Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నిగనిగలాడే కురుల సౌందర్యం...!

అదేపనిగా తల దువ్వుకుటుంటే జుట్టు ఆరోగ్యంగా ఉండదు. దానివల్ల కురులు బిరుసుగా మారతాయి. చిట్లిపోతాయి కూడా. చిక్కుపోయేంత వరకు దువ్వుకుంటే చాలు అది కూడా మరీ బలవంతంగా తీయకూడదు. ముందుగా చేత్తో కొద్దిగా తీసుకుని ఆ తర్వాత వెడల్పాటి దంతాలున్న దువ్వెనతో దువ్వుకుంటే చాలు.
చివర్లు చిట్లిన శిరోజాలను నివారించేందుకు కండిషనర్లు వాడితే మార్పురాదు. కండిషనర్ జుట్టుకు పోషణనందిస్తుంది. తేమగా పట్టుకుచ్చులా ఉండేలా చేస్తుంది. చిట్లిన చివర్లను నివారించాలంటే...వాటిని కత్తిరించడమే పరిష్కారం. దానివల్ల సమస్య పెరగదు. ప్రతి మూడు నెలలకోసారి చివర్లు కొద్దిగా కత్తిరించుకుంటే ఈ సమస్య ఎదురు కాదు.
షాంపు, కండిషనర్ ఎక్కువగా రుద్దుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుదనుకోవడం పొరబాటు రూపాయి నాణెమంత తీసుకుంటే చాలు. ఒక వేళ ఎక్కువగా వాడామా..జుట్టు పొడిబారుతుంది. కండిషనర్ ను ఎక్కువగా రాసుకుంటే శిరోజాల్లో జిడ్డుగా అనిపిస్తాయి. అందుకే సాధ్యమైనంత వరకు తక్కువగా వాడాలి. జుట్టు పొడవును బట్టి మరికాస్త తీసుకుంటే సరిపోతుంది.
జుట్టుకు రంగు వేసుకునే క్రమంలో కేశ సంరక్షణ పై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. రంగు వేసుకుంటున్నప్పుడు..అందుకు సంబంధించిన షాంపు, కండిషనర్ ను మాత్రమే వాడాలి. నిర్లక్ష్యం చేస్తే సమస్యలు తప్పవు...



Click it and Unblock the Notifications