Latest Updates
-
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.?
డ్రై షాంపు అంటే ఏమి..? డ్రై షాంపూ ఎలా వాడాలి....?
డ్రై షాంపు అంటే ఏమి..?
డ్రై షాంపూ అంటే మనలో ఎంత మందికి తెలుసు..?ఎందుకు ఉపయోగిస్తారు? అంటే చాలా మందికి తెలిసుండకపోవచ్చు. ఎందకంటే సాధారణంగా మనం అంతా లిక్విడ్ షాంపూలకు అలవాటు పడిపోయాం కాబట్టి. మరి అయితే డ్రై షాంపూ గురించి తెలుసుకొందాం.. డ్రై షాంపూ అంటే ఇది ఒక పౌడర్. ఈ పౌడర్ ను తలకు స్ప్రే చేయడం వల్ల వెంట్రుకల్లో ఉన్న జిడ్డును, ఆయిల్ ను సులభంగా తొలగించి హెయిర్ ఫ్రెష్ గా ఉండేట్లు చేస్తుంది. ఇది అప్లై చేసిన రెండవ రోజూ హెయిర్ గమనించినట్లైతే జిడ్డును, ఆయిల్ ను పూర్తిగా వదిలించి వెంట్రుకలకు వాల్యూమ్ పెచి, సువాసనలు వెదజల్లుతూ, పరిశుభ్రమైన, ప్రకాశవంతమైన కేశాలను మీ సొంతం చేస్తుంది. ఇది సాంప్రదాయ పద్దతిలో లభించేటటువంటి పౌడర్. అతి తక్కువ సమయంలో కేశాలను ఫ్రెష్ గా తయారు చేస్తుంది.

డ్రై షాంపూను ఎందుకు ఉపయోగించాలి:?
డ్రై షాంపూను ఉపయోగించడానికి అద్భుతమైనటువంటి కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా డ్రై షాంపూను తలలోని జిడ్డును తొలగించి, కేశాల మూలలను ఆరోగ్యకరంగా ఉండేందుకు సహాయపడుతుంది. రెండవది డామేజ్డ్ హెయిర్(కురులు మద్యలో కట్ అవ్వడం, రాలిపోవడాన్ని) అరికడుతుంది. ప్రతిరోజూ షాంపూను ఉపయోగించే అవసరం ఉండదు. ప్రతి రోజూ షాంపూను తలస్నానం చేయడం, హెయిర్ డ్రైయర్ ను ఉపయోగించడం, హెయిర్ స్టైల్ మార్చడం వంటివి తలకు, కురులకు ఒత్తిడి అధికమవుతంది. వారంలో మూడు నాలుగు సార్లు తలస్నానం చేసేట్లైతే మద్యలో ఒక్కసారి తప్పకుండా డ్రై షాంపూను ఉపయోగించడం మంచిది. దాంతో హెయిర్ కి డ్యామేజ్ కలగకుండా, తెగిపోవడాన్ని అరకడుతుంది. మూడవది: మీరు ప్రయాణం చేసే సమయంలో లేటుగా లేచి, అతిత్వరగా రెడీ అవ్వాలనుకొంటే, ఈ డ్రై ఫాంపూ స్ప్రే చేసి కురులను నీటితో శుభ్రం చేసుకోవడం చాలా సులభం అవుతుంది. దాంతో మీ అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది.
ఎలా ఉపయోగించాలి?
1. డ్రై షాంపూను అప్లై చేసే ముందు మీ కురులకు సరిపడే దువ్వెనెతో వెంట్రుకల మూలాల నుండి దువ్వాలి. కురులు ఎటువంటి చిక్కులు లేకుండా ఉండేలా చూసుకోవాలి.
2. డ్రై షాంపూను తలకు దగ్గరగా, కురుల మెత్తానికి పడే విధంగా, జుట్టు మొదళ్ళకు అంటే విధంగా స్టెయిట్ గా డ్రై షాంపూ పౌడర్ ను స్ర్పే చేసుకోవాలి.
3. తల వెంట్రుకలను విడదీసి లోపల, పైన రెండు వైపులా డ్రై షాంపూ పొడిని స్ప్రే చేసుకోవాలి.
4. తర్వాత మీ చేతి మునివేళ్ళతో తలంతటినీ, తల మాడుకు కూడా సున్నితంగా మర్ధన చేయాలి.
5. తలను క్రిందికి వచ్చి, జుట్టు లోపలి భాగంలో కూడా డ్రైషాంపూను స్ప్రే చేసి మర్థన చేయాలి. అవసరమైతే మళ్ళీ దువ్వెనెతో దువ్వుకోవచ్చు. ఇలా డ్రై షాంపూను అప్లై చేసిన తర్వాత 5-10నిమిషాలు అలాగే ఉంచడం వల్ల వెంట్రలకు బాగా స్ప్రెడ్ అవుతుంది. మీ జుట్టు ఎక్కువ ఆయిలీగా ఉంటే 10-15నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత దువ్వెనతో తలంతా బాగా దువ్వి డ్రై షాంపూనంతటిని రాలిపోయేలా చేస్తే, కురులు తాజాగా ఫ్రెష్ గా కనబడుతాయి.
6. శిరోజాలు దువ్వుకుంటే, షాంపూ సమంగా పడుతుంది. జుట్టులో ఏమాత్రం జిడ్డు ఉన్నా అది పీల్చేస్తుంది. జుట్టు అందంగా ఆరోగ్యంగా కనిపిస్తుంది. తలస్నానం చేసే అవసరం ఉండదు. తలస్నానం చేయాలనుకునే వారు మరే ఇతర షాంపూలను ఉపయోగించకుండా ఒట్టి నీళ్ళతో మాత్రమే తలను శుభ్రపరచుకోవచ్చు. డ్రై షాంపూను వాడటం వల్ల జిడ్డు వదలి, సిల్కీ, షైనీ హెయిర్ తో పాటు స్ట్రెయిట్ హెయిర్ మీ సొంత అవుంతుంది.



Click it and Unblock the Notifications