Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
నిగనిగలాడే నల్లటి పొడవాటి జుట్టుకోసం...!
Hair Care
oi-Saraswathi
By Sindhu

2. ఒక కోడిగుడ్డులోని సొనను చిన్న గిన్నెలో వేసి బాగా చిలకరించి అందులో ఒక నిమ్మపండు రసం కలపండి,నాలుగు చెంచాల పెరుగును కూడా ఈ సొనకు కలిపి తలకు పట్టించి అరగంటసేపు వుండండి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే మీ వెంట్రుకలు మృదువుగా, కాంతివంతంగా వుంటాయి.
3. కొబ్బరి నూనెలో వెల్లుల్లిపాయలను ఉడికించి, వడకట్టి ప్రతిరోజూ తలకు రాస్తే తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి.
4. ఉసిరిపొడిని ఇనప బౌల్లో రాత్రిపూట నానవేసి ఉదయాన్నే ఆ మిశ్రమాన్ని బ్రష్ తో వెంట్రుకలకు పట్టించాలి. తర్వాత తలకు షవర్ క్యాప్ పెట్టుకోవడం వల్ల మిశ్రమం ఒంటిమీద పడదు. గంట తర్వాత స్నానం చేస్తే సరి.
5. ఎండలో బయటకి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ ని చర్మ సంరక్షణ కోసం వాడుతుంటారు. అలాగే ఎక్కువ సేపు ఎండలో తిరగాల్సి ఉన్నప్పుడు సన్ స్క్రీన్ ఉన్న జుట్టు ఉత్పత్తులను వాడవచ్చు.
6. ఎక్కువగా జుట్టు రాలుతోందా ఒక ఉల్లిపాయను మెత్తగా పేస్టులా చేసుకోవాలి. దానికి చెంచాడు తేనె కలపాలి. తలకు పట్టించి గంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
7. ఒక కప్పు దంపుడు బియ్యానికి మూడు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. అన్నం ఉడికిన తర్వాత బియ్యాన్ని విడిగా తీయగా వచ్చిన గంజిని చల్లారబెట్టాలి. ఈ గంజిని ఆరంగ ఆరంగా కనీసం మూడుసార్లు జుట్టుకు పట్టించాలి. తర్వాత చల్లని నీటితో శిరోజాలను శుభ్రపరచుకోవాలి. ఇది జొన్న పీచులా పలుచగా ఉండే జుట్టును ఒత్తుగా చేస్తుంది.
8. ఒక టీ స్పూను నెయ్యి, టీ స్పూను చక్కెర, టీ స్పూను మిరియాల పొడి కలిపి మాడుకు అంటేలా తలకు మర్దనా చేసి ఒక పదినిమిషాల తరువాత తలస్నానము చేయాలి. ఇది చుండ్రును నివారించడమే కాకుండా జుట్టును మెరిపించడానికి తోడ్పడుతుంది.
9. ఒక్కోసారి తలంతా దురద పుడుతుంది. అలాగని ఊరికే గోకుతుంటే మాడు పుండు పడుతుంది తప్ప దురద మానదు. ఇందుకు బీట్‌రూట్ రసం మంచి చికిత్స. అందుకు ఏం చేయాలంటే తాజా బీట్ రూట్‌ను చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో చిక్కటి రసం తీయాలి. దీనిని నేరుగా తలకు పట్టించుకోవాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. జుట్టు పట్టులా మెరుస్తుంది.
10. కొంతమంది జుట్టు జిడ్డుగా, నూనెకారుతూ ఉంటుంది. తలస్నానం చేసిన కొద్దిసేపటికే జుట్టు జిడ్డుగా తయారై రాలిపోతుంటుంది. ఇటువంటి వారు ఒకవేళ కండీషనర్ వాడదలుచుకుంటే పెరుగును మాత్రం వాడుకోవాలి. కండీషనర్‌ను తలకు కాకుండా వెంట్రుకల కొసలకు ప్రయోగించాలి.
11. గాలి తగిలేలా మూడు రోజులు నిల్వ ఉంచిన పెరుగును తలకి మర్దన చేసి తల స్నానం చేస్తే చుండ్రు పోతుంది.
12. చిన్న గిన్నెలో నీళ్లుపోసి అందులో వాడేసిన టీ పొడి కానీ, కాఫీ పొడిని కాని వేయాలి. ఉసిరిపొడితో పాటు ఉల్లి తొక్కల్ని అందులో వేసి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి. ఆ మిశ్రమాన్ని శిరోజాలకు పట్టించి మూడు గంటలు ఆగితే జుట్టుకు కావలసిన బలంతో పాటు మెరుపుని అందిస్తుంది.
13. జుట్టు ఆరోగ్యవంతంగా పెరగాలంటే మంచి పోషకాహారం తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పొడవాటి జుట్టుని ఇష్టపడేవారు, జుట్టు మరింత పొడవు అయితే బాగుండు అనుకునేవారు, ప్రొటీన్లు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి. పప్పు, మజ్జిగ, గుడ్లు, పప్పుధాన్యాలు, చికెన్, పన్నీర్ ఇవన్నీ జుట్టు పెరిగేందుకు కావలసిన పోషకాలు అందిస్తాయి.
14. జుట్టుకు మంచి షాంపూ, కండీషనర్‌లు రాస్తూ శ్రద్ధతీసుకుంటున్నా చుండ్రు, జుట్టు ఊడిపోవటం మొదలైన సమస్యలు వెంటాడుతుంటాయి.
15. తల స్నానానికి ముందు తలకు నూనె పెట్టుకుని, మృదువైన షాంపూతో తల స్నానం చేయండి. జుట్టు పొడిబారటం తగ్గుతుంది.
Comments
English summary
Tips for Growing Black Hair long...! | నిగనిగలాడే నల్లటి పొడవాటి జుట్టుకోసం...!
Story first published: Wednesday, May 9, 2012, 17:38 [IST]
Other articles published on May 9, 2012



Click it and Unblock the Notifications