లకో ఒక్కసారి పెద్ద మొత్తంలో కట్ చేసే కంటే అప్పడప్పుడు కట్ చేయడం వల్ల జుట్టు చివర్లు చిట్లకుండా చేసి, పెరుగుదలకు సహాయపడటమే కాకుండా కురులకు మంచి ఆకృతి వస్తుంది. కురులు ఆరోగ్యంగాను ఉంటాయి.
2. పొడి జుట్టును ఆర బెట్టడానికి బ్లో డ్రైయర్ ను ఎప్పటికీ ఉపయోగించ కూడాదు.
3. హెయిర్ స్టైల్ మార్చాలనుకొన్నప్పుడు కురుల పొడవు మీద ఆధారపడి ఉంటుంది. పొట్టిగా ఉండే కురులను స్టైల్ గా మార్చడం వల్ల మరింత కురచగా అయ్యి అందవిహీనంగా కనబడుతాయి. కాబట్టి హెయిర్ స్టైల్ మార్చాలనుకొన్నప్పుడు కురులను కొద్దిగా పెరగనిచ్చి కట్ చేయడం వల్ల మంచి ఆకతితో పాటు, చిట్లను జుట్టును తొలగించడానికి సహాయపడుతుంది.
4. సహజగా తయారు చేసినటువంటి హెయిర్ బ్రష్ లను ఉపయోగించడం మంచిది. ప్లాస్టిక్ లేదా పాలిస్టర్ హెయిర్ బ్రష్ లను కూడా ఉపయోగించవచ్చు. ఇవి జుట్టును సున్నితంగా ఉండేలా ఉంచుతాయి. కురులను తడిగా ఉన్నప్పుడు దువ్వడం మంచి పద్దతి కాదు. తడి ఆరన తర్వాత దువ్వుకోవాలి. తడి జుట్టును దువ్వడంలో కురులు మద్యలో తెగిపోతాయి.
5. తడి వెంట్రుకలను పొడి చేయడానికి డ్రైయ్యర్ ను మొదటి నుంచి కురుల క్రింది వరకూ తీసుకొంటూ రావాలి.
6. కర్లింగ్ హెయిర్ ఉన్నట్లైతే మీ బ్లో డ్రైయర్ యొక్క ప్లాన్ నాజిల్ తో హెయిర్ డ్రై చేసుకోవాలి. అలాగే స్పైరల్ దువ్వెనెతో దువ్వడం వల్ల హెయిర్ మీకు కావాల్సిన రీతిలో అమరి ఉంటుంది.
7. తకయే కండీషనర్ అప్లై చేయడం వల్ల కురుల దృడంగా ఉంటాయి. కండీషనర్ వాడడం వల్ల కురుల తెగిపోకుండా, సూర్య రశ్మి నుండి కురులను కాపాడుతుంది.
8. చిక్కు బడిన కురులను నైస్ గా దువ్వాలనుకొన్నప్పుడు మొత్తం కురులను రెండు బాగాలుగా చేసి ఒక్కో బాగాన్ని సున్నితంగా దువ్వాలి. అప్పుడు చిక్కు వీడి అందంగా కనిపిస్తాయి.
9. వుడ్ మసాజ్ దువ్వెనతో దువ్వడం వల్ల తలలో రక్త నాలాలకు రక్త ప్రసరణ బాగా జరిగి కురులు పెరగడానికి సహకరిస్తుంది.
10. కురులను దువ్వడానికి ఉపయోగించే బ్రెష్ లు ఎప్పుడు సున్నితంగా ఉన్నటువంటివి ఎంపిక చేసుకోవాలి. రఫ్ గా ఉన్న బ్రష్ లను ఉపయోగించడం వల్ల కురులకు హాని కలుగజేస్తాయి.



Click it and Unblock the Notifications